Jump to content

జూలై 16

వికీపీడియా నుండి
(జులై 16 నుండి దారిమార్పు చెందింది)

జూలై 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 197వ రోజు (లీపు సంవత్సరములో 198వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 168 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

[మార్చు]
  • 0622: ఇస్లామిక్ కేలండర్ (కాల గణన) మొదలైన రోజు. (హిజ్రీ శకం)
  • 1439: ఇంగ్లాండ్ లో ముద్దు పెట్టుకోవటం నిషేధించారు.
  • 1661: బేంక్ ఆఫ్ స్టాక్‌హోమ్ మొదటి సారిగా ఐరోపాలో "బేంక్ నోట్స్"ని విడుదల చేసింది. (ప్రవేశ పెట్టింద్).
  • 1880: డాక్టర్ ఎమిలి హోవార్డ్ స్టోవ్, కెనడాలో సేవ (ప్రాక్టీసు) చేయటానికి అనుమతి (లైసెన్స్) పొందిన తొలి మహిళ.
  • 1862: లూయిస్ స్విప్ట్ అనే శాస్త్రవేత్త 'స్విప్ట్-టట్టల్' అనే తోకచుక్కను కనుగొన్నాడు.
  • 1918: నికొలస్ II, రష్యన్ జార్ (చక్రవర్తి) ని అతని కుటుంబాన్ని (భార్య, ఐదుగురు పిల్లలు) ఉరి తీసారు.
  • 1926: నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది.
  • 1936: రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు.
  • 1941: 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.
  • 1945: "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టారు..
  • 1945: మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
  • 1965: 'ది మాంట్ బ్లాంక్' రోడ్ సొరంగం (ఫ్రాన్స్ దేశాన్ని, ఇటలీ దేశాన్ని కలిపే సొరంగం) ప్రారంభమయ్యింది.
  • 1969: అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
  • 1979: సద్దాం హుస్సేన్, ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు.
  • 1990: భూకంపం రిక్టర్ స్కేల్ 7.8 తీవ్రతతో, భూకంపం, ఫిలిప్పీన్స్ లో వచ్చి, 1600 మంది ప్రజలు మరణించారు. వేయికి పైగా ప్రజలు కనిపించకుండా పోయారు. మనీలా, చబనతుయన్, బగుయొవొ, లుజన్ ప్రాంతాలు బాగా నష్టపోయాయి. 1976 నుంచి ఆ ప్రాంతంలో జరిగిన భూకంపాలలో ఇది చాలా పెద్ద భూకంపం.
  • 1972: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది.
  • 1976: ఆర్.డి. భండారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు)
  • 1983: యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
  • 1993:బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
వి.రామకృష్ణ
  • 1999 - ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు.
  • 2015: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

జూలై 15 - జూలై 17 - జూన్ 16 - ఆగష్టు 16 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూలై_16&oldid=4226381" నుండి వెలికితీశారు