ఫిబ్రవరి 24
స్వరూపం
(ఫిబ్రవరీ 24 నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 55వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 310 రోజులు (లీపు సంవత్సరములో 311 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | |
2025 |
సంఘటనలు
[మార్చు]- 1582: గ్రెగేరియన్ కేలండర్ మొదలైన రోజు. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది.
- 1938: నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.
- 1942: వాయిస్ ఆఫ్ అమెరికా (అమెరికా షార్ట్ వేవ్ రేడియో సర్వీసు) ఆవిర్బవించిన రోజు.
చూడు [1]
- 1944: సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది (సి.ఇ.సి.డి).సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అంద్ కస్టమ్స్ (సి.బి.ఇ.సి) చూడు [2]
- 1945: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు.
- 1952: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఇ.సి) వార్షికోత్సవము. [[ఇ.ఎస్.ఇ.సి. మొదటిసారిగా కాన్పుర్, ఢిల్లీలలో ప్రారంభించారు. ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్ చట్టం 1948 ఆధారంగా ఇ.ఎస్.ఐ.సి. ఏర్ఫడింది. చూడు [3]
- 1982: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిదవ ముఖ్యమంత్రిగాటంగుటూరి అంజయ్య పదవీ విరమణ.
- 1982: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిదవ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారం.
- 1983: డౌ జోన్స్ ఇండిస్ట్రియల్ ఏవరేజి 1100 మార్క్ ని మొదటిసారిగా దాటింది. ఈ రోజున 24.87 పాయింట్లు పెరిగింది. 1972 లో, 1100 మార్క్ చేరినా, ఈ మార్క్ చివరి వరకు నిలబడలేదు.
జననాలు
[మార్చు]- 1304: హాజీ ఆబు అబ్దుల్లా ముహమ్మద్ ఇబున్ బట్టూట - మన దేశాన్ని సందర్శించిన ఆరబ్ చరిత్రకారుడు. ఇతడు ఆసియా, ఆఫ్రికా ఖండాలను పర్యటించి, అక్కడి విశేషాలను పుస్తకంలో రాసాడు. మరణం (1368 లేదా 1369). (జననం కూడా 24 లేదా 1304 ఫిబ్రవరి 25). ముహమ్మద్ బిన్ తుగ్లక్, కాకతీయ వంశం లోని ప్రతాపరుద్ర దేవుడు, మంత్రి యుగంధరుడు కాలంలో ఇతను భారతదేశంలో ప్రయాణించాడు.
- 1911: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (మ.1983)
- 1929: అనంత్ పాయ్, భారతీయ కామిక్ రచయిత, అమర్ చిత్రకథ సృష్టికర్త
- 1939: జాయ్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నటుడు.
- 1948: జయలలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.2016)
- 1955: స్టీవ్ జాబ్స్, అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు
- 1972: పూజా భట్ , భారతీయ నటి ,మోడల్, నిర్మాత, దర్శకురాలు.
- 1981: నానీ, తెలుగు సినిమా నటుడు.
మరణాలు
[మార్చు]- 1810: హెన్రీ కేవిండిష్, బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (జ.1731)
- 1951: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880)
- 1967: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886)
- 1975: ఈలపాట రఘురామయ్య, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (జ.1901)
- 1980: దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెలుగు కవి. (జ.1897)
- 1984: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)
- 1986: రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (జ.1904)
- 1991: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (జ.1918)
- 1991: త్యాగరాజు , తెలుగు సినిమా నటుడు ,ప్రతినాయకుడు .(జ.1941)
- 2003: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1929)
- 2011: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)
- 2013: షేక్ సాంబయ్య, క్లారినెట్ విద్వాంసుడు. (జ.1950)
- 2017: కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (జ.1946)
- 2017: సింహాద్రి శివారెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన సి.పి.ఎం నాయకుడు.
- 2018: శ్రీదేవి, భారతీయ సినీ నటి (జ. 1963)
- 2022: ఇమ్మడి లక్ష్మయ్య, వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.(జ.1930)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-05 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-14 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 24
ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 25 - జనవరి 24 - మార్చి 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |