అష్టాదశసిద్ధులు
Appearance
అష్టాదశసిద్ధులు అనగా పద్దెనిమిది రకాల సిద్ధులు. ఇవి మార్కండేయ పురాణములో పేర్కొనబడడ్డాయి.[1] భారతీయ తత్వ శాస్త్రంలో "సిద్ధి" అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ, ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే.
ఎనిమిది అణిమాది సిద్ధులు, పది గౌణ సిద్ధులను కలిపి అష్టాదశసిద్ధులు అంటారు.[2]
అష్టాదశసిద్ధులు
[మార్చు]- అణిమ: శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకోగలగడం.
- లఘిమ: శరీరాన్ని తేలికగా మార్చుకోగలగడం.
- ప్రాప్తి: శూన్యం నుంచి కావలసిన వస్తువును సాధించడం.
- ప్రాకామ్యము: కోరుకున్నది సాధించడం.
- మహిమ: శరీరాన్ని ఎంత పెద్దగానైనా మార్చుకోగలగడం.
- ఈశిత్వము: అష్టదిక్పాలకులపై ఆధిపత్యం.
- వశిత్వము: సకల జీవరాశులను వశం చేసుకోగలగడం.
- సర్వకామానసాయిత: కోరిన రూపము ధరించగలగడం.
- సర్వజ్ఞత్వము
- దూరశ్రవణము: దూర ప్రదేశములందున్న దృశ్యములను దర్శించగలగడం.
- పరకాయ ప్రవేశము: అన్య దేహముల ప్రవేశించగలగడం
- వాక్సిద్ధి
- కల్పవృక్షత్వము
- సృష్టి
- సంహారకరణ సామర్థ్యము
- అమరత్వము: కోరినప్పుడు దేహమును త్యజించగలగడం
- సర్వన్యాయకత్వము
- భావన
- సిద్ధి
మూలాలు
[మార్చు]- ↑ "నవరాత్రుల ప్రత్యేకం : సిద్ధిదాత్రి". telugu.oneindia. 2016-10-14. Archived from the original on 2016-10-18. Retrieved 2022-11-03.
- ↑ సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "వివరణలు : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.