ఆగష్టు 5
Jump to navigation
Jump to search
ఆగష్టు 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 217వ రోజు (లీపు సంవత్సరములో 218వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 148 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1100: హెన్రీ I, వెస్ట్ మినిష్టర్ అబ్బే లో, ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషిక్తుడయాడు.
- 1583: సర్ హంఫ్రీ గిల్బర్ట్ మొట్టమొదటి ఆంగ్లేయుల వలస ను, ఉత్తర అమెరికా లో, నెలకొల్పాడు. ఆ ప్రాంతాన్నిన్యూపౌండ్ లాండ్ లోని సెయింట్ జాన్ గా పిలుస్తున్నారు.
- 1624: విలియమ్ జేమ్స్టౌన్, ఆంగ్లేయులు ఆక్రమించిన (వర్జీనియా, అమెరికా) లో పుట్టిన మొదటి నీగ్రో.
- 1845: ఆస్ట్రేలియా లోని 'కింగ్ ఐలేండ్' ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో, 407 మంది మరణించారు.
- 1858: మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు.
- 1861: అమెరికా సైనిక దళాలు, 'సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే' శిక్షను రద్దు చేసింది. (క్రమశిక్షణను పాటించని కొందరి సైనికులకు ఈ శిక్ష విధించేవారు) .
- 1861: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
- 1864: తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త జియోవన్ని దొనాతి
- 1874: ఇంగ్లాండ్‌లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని, జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టింది.
- 1879: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో 'గ్యాస్ లైట్ల' వెలుతురులో క్రికెట్ ఆడారు.
- 1882: స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికి అమెరికా అనుమతించి, ఆధునిక నౌకాదళానికి నాంది పలికింది.
- 1882: మార్షల్ లా (సైనిక దళాల న్యాయం), జపాన్‌లో చట్టమయ్యింది.
- 1882: స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని అమెరికాలో స్థాపించారు.
- 1882: స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి, బెడ్లోస్ ఐలేండ్ (న్యూయార్క్ హార్బర్) శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో వర్షం కురుస్తున్నది.
- 1905: నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది.
- 1912: జపాన్ లోని టోక్యో నగరంలోని "గింజా" అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించారు.
- 1914: మొదటి ప్రపంచ యుద్ధంలో, జర్మనీ దేశం, సోవియట్ యూనియన్ దేశం, మీద యుద్ధం ప్రకటించినప్పుడు, అమెరికా తనను తాను, తటస్థ దేశంగా ప్రకటించుకున్నది.
- 1914: అమెరికా లోని ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లేండ్ నగరంలో మొట్టమొదటి ట్రాఫిక్ లైట్లు ప్రారంభించారు.
- 1923: ఇంగ్లీష్ ఛానెల్‌ని ఈదిన మొదటి అమెరికా ఈతగాడు హెన్రీ సల్లివాన్
- 1962: నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు.
- 1963: ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి
- 1963: అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది.
- 1973: ఇద్దరు ఆరబ్ తీవ్రవాదులు, ఏథెన్స్ లోని విమానాశ్రయంలో గుంపుగా ఉన్న ప్రయాణీకుల మీద కాల్పులు జరపగా, ముగ్గురు మరణించగ, 55 మంది గాయపడ్డారు.
- 1984: జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్ గెలుచుకున్నది.
జననాలు
[మార్చు]- 1896: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)
- 1862: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890) .
- 1908: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (మ.1975)
- 1930: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012)
- 1989: డా: ముప్పిడి రవి, సంఘ సేవకుడు మరియు పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ నిర్మాతలలో ఒకరు
- 1948: వడ్డేపల్లి కృష్ణ, లలిత గీతాలు, గేయ రచయిత
- 1950: ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త.
- 1974: కాజోల్, భారతీయ సినీ నటి.
- 1980: ఉదయ భాను, టెలివిజన్ యాంకర్, చలన చిత్ర నటి.
- 1985: మమతా మోహన్ దాస్, సినీ నటి, నేపథ్య గాయని.
- 1987: జెనీలియా, తెలుగు,తమిళ,కన్నడ, హిందీ చిత్రాల నటి.
- 1996:ఆషికా రంగనాథ్ , తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల నటి.
మరణాలు
[మార్చు]- 1895: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (జ.1820)
- 1950: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890)
- 1962: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926)
- 1991: సొయిఛిరో హోండా, హోండా కంపెనీ స్థాపకుడు., కాలేయ కేన్సర్ తో 84వ ఏట మరణించాడు (జ.1906)
- 1984: రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10)
- 1997: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922)
- 2022: భీమపాక భూపతిరావు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
- జాతీయ ఆవాల దినోత్సవం (మొదటి శనివారం.)
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 5
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 4 - ఆగష్టు 6 - జూలై 5 - సెప్టెంబర్ 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |