ఆత్మకూరు, కర్నూలు జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆత్మకూరు, కర్నూలు జిల్లా
—  మండలం  —
కర్నూలు జిల్లా పటములో ఆత్మకూరు, కర్నూలు జిల్లా మండలం యొక్క స్థానము
కర్నూలు జిల్లా పటములో ఆత్మకూరు, కర్నూలు జిల్లా మండలం యొక్క స్థానము
ఆత్మకూరు, కర్నూలు జిల్లా is located in Andhra Pradesh
ఆత్మకూరు, కర్నూలు జిల్లా
ఆంధ్రప్రదేశ్ పటములో ఆత్మకూరు, కర్నూలు జిల్లా యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°52′40″N 78°35′18″E / 15.87791°N 78.588417°E / 15.87791; 78.588417
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండల కేంద్రము ఆత్మకూరు, కర్నూలు జిల్లా
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 76,028
 - పురుషులు 38,670
 - స్త్రీలు 37,358
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.79%
 - పురుషులు 70.36%
 - స్త్రీలు 46.54%
పిన్ కోడ్ 518422
ఆత్మకూరు
—  రెవిన్యూ గ్రామం  —
ఆత్మకూరు is located in Andhra Pradesh
ఆత్మకూరు
అక్షాంశరేఖాంశాలు: 15°52′40″N 78°35′18″E / 15.87791°N 78.588417°E / 15.87791; 78.588417
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం ఆత్మకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 39,794
 - పురుషుల సంఖ్య 20,568
 - స్త్రీల సంఖ్య 19,226
 - గృహాల సంఖ్య 8,076
పిన్ కోడ్ 518 422
ఎస్.టి.డి కోడ్ 08513

ఆత్మకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 518 422. ఎస్.టి.డి కోడ్:08513.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 76,028 - పురుషులు 38,670 - స్త్రీలు 37,358

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 39,794.[1] ఇందులో పురుషుల సంఖ్య 20,568, మహిళల సంఖ్య 19,226, గ్రామంలో నివాస గృహాలు 8,076 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4,372 హెక్టారులు.

గ్రామచరిత్ర[మార్చు]

19వ శతాబ్దికి చెందిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో అప్పటి ఆత్మకూరు వివరాలు నమోదుచేశారు. 1830లో ఆయన కాశీయాత్రకు వెళ్తూ ఆత్మకూరులో మజిలీ చేశారు. అప్పట్లో గ్రామం కందనూరు నవాబు పరిపాలనలో ఉండేది. నవాబు తాలూకా ఉద్యోగస్థులుండే కసుబాస్థలమని వ్రాశారు. ఆ నవాబు తాలూకాను నాలుగు మేటీలుగా విభజించి ఒక్కొక్క మేటీ(పరిపాలన విభాగం)కి ఒక్కొక్క అములుదారుని ఏర్పరిచారని వ్రాశారు. తన వద్ద ఉన్న నౌకర్లకు జీతానికి బదులుగా జాగీర్లను కూడా ఇచ్చారని వ్రాశారు.

ఆత్మకూరును గురించి దూరానికి గొప్పగ్రామమని, పేటస్థలమని, సంతలో సకలపదార్థాలూ దొరికేవని ప్రశస్తి వినిపించేదని, తీరా వచ్చి చూస్తే దానికి వ్యతిరేకంగా ఉండేదని వ్రాసుకున్నారు. అప్పట్లో అక్కడ ఆదివారం పూట సంత జరిగేది కాని, యాత్రికులకు పనికివచ్చే ఒక్క వస్తువూ దొరికేది కాదట. శ్రీశైలం అటవీప్రాంతం కావడంతో శ్రీశైల అర్చకులు, శ్రీశైల యాత్రికుల నుంచి పన్నులు తీసుకునే నవాబు ముసద్దీలు ఆత్మకూరులోనే నివసించేవారు.[2]

సమీప గ్రామాలు[మార్చు]

కరివాన 4 కి.మీ, దుద్యాల 5 కి.మీ, కురుకుండ 5 కి.మీ, నల్లకాల్వ 5 కి.మీ, సిద్దేపల్లె 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కొత్తపల్లె మండలం, పశ్చిమాన పాములపాడు మండలం, దక్షణాన వెలుగోడు మండలం, పశ్చిమాన జూపాడు బంగ్లా మండలం.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1] పుట. 12