రామవరప్పాడు
రామవరప్పాడు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°31′37.5470″N 80°40′44.6628″E / 16.527096389°N 80.679073000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ |
మండలం | విజయవాడ గ్రామీణ |
విస్తీర్ణం | 3.30 కి.మీ2 (1.27 చ. మై) |
జనాభా (2011)[2] | 22,222 |
• జనసాంద్రత | 6,700/కి.మీ2 (17,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 11,092 |
• స్త్రీలు | 11,130 |
• లింగ నిష్పత్తి | 1,003 |
• నివాసాలు | 6,130 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 521108 |
2011 జనగణన కోడ్ | 589215 |
రామవరప్పాడు, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది ప్రస్తుతం విజయవాడ నగరంలో కలిసిపోయింది.
జనాభా గణాంకాలు
[మార్చు]రామవరప్పాడు ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కలు నివేదిక ప్రకారం రామవరప్పాడు పట్టణ జనాభా 22,222, అందులో 11,092 మంది పురుషులు కాగా 11,130 మంది స్త్రీలు.
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2316, ఇది రామవరప్పాడు (సి.టి) మొత్తం జనాభాలో 10.42%. పట్టణ పరిధిలో స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1003గా ఉంది. అంతేకాకుండా రామవరప్పాడులో బాలల లింగ నిష్పత్తి 978 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటుతో పోలిస్తే 939. రామవరప్పాడు నగరం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02 కంటే 81.02% ఎక్కువ. . రామవరప్పాడులో పురుషుల అక్షరాస్యత దాదాపు 84.48% కాగా స్త్రీ అక్షరాస్యత 77.58%.
రామవరప్పాడు పట్టణ పరిధిలో మొత్తం 6,130 గృహాలకు స్థానిక స్వపరిపాలనా సంస్థ పరిపాలనను కలిగి ఉంది.[3]
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]నాగార్జున నగర్ 1 కి.మీ, శ్రీ రామచంద్రనగర్ 1 కి.మీ, ప్రసాఅదంపాదు 1 కి.మీ గుణదల 1 కి.మీ, శ్రీనివాస నగర్ 1 కి.మీ
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
రైలు వసతి
[మార్చు]- విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
- గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
విమానాశ్రయం
[మార్చు]రామవరప్పాడు 16 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గర్లో విజయవాడ విమానాశ్రయము గన్నవరంలో ఉంది.
బస్సు
[మార్చు]ఈ గ్రామానికి సిటి బస్సుల సౌకర్యం ఉంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో పీకా లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా కొల్లా ఆనందకుమార్ ఎం.బి.య్యే. ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయం
[మార్చు]- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. పలు సాంస్కృతిక కార్యక్రమ్మాలు గూడా నిర్వహించెదరు.
- కార్తీకమాసం సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలో కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, జనవరిలో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయం స్థానిక వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయంలో ఉపాలయంగా ఉంది. 2016, ఏప్రిల్-1వతెదీనుండి, ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టెదరు.
శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి అలయం
[మార్చు]అమ్మవారికి సంవత్సరం విడిచి సంవత్సరం వేమినేని వారిచే పసుపుకుంకుమలు ఇచ్చే సంప్రదాయం కలదు రామవరప్పాడులో రాజుల బజార్ లో గల పుట్టింటికి అమ్మవారు పుట్టింటి వారు అయిన రాజులు సంవత్సరం విడిచి సంవత్సరం పుట్టింటికి తీసుకు వెళతారు అమ్మవారికి ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ జనవరి 13, 14, 15 తేదీలలో క్యాలెండర్ తో సంబంధం లేకుండా వైభవంగా జరుపుకుంటారు.
గ్రామ విశేషాలు
[మార్చు]చాగంటిపాడు ట్రస్ట్:- ఈ ట్రస్ట్ ద్వారా గత కొంత కాలంగా పేద, బడుగు, బలహీనవర్గాలవారికి సేవలందించుచున్నారు. ఈ ట్రస్ట్ కార్యాలయాన్ని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో, 2015, అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011) https://www.census2011.co.in/data/town/589215-ramavarappadu-andhra-pradesh.html.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ "Ramavarappadu Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-05-27.
బయటి లింకులు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాలు
- ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ గ్రామాలు
- విజయవాడ పరిసరాలు
- విజయవాడ
- జనగణన పట్టణాలు
- ఎన్టీఆర్ జిల్లా జనగణన పట్టణాలు
- Pages using the Kartographer extension