Coordinates: 17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం is located in Telangana
కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం
రకంఉద్యానవనం
స్థానంజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాద్
అక్షాంశరేఖాంశాలు17°25′16″N 78°25′12″E / 17.421065°N 78.42009°E / 17.421065; 78.42009
ప్రజా రవాణా సౌకర్యంజూబ్లీ హిల్స్ చెక్ పోస్టు మెట్రో

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం (ఆంగ్లం:Kasu Brahmananda Reddy National Park), హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది.[1] ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడింది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్తుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు, 30 రకాల సీతాకోక చిలుకలకు నివాసంగా గుర్తించారు. వాటిలో పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది మొదలైనవి ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

ఈ ఉద్యానవనం సుమారుగా 390-acre (1.6 km2) రాజభవన సముదాయాన్ని 1967లో ప్రిన్స్ ముఖరం జాకు పట్టాభిషేకం సందర్భంగా అతని తండ్రి ప్రిన్స్ ఆజం జా ఇచ్చారు. 1998లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిని జాతీయ వనంగా ప్రకటించింది. 2020, అక్టోబరు 27న ఎకో సెన్సిటివ్ జోన్‌గా భారత ప్రభుత్వం ప్రకటించింది.[2]

కాంప్లెక్స్‌లో ప్యాలెస్ ఉంది, దానితోపాటు ఇతర కొండపై మోర్ (నెమలి) బంగళా, గోల్ బంగ్లా ఉన్నాయి; ఏనుగు, గుర్రాలు, పశువుల కోసం లాయం, అద్భుతమైన పాతకాలపు కార్ల సముదాయాన్ని కలిగి ఉన్న మోటారు ఖానా, భారీ యంత్రాల కోసం వర్క్‌షాప్, పెట్రోల్ పంపు, అనేక అవుట్‌హౌస్‌లు, రెండు బావులు, రెండు నీటి ట్యాంకులు ఉన్నాయి.[3]

జాతీయ వనం హోదా

[మార్చు]

1998లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్యాలెస్ కాంప్లెక్స్ ప్రాంతాన్ని జాతీయ వనంగా ప్రకటించింది. దీంతో భూమిలో ఎక్కువ భాగం అటవీ శాఖకు అప్పగించడంతో నిజాంకు దాదాపు 11 ఎకరాలు మాత్రమే మిగిలాయి. కాలం గడిచేకొద్దీ నిజాం ఆధీనంలో ప్రస్తుతం ఉన్న ఆరు ఎకరాలకు తగ్గింది. దీని పేరును కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనంగా మార్చారు.[4]

2010 జూన్ లో ప్రిన్స్, అతని ప్రతినిధులు చిరాన్ ప్యాలెస్, పార్క్ వాయువ్య మూలలో ఆరు ఎకరాల భూమితో జాతీయ వనంలో చెల్లాచెదురుగా ఉన్న తన ఆస్తిలోని 16 ఇతర భాగాలను మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ భూమి జాతీయ ఉద్యానవనంలో భాగంగా పరిగణించబడకుండా అటవీ అధికారులకు, పార్కు సందర్శకులకు ప్రవేశం లేదు. చిరాన్ ప్యాలెస్‌తో సహా భూమిపై ఉన్న అన్ని ఆస్తులు జాతీయ వనంలో భాగంగా నోటిఫై చేయబడతాయి. యువరాజుకు అప్పగించాల్సిన భూమిని ఈ వనం నుండి తొలగించారు.[5]

ఈ ఒప్పందానికి భారత వన్యప్రాణి బోర్డు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం లభించింది. [6]

చిరాన్ ప్యాలెస్

[మార్చు]

చిరాన్ ప్యాలెస్, ఫలక్‌నుమా లేదా చౌమహల్లా వంటి నిజాం ఇతర రాజభవనాల మాదిరిగా కాకుండా, యువరాజు అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఆధునిక భవనం.[7] ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న జూబ్లీ హిల్స్ లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో చిరాన్ ప్యాలెస్ నిర్మించబడింది.[8]

డ్యూప్లెక్స్ తరహా ప్యాలెస్‌లో రెండు సెల్లార్లు ఉన్నాయి, ఇక్కడ యువరాజు బిలియర్డ్ గదితోపాటు పెద్ద సమావేశ మందిరానం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆయుధశాల, యువరాజు కార్యాలయంతోపాటు రెండు అతిథి గదులు, సందర్శకులకు స్థలం, చిన్నగది, వంటగది మొదలైనవి ఉన్నాయి. మొదటి అంతస్తులో నిజాం తన భార్య, పిల్లలతో నివసించే ఏడు పడక గదులు ఉన్నాయి.[9]

ఉద్యానవనం

[మార్చు]

ఈ ఉద్యానవనంలో 600 జాతులకు పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు, 30 రకాల సీతాకోకచిలుకలు, సరీసృపాలు ఉన్నాయి. ఇందులో పాంగోలిన్, స్మాల్ ఇండియన్ సివెట్, నెమలి, జంగిల్ క్యాట్, పోర్కు పైన్స్ వంటి జంతువులు తమ నివాసాలను ఏర్పరుచుకున్నాయి. ఉద్యానవనంలో కొన్ని నీటి వనరులు ఉన్నాయి, మొక్కలకు అవసరమైన తేమను అందిస్తాయి. పక్షులు, చిన్న జంతువుల దాహాన్ని తీరుస్తున్నాయి.[10]

ఈ ఉద్యానవనానికి సాయంత్రం, వారాంతాల్లో యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా తరచుగా వస్తుంటారు.

భద్రత, పర్యవేక్షణ

[మార్చు]

ఈ పార్కు బయట సుమారు 5 కిలోమీటర్లపాటు ఉన్న జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో అనేకమంది వాకింగ్ చేస్తుంటారు. వారి భద్రత కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు పాడైపోయాయి. దాంతో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటుచేసిన 156 సీసీ కెమెరాలను 2023, జూలై 13న హైదరాబాదు నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రారంభించాడు. సుమారు 80 లక్షల రూపాయలతో 156 నైట్‌ విజన్‌తోపాటు హైడెన్సిటీతో ఐపీ బేస్డ్‌ సీసీ కెమెరాలను ఏర్పాటుకోసం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా కొన్ని వ్యాపార సంస్థలు కొంతమేర నిధులు సమకూర్చాయి. సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్‌ రూమ్‌ను కేబీఆర్‌ పార్కులోనే ఏర్పాటుచేయగా, దీంతోపాటు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌తో కూడా అనుసంధానం చేయబడ్డాయి.[11]

మూలాలు

[మార్చు]
 1. Andhrajyothy (11 November 2023). "KBR Park: డిసెంబరు 1న కేబీఆర్‌ పార్కు సిల్వర్‌ జుబ్లీ వేడుకలు". Andhrajyothy Telugu News. Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
 2. Govt of India. "ESZ Notification" (PDF). www.egazette.nic.in. Govt. of India. Retrieved 14 February 2022.
 3. Prince Mukarram to give up Chiran Palace. The Times of India, 9 July 2010.
 4. Prince Mukarram to give up Chiran Palace. The Times of India, 9 July 2010.
 5. Prince Mukarram to give up Chiran Palace. The Times of India, 9 July 2010.
 6. Prince Mukarram to give up Chiran Palace. The Times of India, 9 July 2010.
 7. Prince Mukarram to give up Chiran Palace. The Times of India, 9 July 2010.
 8. Prince Mukarram to give up Chiran Palace Archived 2012-04-05 at the Wayback Machine. The Times Of India, 9 July 2010.
 9. Prince Mukarram to give up Chiran Palace. The Times of India, 9 July 2010.
 10. "Best dating worldwide". Archived from the original on 2013-08-14. Retrieved 2023-07-15.
 11. telugu, NT News (2023-07-13). "Hyderabad | కేబీఆర్‌ పార్కులో ఆకతాయిలకు అడ్డుకట్ట.. వాక్‌వే చుట్టూ 156 సీసీ కెమెరాలు". www.ntnews.com. Archived from the original on 2023-07-17. Retrieved 2023-07-17.

బయటి లింకులు

[మార్చు]

17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41{{#coordinates:}}: cannot have more than one primary tag per page