Jump to content

జూలై 23

వికీపీడియా నుండి

జూలై 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 204వ రోజు (లీపు సంవత్సరములో 205వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 161 రోజులు మిగిలినవి.


<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30 31
2024


సంఘటనలు

[మార్చు]
  • 0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు.
  • 0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు.
  • 1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను బహిష్కరించాడు.
  • 1298: ఉర్జుబర్గ్, జర్మనీ లోని ఉర్జుబర్గ్ లో యూదులను ఊచకోత (హత్యాకాండ) కోసారు.
  • 1798: నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాను పట్టుకున్నాడు.
  • 1829: విలియం ఆస్టిన్ బర్ట్ 'టైపోగ్రాఫర్' (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు.
  • 1871: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) #114 కస్సండ్రను కనుగొన్నాడు.
  • 1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు.
  • 1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.
  • 1880: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.
  • 1895: ఎ. ఛార్లోయిస్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) #405 థియని కనుగొన్నాడు.
  • 1904: 'లా పర్చేజ్ ఎక్ష్పో' ప్రదర్శన జరుగుతున్నప్పుడు, 'ఛార్లెస్ ఇ. మెంచెస్', 'ఐస్ క్రీం కోన్' ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.
  • 1908: 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.
  • 1909: 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.
  • 1920: కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది.
  • 1921: అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.
  • 1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
  • 1932: '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
  • 1937: 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది.
  • 1938: '#1468 జోంబ' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
  • 1947: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)
  • 1952: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)
  • 1955: భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1956: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
  • 1931: హిందూ మహాసమురంలో ఉన్న 'అష్మోర్', 'కార్టియెర్' దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
  • 1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
  • 1965: బీటిల్స్ (గాయకుల గుంపు), 'హెల్ప్' అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.
  • 1967: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
  • 1968: 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.
  • 1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
  • 1972: మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
  • 1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు
  • 1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.
  • 1979: '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.
  • 1980: 'సోయుజ్ 37' అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న 'సాల్యూత్ 6' రోదసీనౌకకు చేరవేసింది.
  • 1984: 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
  • 1987: తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు).
  • 1987: మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.

జననాలు

[మార్చు]
Bal G. Tilak

మరణాలు

[మార్చు]

పండుగలు, జాతీయ దినాలు

[మార్చు]
  • 1952: ఈజిప్ట్ జాతీయదినోత్సవం.
  • ఇథియోపియా జాతీయదినోత్సవం
  • జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం (4 వ ఆదివారం)
  • జాతీయ ప్రసార దినోత్సవం

బయటి లింకులు

[మార్చు]

జూలై 22 - జూలై 24 - జూన్ 23 - ఆగష్టు 23 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=జూలై_23&oldid=4293606" నుండి వెలికితీశారు