అష్టఅంగములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 1. (అ.) 1. యమము, 2. నియమము, 3. ఆసనము, 4. ప్రాణాయామము, 5. ప్రత్యాహారము, 6. ధారణము, 7. ధ్యానము, 8. సమాధి [ఇవి యోగాంగములు].

"యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయోఽష్టాంగాని" [పాతంజలయోగసూత్రములు 2-29]

 1. (ఆ.) 1. శల్యము, 2. శాలాక్యము, 3. కాయచికిత్స, 4. భూతవిద్య, 5. కౌమారభృత్యము, 6. అగదతంత్రము, 7. రసాయనము, 8. వాజీకరణము [ఇవి వైద్యశాస్త్రమున కంగములు].
 2. (ఇ.) 1. ద్రవ్యాభిధానము, 2. గదనిశ్చయము, 3. కాయసౌఖ్యము, 4. శల్యాది, 5. భూతనిగ్రహము, 6. విషనిగ్రహము, 7. బాలవైద్యము, 8. రసాయనము [ఇవియు వైద్యశాస్త్రమున కంగములు].
 3. (ఈ.) 1. సమ్యగ్దృష్టి, 2. సమ్యక్సంకల్పము, 3. సమ్యగ్వాక్కు, 4. సమ్యక్కుర, 5. సమ్యగ్జీవనము, 6. సమ్యగ్వ్యాయామము, 7. సమ్యక్‌స్మృతి, 8. సమ్యక్సమాధి [ఇవి బుద్ధధర్మమున కంగములు].
 4. (ఉ.) కరములు (2) , పాదములు (2) , భుజములు (2) , 7. ఱొమ్ము, 8. లలాటము [ఇవి శరీరాంగములు]
 5. (ఊ.) 1. జలము, 2. పాలు, 3. దర్భాగ్రములు, 4. పెరుగు, 5. నేయి, 6. బియ్యము, 7. యవలు, 8. సిద్ధార్థకములు [ఇవి అర్ఘ్యాంగములు].

"ఆపః క్షీరం కుశాగ్రం చ దధి సర్పిః సతండులమ్‌, యవాః సిద్ధార్థకాశ్చేతి హ్యర్ఘ్యోఽష్టాంగః ప్రకీర్తితః"

 1. (ఋ.) 1. నాదము, 2. బిందువు, 3. కళ, 4. జ్యోతిస్సు, 5. రూపము, 6. రేఖ, 7. స్వరవర్ణము, 8. ఆవృత్తి [ఇవి గాయత్రీ మంత్రాంగములు].
 2. (ౠ.) 1. నిదానము, 2. పూర్వరూపము, 3. రూపము, 4. ఉపశమము, 5. సంప్రాప్తి, 6. ఓషధి, 7. రోగి, 8. పరిచారిక [ఇవి చికిత్సాంగములు].
 3. (ఎ.) 1. శిరస్సు, 2. వక్షస్సు, 3. హస్తములు, 4. మోకాళ్ళు, 5. పాదములు, 6. మనస్సు, 7. వాక్కు, 8. దృష్టి [ఇవి నమస్కారాంగములు].
 4. (ఏ.) 1. దేవపూజ, 2. ధర్మగ్రంథపఠనము, 3. దానము, 4. తపస్సు, 5. సత్యము, 6. క్షమ, 7. ఇంద్రియనిగ్రహము, 8. నిర్లోభత.
 5. (ఐ.) 1. తపస్సు, 2. సత్యము, 3. క్షమ, 4. దయ, 5. శౌచము, 6. దానము, 7. యోగము, 8. బ్రహ్మచర్యము [ఇవి (ఏ, ఐ) ధర్మాంగములు].
 6. (ఒ.) 1. రథములు, 2. ఏనుగులు, 3. గుఱ్ఱములు, 4. కాల్బలము, 5. విష్టులు, 6. నావికులు, 7. చారులు, 8. దేశికులు [ఇవి సేనాంగములు].
 7. (ఓ.) 1. నువ్వులు, 2. అన్నము, 3. పానీయము, 4. ధూపము, 5. దీపము, 6. పాలు, 7. తేనె, 8. నేయి [ఇవి పిండాంగములు].

(ఔ.) 1. వాస్తుపురుష వికల్పన, 2. పురనివేశము-ద్వారకర్మ, 3. ప్రాసాద నిర్మాణము, 4. ధ్వజోచ్ఛ్రితి, 5. రాజవేశ్మ, 6. చాతుర్వర్ణ్యవిభాగము, 7. యజమాన శాలాప్రమాణము, 8. రాజశిబిర నివేశము-దుర్గకర్మ [ఇవి వాస్తువున కంగములు].

 1. (అం.) 1. ఆధానము, 2. విసర్గము, 3. ప్రైషము, 4. నిషేధము, 5. అర్థవచనము, 6. వ్యవహారేక్షణము, 7. దండము, 8. శుద్ధి [ఇవి రాజకార్యాంగములు].
 2. (అః.) 1. స్మరణము, 2. కీర్తనము, 3. ప్రేక్షణము, 4. కేళి, 5. గుహ్యభాషణము, 6. సంకల్పము, 7. అధ్యవసాయము, 8. క్రియానిర్వృత్తి [ఇవి మైథునాంగములు].
 3. (క.) 1. ముగ్గు, 2. సుగంధము, 3. అక్షతలు, 4. పుష్పములు, 5. ధూపము, 6. దీపము, 7. ఉపహారము, 8. తాంబూలము [ఇవి పూజాంగములు].
 4. (ఖ.) సప్త అంగములు (అ.) , 8. పౌరశ్రేణి
 5. (గ.) 1. గుగ్గిలము, 2. వేపాకు, 3. వస, 4. చెంగల్వకోష్టు, 5. కరక్కాయ, 6. ఆవాలు, 7. యవలు, 8. నేయి [ఇవి జ్వరనాశక ధూపాంగములు].
 6. (ఘ.) 1. రాజు, 2. రాష్ట్రము, 3. అమాత్యుడు, 4. దుర్గము, 5. బలము, 6. కోశము, 7. సామంతులు, 8. ప్రజలు [ఇవి రాజ్యాంగములు].

మూలములు[మార్చు]

https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/