జనవరి 15
స్వరూపం
(15 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 15వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 350 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 351 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
జార్జ్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విప్లవవాద విద్యార్థుల ఉద్యమ స్థాపకుడు, విద్యార్థి నాయకుడు.
సంఘటనలు
[మార్చు]- భారత సైనిక దినోత్సవం
- 1943: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
- భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు (కె.ఎం.కరియప్ప) ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.
- 1966: భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) కు సైన్యంతో సమాన హోదా లభించింది.
- 1970: బోయింగ్ 747 విడుదలయ్యింది
- 1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్మ్యాచ్లో భారత లెగ్‌స్పిన్నర్ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు (16/136, 8/61, 8-75) తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.
- 2001: జిమ్మీ వేల్స్, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.
- 2008: స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు
జననాలు
[మార్చు]- 1887: త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త. (మ.1943)
- 1915: చాగంటి సోమయాజులు, ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994)
- 1921: బాబాసాహెబ్ భోసలే, భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
- 1929: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు,
- 1934: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
- 1952: జనువాడ రామస్వామి, చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.
- 1956: మాయావతి, రాజకీయవేత్తి, భారత దేశము
- 1956: సంపత్ రాజు, తెలుగు చలనచిత్ర ప్రతి నాయకుడు, దక్షిణ భారత చిత్రాల నటుడు.
- 1960: తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)
- 1960: తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు
- 1966: శైలజామిత్ర, తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది.
- 1967: భానుప్రియ, తెలుగు, తమిళ సినీనటి
- 1981: స్నిగ్ధ, తెలుగు చలన చిత్ర సహాయ పాత్రల నటి.
- 1991: రాహుల్ రామకృష్ణ, తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత.
మరణాలు
[మార్చు]- 1940: వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి
- 1941: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు (జ.1856)
- 1998: పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. [జ.1898]
- 2012: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913)
- 2014: నామ్‌దేవ్ ధసల్ మరాఠీ కవి, రచయిత. దళిత్ పాంథర్స్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1949)
- 2019: మొదలి నాగభూషణశర్మ, రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. (జ.1935)
- 2023: ముకర్రం జా, నిజాం వారసుడు (జ. 1933)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]జనవరి 14 - జనవరి 16 - డిసెంబర్ 15 - ఫిబ్రవరి 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |