నందికొండ పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగార్జున సాగర్ డామ్.నందికొండ

నందికొండ పురపాలక సంఘం,తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది ఇంతకముందు నాగార్జున సాగర్ ఆనకట్ట ఎడమవైపున ఉన్నహిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ అనే పేర్లుతో కలిగిన ప్రాంతాలుగా ఉండేది.పురపాలక సంఘం ఏర్పడకుముందు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మించిననాటినుండి హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీలను ఇన్నాళ్లూ ప్రాజెక్టు నిర్వహణ నిధులతోనే ఎన్నెస్పీ అధికారులు కాలనీల నిర్వహణ భాధ్యతను నిర్వర్తించారు.[1]

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతం బౌద్ధ మతం ప్రభావానికి పేరుగాంచింది.ఉభయ తెలుగు రాష్టాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో నాగార్జునసాగర్ ఆనకట్ట ఒకటి.[2] ఈ ప్రాంతం యొక్క నిర్వహణ అంతకుముందు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ అథారిటీ క్రింద ఉంది. కానీ తరువాత రాష్ట్రంలో కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఇది మునిసిపాలిటీగా మారింది.నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరుల, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కూలీలు నివాసముండేందుకుగాను తాత్కాలికంగా హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ, రైట్‌బ్యాంకు కాలనీలను ఏర్పాటు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన సమయంలో రైట్‌బ్యాంక్‌ కాలనీ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లింది.హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ కాలనీలు రెండు తెలంగాణలో పరిధిలో ఉన్నాయి.ఇది నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

పురపాలక సంఘానికి కొత్త కార్యాలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన పురపాలక సంఘంకార్యాలయ భవనాన్ని ఇంధన శాఖా మంత్రి జి,జగదీశ్వరరెడ్డిచే ప్రారంభంచబడింది.[3]

ఎన్నికల వార్డులు[మార్చు]

పురపాలక సంఘం పరిధిని 12 ఎన్నికల వార్డులుగా విభజించబడ్డాయి.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'నందికొండ'కు క్వార్టర్లే అండ..!". Sakshi. 2019-07-23. Retrieved 2020-01-30.
  2. India, The Hans (2019-12-30). "Nagarjunasagar: Newly-formed Nandikonda municipality gears up for polls". www.thehansindia.com (in ఆంగ్లం). Retrieved 2020-01-30.
  3. India, The Hans (2018-08-03). "Nandikonda has historical significance: Minister G Jagadish Reddy". www.thehansindia.com (in ఆంగ్లం). Retrieved 2020-01-30.
  4. https://cdma.telangana.gov.in/Ward%20Delimitation%20Gos/GO%20360%20-%20%20Nandikonda.pdf

వెలుపలి లంకెలు[మార్చు]