అష్ట భోగములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అష్ట భోగములలో ఒకటైన తాంబూలము

భోగము అంటే అధిక సుఖము. ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం ఈ అష్యభోగములు నాలుగు విధములుగా ఉన్నాయి.[1] అష్ట భోగములు అంటే గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము. వీటిల్లో గృహము, శయ్య, వస్త్రము అనేవి శరీరాన్ని సూచిస్తే, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము మనస్సును సూచిస్తాయి. అంటే శరీరముతో అనుభవించేవి కొన్ని, మనస్సుతో అనుభవించేవి కొన్ని. చివరికి అన్నీ మనసుతోనే అనుభవిస్తారు. ప్రతి భోగాన్ని మనస్సు అనుభవిస్తుంది. ఆ మనసుతో అనుభవించేవి శాశ్వతము అయితే అది యోగము. లేక పోతే భోగము. భోగము రోగాన్ని తెచ్చి పెడుతుంది. యోగము నిరతిశయానందమును తెచ్చి పెడుతుంది. భోగము వలన శరీరము అలసి పోతుంది. యోగము వలన ఆత్మ బలాన్ని, శక్తిని పొందుతుంది.

వివిధ రకాల వర్గీకరణ[మార్చు]

  1. (అ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. భోజనము, 5. వస్త్రము, 6. సతి, 7. స్నానము, 8. సంయోగము.
  2. (ఆ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. అన్నము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. శయ్య, 8. గానము.
  3. (ఇ.) 1. గంధము, 2. తాంబూలము, 3. పుష్పము, 4. గృహము, 5. వస్త్రము, 6. స్త్రీ, 7. ఆభరణము, 8. శయ్య.
  4. వ (ఈ.) 1. ధనము, 2. ధాన్యము, 3. వాహనము, 4. భోజనము, 5. వస్త్రము, 6. సతి, 7. స్నానము, 8. సంయోగము.

మూలము[మార్చు]

  1. "తెలుగు నిఘంటువు Online Telugu Dictionary - AndhrabhArati nighaMTu SOdhana - ఆంధ్రభారతి నిఘంటు శోధన Telugu Dictionary Online Telugu Dictionary telugu nighantuvu Telugu Online Dictionaries telugunighantuvu తెలుగునిఘంటువు telugunighantuvulu తెలుగునిఘంటువులు శబ్దరత్నాకరము శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు బ్రౌన్ నిఘంటువు ఆంధ్ర వాచస్పత్యము వావిళ్ల నిఘంటువు వావిళ్ళ నిఘంటువు తెలుగు వ్యుత్పత్తి కోశము తెలుగు వ్యుత్పత్తి కోశం శబ్దార్థ చంద్రిక ఆంధ్ర దీపిక శ్రీ సూర్యరాయ నిఘంటువు Telugu Nighantuvu Nigantuvu Bahujanapalli Sitaramacharyulu Sabdaratnakaram Sabdaratnakaramu Shabdaratnakaram Shabdaratnakaramu Sabda ratnakaramu Shabda ratnakaramu Charles Philip Brown Telugu-English Dictionary, English-Telugu Dictionary Adhunika vyavaharakosamu Shabdaratnakaramu, Urdu Telugu Dictionary". web.archive.org. 2014-02-09. Archived from the original on 2014-02-09. Retrieved 2020-06-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)