మే 11
స్వరూపం
(11 మే నుండి దారిమార్పు చెందింది)
మే 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 131వ రోజు (లీపు సంవత్సరములో 132వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 234 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1502 : కొలంబస్ ఇండీస్ దీవులకు తన చివరి (నాలుగవ) యాత్రను మొదలుపెట్టాడు.
- 1751 : మొదటి అమెరికన్ ఆసుపత్రిని స్థాపించారు (పెన్సిల్వేనియా హాస్పిటల్)
- 1752 : మొదటి అగ్నిప్రమాద భీమా పధకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా)
- 1772 : ఆమ్స్టర్డాం థియేటర్ (రంగశాల) అగ్నిప్రమాదంలో తగులబడి, 18 మంది మరణించారు.
- 1784 : టిప్పు సుల్తాను ఇంగ్లాండుతో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
- 1792 : అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే, కొలంబియా నదిని కనుగొని, దానికి కొలంబియా అని పేరు పెట్టారు.
- 1816 : అమెరికన్ బైబిల్ సొసైటీని స్థాపించారు (న్యూయార్క్ లో).
- 1833 : లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
- 1850: మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
- 1858 : మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికాలో చేరింది.
- 1893 : హెన్రీ డెస్గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు (35.325 కి.మీ)
- 1916 : ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).
- 1921 : టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).
- 1928: జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని (టి.వి.స్టేషను) ని మొదలు పెట్టింది (న్యూయార్క్ లోని షెనెక్టాడీ లో).
- 1929: రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
- 1949: మొదటి పోలరాయిడ్ కెమెరాని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు.
- 1949: ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.
- 1949: సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్లాండ్గా మార్చుకున్నది.
- 1955: ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.
- 1958: అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
- 1961: హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
- 1962:అమెరికా క్రిస్ట్మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
- 1965: భారతదేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు.
- 1977 : తెలుగు సినిమా
- 1967: అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
- 1991: కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.1991 మార్చి 3 విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
- 2000: భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది.
జననాలు
[మార్చు]- 1895: జిడ్డు కృష్ణమూర్తి, భారతదేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్)
- 1918: మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016)
- 1922: మాధవపెద్ది సత్యం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
- 1925: వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, రంగస్థల నటుడు, బాలనాగమ్మలో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు.
- 1928: సామల సదాశివ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (మ.2012)
- 1940: భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (మ.2023)
- 1970: పూజా బేడీ , సినీనటి , టెలివిజన్ వ్యాఖ్యాత
- 1980: పోసాని సుధీర్ బాబు, తెలుగు సినిమా నటుడు. తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.
- 1982: సత్య కృష్ణన్ , ప్రముఖ సినీ నటి
- 1992: ఆదాశర్మ , భారతీయ సినీ నటీ
- 1993: రాజ్ తరుణ్ , తెలుగు చిత్ర నటుడు, రచయిత
మరణాలు
[మార్చు]- 1873: మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి, మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.
- 1992: పుష్పవల్లి , అలనాటి తెలుగు చలన చిత్ర నటి,(హిందీ నటి రేఖ తల్లి), జ.1926.
- 1994: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928)
- 2017: సి.ఆర్.ఎం.పట్నాయక్ వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ సాంకేతిక దినోత్సవం
- ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 11[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
మే 10 - మే 12 - ఏప్రిల్ 11 - జూన్ 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |