Jump to content

సాలూరు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
(పురపాలక సంఘం, సాలూరు నుండి దారిమార్పు చెందింది)
సాలూరు పురపాలక సంఘం
సాలూరు
స్థాపన1950
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
సాలూరు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

సాలూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సాలూరు పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.

చరిత్ర

[మార్చు]

సాలూరు 1950 అక్టోబర్ 3 మూడవ గ్రేడు పురపాలక సంఘంగా స్థాపించారు. ఇటీవలి కాలంలో రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చబడినది. పట్టణం వైశాల్యం 19.55 చదరపు కిలోమీటర్లు.

జనాభా గణాంకాలు

[మార్చు]

సాలూరు పురపాలక సంఘం లో 29 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2011 జనాభా లెక్కల మొత్తం జనాభా 49,500 ఉండగా వీరిలో 24,021 మంది పురుషులు,25,479 మంది మహిళలు ఉన్నారు.ఆదోని నగరంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4900 ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 58.9% ఉండగా పురుషుల్లో అక్షరాస్యత రేటు 81.8%, స్త్రీలలో అక్షరాస్యత 65.21%. ఉన్నది. 2001లో 43,435 జనాభా ఉండగా, 2011 నాటికి 48,362కు పెరిగింది. తద్వారా దశాబ్ది జనాభా పెరుగుదల రేటు 10.18%గా నమోదుచేసుకొన్నది.[1]

త్రాగు నీటి సౌకర్యాలు

[మార్చు]

1959 సంవత్సరం పట్టణానికి రక్షిత మంచి నీరు సరఫరా చేసే ఉద్దేశంతో ఒక బావిని, ఒక పంప్ హౌస్ ని, ఒక ఓవర్ హెడ్ నీరు భద్రపరచే జలాశయాన్ని నిర్మించారు. రక్షిత మంచి నీటి పథకానికి నీటి ఆధారం వేగావతి నది. ఈ పథకానికి 1987, 1993, 2001 సంవత్సరాలలో జరిగిన ఉన్నత మార్పుల వల్ల, 2002 సంవత్సరం నుండి పట్టణంలో 80 శాతం మందికి రక్షిత మంచి నీరు సరఫరా అవుతోంది. రోజుకి సగటున 3.69 MLD (8.11 లక్ష గ్యాలన్ల) నీరు సరఫరా చేయబడుతోంది. నీటి ఫలకం భూమి నుండి 12 మీటర్ల లోతులో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Salur Population, Caste Data Vizianagaram Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-08.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]