Jump to content

నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
(నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నాగర్‌కర్నూల్
—  శాసనసభ నియోజకవర్గం  —
నాగర్‌కర్నూల్ is located in Telangana
నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉన్న గోపాలపేట మండలం వనపర్తి నియోజకవర్గానికి తరలించబడింది.[1][2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,46,736.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి) : 2,21,328.[3]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 20.75%, 5.40%.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 పి.మహేంద్రనాథ్[4] భారత జాతీయ కాంగ్రెస్ బి.ఎం.రావు స్వతంత్ర అభ్యర్థి
1967 వంగా నారాయణ గౌడ్ స్వతంత్ర అభ్యర్థి కె.జనార్థన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1972 వంగా నారాయణ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏ.ఆర్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 శ్రీనివాసరావు వంగా నారాయణ గౌడ్
1983 వంగా నారాయణ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వంగా నారాయణ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 వంగా మోహన్ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ డి.గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వంగా మోహన్ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్
1999 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
2004 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2009 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2012 ఉప ఎన్నికలు నాగం జనార్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[5] కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 31466 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. నాగం జనార్థన్ రెడ్డికి 61964 ఓట్లు రాగా, దామోదర్ రెడ్డి 30498 ఓట్లు పొందినాడు. రంగంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వి.మోహన్ గౌడ్‌కు మూడవ స్థానం లభించింది. మొత్తం 8 అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. మిగితా 5గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కూచకుళ్ళ దామోదర్ రెడ్డిపై 1449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నాగం జనార్థన్ రెడ్డి 57350 ఓట్లు సాధించగా, దామోదర్ రెడ్డి 55901 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి[6], భారతీయ జనతా పార్టీ తరఫున జె.రఘునందన్ రెడ్డి [7], కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్తు చైర్మెన్ కె.దామోదరరెడ్డి[8], ప్రజారాజ్యం పార్టీ నుండి నూర్జహాన్[9], లోక్‌సత్తా నుండి కె.రామకృష్ణ [10] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై విజయం సాధించి ఐదవసారి శాసనసభలో ప్రవేశించాడు.

నియోజకవర్గపు ప్రముఖులు

[మార్చు]
నాగం జనార్థన్‌రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలలో ముఖుడైన నాగం జనార్థన్‌రెడ్డి గతంలో ఆరోగ్య, సంక్షేమశాఖామంత్రిగానూ, పంచాయతీరాజ్ శాఖామంత్రిగాను పనిచేశాడు. ఎం.బి.బి.ఎస్. చదివిన నాగం జనార్థన్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఐదవసారి విజయం సాధించాడు.
కూచుకుళ్ళ దామోదరరెడ్డి
1981లో తూడుకుర్తి గ్రామ పంచాయతి సర్పంచిగా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించిన దామోదరరెడ్డి 1989లో మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 194-99 కాలంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ నాగర్ కర్నూల్ మండలాధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి, పార్టీ టికెట్టు రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ ఓడిపోయాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీచేసి నాగం జనార్థన్ రెడ్డి చేతిలో పరాజయం పొందినాడు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తాడూరు మండలం నుండి గెలుపొంది మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు చైర్మెన్ పదవిని పొందినాడు. 2009 ఎన్నికలలో నాగర్ కర్నూల్ స్థానం నుండి పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్టు లభించింది.[11]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  4. Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 30-03-2009
  7. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  8. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  9. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  10. సూర్య దినపత్రిక, తేది 22-03-2009
  11. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009