Jump to content

మెదక్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(మెదక్ పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)
మెదక్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామెదక్ జిల్లా
Government
 • Bodyమెదక్ పురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total29.00 కి.మీ2 (11.20 చ. మై)
జనాభా
 (2011)[2]
 • Total44,255
 • జనసాంద్రత1,500/కి.మీ2 (4,000/చ. మై.)
భాష
 • అధికారకతెలుగు
పిన్‌కోడ్
502110

మెదక్, తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన ఒక పట్టణం,పురపాలక సంఘం.[1]మెదక్ పట్టణం హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మెదక్ పట్టణం 1952లో మునిసిపాలిటీగా ఏర్పడింది.ప్రస్తుతం ఇది జిల్లాలో గ్రేడ్ 2 హోదా కలిగిన ఏకైక పురపాలక సంఘం.పట్టణ ప్రస్తుతం విస్తీర్ణం 22 చ.కి.మీ.మేర విస్తరించి ఉంది.3 రెవెన్యూ వార్డులు, 27 ఎన్నికలు వార్డులు ఉన్నాయి.

భౌగోళిక స్థితి

[మార్చు]

180 ° 3 'ఉత్తర అక్షాంశం, 78 ° 2'0' తూర్పు రేఖాంశం వద్ద ఉంది

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 44,255 మంది జనాభా 9011 గృహాలతో ఉన్నారు.పట్టణం మొత్తం జనాభాలో పురుషులు సంఖ్య 21,336, ఆడవారి సంఖ్య 22,919. ప్రతి 1,074 ఆడవారికి 1000 మంది పురుషులు నిష్పత్తిలో ఉన్నారు. 4,815 మంది పిల్లలు 0-6 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. అందులో బాలురు సంఖ్య 2,418,బాలికలు సంఖ్య 2,397. సగటు అక్షరాస్యత రేటు 78.56% వద్ద 30,984 అక్షరాస్యులు.

పట్టణంలో విలీనమైన గ్రామాలు

[మార్చు]

మెదక్‌ బల్దియా పరిధిలోకి జిల్లాలోని హవేలి ఘనపూర్‌ మండలానికి చెందిన ఔరంగాబాద్‌. మెదక్‌ మండలంలోని అవుసులపల్లి,పిల్లికొట్టాల్‌ గ్రామాలు ఆ గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ముగియడంతో అవి బల్దియాలోకి విలీనం అయ్యాయి.దీంతో జిల్లా కేంద్రం పరిధి కాస్త పెరిగింది. ఇదివరకు పట్టణ పరిధి 22 చదరపు కి.మీలు ఉండగా, మూడు గ్రామాల విలీనంతో 26 చ.కి.మీ.లకు చేరుకుంది.జనాభా 44,410 నుండి 49,241 కి పెరిగింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Basic Information of Corporation". Medak Municipality. Archived from the original on 2016-02-14. Retrieved 2016-05-16.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]