అష్టవసువులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు.[1] దేవతా గణాలు మూడు రకాలుగా ఉంటాయని పురాణాలలో ఉంది. వారు అష్ట వసువులు, ఏకాదశ రుద్రగణాలు, ద్వాదశ ఆదిత్య గణాలు. వీళ్ళు కాక అశ్వనీదేవతలు ఇద్దరు. మొత్తం 33 మంది. పురణాల ప్రకారం అష్ట వసు గణాలు: అనిలః., అనలః, ఆపః, ధర్మః., ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః. ఇందులో అనిలః అనగా వాయుదేవుడు. అనలః అనగా అగ్నిహోత్రుడు. ఆపః అనగా వరుణదేవుడు. ధర్మః అనగా ధర్మదేవుడు. అష్ట సిద్ధుల్ని అనుగ్రహించేవారు అష్ట వసువులు. వసు అనగా సంపద. అనగా సంపదను అనుగ్రహించెవారు. వీరు వరుసగా దిక్పాలకత్వం కూడా వహించారు.

మహాభారత ప్రకారం

[మార్చు]
గంగాదేవి తనకు కూమరులుగా జన్మించిన అష్టవసువులలో చివరివాడైన భీష్ముని గంగలో పడవేయుచుండగా వారిస్తున్న శంతనుడు

అష్ట అసువులు అంగా ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఓసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా వారికి వశిష్టాశ్రమంలో కామధేనువు కనబడింది. దానిని దొంగతనంగా తీసుకొని పోతారు. దివ్యదృష్టి ద్వారా వశిష్టుడు విషయం తెలుసుకొని వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు.

వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు. ఆపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు. అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది.

ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం ఆమెను పెళ్లాడే శంతనుడు-గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు.

అష్టవసువులు:

  1. వరుణుడు
  2. వృషభుడు
  3. నహుషుడు
  4. జయుడు
  5. అనిలుడు
  6. విష్ణువు
  7. ప్రభాసుడు
  8. ప్రత్యూషుడు

ఇంకొక విధం:

  1. ఆపుడు
  2. ధ్రువుడు
  3. సోముడు
  4. అధ్ర్వరుడు
  5. అనిలుడు
  6. ప్రత్యూషుడు
  7. అనలుడు
  8. ప్రభాసుడు

మరింకొక విధం:

  1. ధరుడు
  2. ధ్రువుడు
  3. సోముడు
  4. అహస్సు
  5. అనిలుడు
  6. అనలుడు
  7. ప్రత్యూషుడు
  8. ప్రభాసుడు
--- మహాభారతం - ఆది పర్వం - 66-18---
ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః

మూలాలు

[మార్చు]
  1. selvi. "భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు." telugu.webdunia.com. Retrieved 2020-08-24.

బాహ్య లంకెలు

[మార్చు]