Jump to content

సామర్లకోట పురపాలక సంఘం

వికీపీడియా నుండి
సామర్లకోట పురపాలక సంఘం
సామర్లకోట
స్థాపన1956
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

సామర్లకోట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం లోని, పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

సామర్లకోట పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పురపాలక సంఘం.ఇది 1956 సంవత్సరంలో III వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 14.88.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 56,864 జనాభా ఉండగా అందులో పురుషులు 28,115, మహిళలు 28,749 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 74.58% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 78.77% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 70.51%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5793 ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా గంగిరెడ్డి అరుణ, [3] వైస్ చైర్మన్‌గా ఉభా జాన్ మోజేస్ పనిచేస్తున్నారు.[3]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
దేవాలయ ప్రధానద్వారం
  • కుమారభీమారామం:పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామం క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు ఒక కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడ శివలింగం 60 అడుగుల ఎత్తులో రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
  • శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ప్రసిద్ధి గాంచిన దేవాలయం.ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది.

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 38.77.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.18 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 32 మురికివాడలు ఉండగా అందులో జనాభా 29258 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,19 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Samalkot Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]