బాల్కొండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నిజామాబాదు జిల్లాలోని 5 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంఒకటి.

బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

  • బాల్కొండ
  • మోర్తాడు
  • కమ్మర్‌పల్లి
  • భీంగల్
  • వెల్పూర్

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 అనంతరెడ్డి సోషలిస్ట్ పార్టీ రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1957 తుమ్మల రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజాగౌడ్ పిడిఎఫ్
1962 గడ్డం రాజారాం కాంగ్రెస్ పార్టీ కె.ఎస్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 గడ్డం రాజారాం కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక -
1972 గడ్డం రాజారాం కాంగ్రెస్ పార్టీ రాజేశ్వర్ స్వతంత్ర అభ్యర్థి
1978 గడ్డం రాజారాం కాంగ్రెస్ పార్టీ జి.మధుసూదన్ రెడ్డి జనతా పార్టీ
1981 (ఉ.ఎ) గడ్డం సుశీలాబాయి కాంగ్రెస్ బి.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1983 జి.మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.ఎస్.భాయ్ కాంగ్రెస్
1985 జి.మధుసూదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.ప్రమీలా దేవి కాంగ్రెస్
1989 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మోతె గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బద్దం నర్సారెడ్డి తెలుగుదేశం పార్టీ
1999 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ.గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వసంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 ఈరవత్రి అనిల్‌ ప్రజారాజ్యం పార్టీ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 వేముల ప్ర‌శాంత్ రెడ్డి తె.రా.స ఎ.అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2018 వేముల ప్ర‌శాంత్ రెడ్డి తె.రా.స ముత్యాల సునీల్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ

1999 ఎన్నికలు[మార్చు]

1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కె.ఆర్.సురేష్ రెడ్డి ఇక్కడి నుండి వరుసగా మూడవసారి విజయం పొందినాడు.

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కె.ఆర్.సురేష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి వసంత్ రెడ్డిపై 12884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సురేష్ రెడ్డి 53975 ఓట్లు సాధించగా, వసంత్ రెడ్డి 41091 ఓట్లు పొందినాడు.

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

గడ్డం రాజారాం
కాంగ్రేసు పార్టీలో అగ్రనేత అయిన రాజారాం తొలిసారి సోషలిస్టుగా ఆర్మూరు నుండి శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 1962 నుండి బాల్కొండ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1967లో రాజారాం బాల్కొండ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికకావటం విశేషం. ఈయన 1974లో జలగం వెంగళరావు, 1978 తర్వాత చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశాడు. 1981లో రోడ్డుప్రమాదంలో ఈయన మరణించిగా జరిగిన ఉప ఎన్నికలలో ఈయన సతీమణి సుశీలాదేవి శాసనసభకు ఎన్నికైంది.
కె.ఆర్.సురేష్ రెడ్డి
1959లో చౌట్‌పల్లిలో జన్మించిన కె.ఆర్.సురేష్ రెడ్డి 1984లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించాడు. 1989లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాల్కొండ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని రాజకీయ జీవితంలో దశమారింది. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. 2004లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] నిజామాబాదు జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. 2009 శాసనసభ ఎన్నికలలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-02. Retrieved 2008-09-18.