Jump to content

పంచేంద్రియాలు

వికీపీడియా నుండి
(ఇంద్రియాలు నుండి దారిమార్పు చెందింది)
పంచేంద్రియాలు
Colored dice with white background
కన్ను
Colored dice with checkered background
ముక్కు
Colored dice with checkered background
చెవి
Colored dice with checkered background
నాలుక
Colored dice with checkered background
మానవుని చర్మం

పంచేంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు: కళ్లు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. ఇవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడానికి సహాయపడతాయి. వీటిని జ్ఞానేంద్రియాలు అని కూడా అంటారు. ఇవి చూడటం, వినడం, వాసన గ్రహించటం, రుచి చూడటం మరియు స్పర్శ జ్ఞానాన్ని అందిస్తాయి. వీటిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని రెండు విధాలుగా ఉంటాయి. కర్మేంద్రియాల ద్వారా మనం కర్మల చేస్తాం. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సంపాదిస్తాం. ఈ ఇంద్రియాల ద్వారా మనిషి అనేక రకాలైన భోగాలను అనుభవిస్తుంటాడు. కర్మేంద్రియాల ద్వారా మనం శరీరాన్ని పోషించుకుంటాం. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాన సముపార్జన చేస్తాం.

ప్రమాదం పొంచి వున్నదని అర్థం కాగానే తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది. అలాగే ప్రజ్ఞావంతుడు ఉన్నతమైన లక్ష్యాన్ని చూసి అల్పమైన ఇంద్రియ భోగాలను విడిచిపెడతాడు. అతడి బుద్ధి ఎప్పుడూ స్థిరంగా వుంటుంది. ఇంద్రియాలు ఆయా ఇంద్రియార్థాల మీదకు వెళితే బుద్ధి లక్ష్యం మీద నిలువదు. కనుక ఇంద్రియాలను నిగ్రహించి, తగురీతిన వాటిని వాడుకుంటూ లక్ష్యసాధనలో నిలవడమే తక్షణ కర్తవ్యంగా భావించాలి.

ఇంద్రియాలు

[మార్చు]

కర్మేంద్రియ పంచకం:

[మార్చు]

''వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ.

జ్ఞానేంద్రియాలు

[మార్చు]

" సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అని చాణ్యక్య నీతి సూత్రంలో ఉంది.అనగా ఇంద్రియాలన్నిటిలోనూ కన్ను ముఖ్యం. ‘దృష్టి లోపించిన వ్యక్తి క్రిమికీటకాలతో సమానం’ అన్నాడుట ఆయుర్వేద శాస్త్రానికి ఆద్యులనదగ్గ త్రిమూర్తులలో ఒకడైనవాడు, అష్టాంగసంగ్రహ అనే గ్రంథాన్ని రచించిన వాడు అయిన వాగ్భటాచార్యుడు. భగవద్గీత మూడవ అధ్యాయంలో బాహ్య ప్రపంచాన్ని అవగాహన చేసుకునే ప్రక్రియలో ఇంద్రియాల పాత్ర గురించి ప్రస్తావన కనిపిస్తుంది. ఉపనిషత్తులలో పెక్కు చోట్ల ఆత్మ, పరమాత్మలని అవగాహన చేసికోవడంలో ఇంద్రియాల పాత్ర, ప్రత్యేకించి నయనేంద్రియం పాత్ర, కనిపిస్తుంది. ‘దేనిని కండ్లు చూడలేవో, దేనివల్ల కండ్లు చూడగలుగుతున్నాయో అదే పరమాత్మ’ అంటుంది కేనోపనిషత్తు. ఇలా ఒకటేమిటి, పతంజలి యోగసూత్రాలలో, చరక సంహితంలో నయనేంద్రియం యొక్క ప్రాశస్త్యం గురించి ప్రస్తావన అనేక కోణాలలో కనిపిస్తుంది.[1]

ఉపయోగాలు

[మార్చు]

మానవుడికి జ్ఞాన సముపార్జన వీటి ద్వారానే జరుగుతుంది కండ్లు చూపునకు, చెవులు వినికిడికి, ముక్కు వాసనకు, నాలుక రుచికి మాటకు, చర్మం స్పర్మ కు ఉపయోగపడుతుంది.

నష్టాలు

[మార్చు]
  • కళ్ళు: పొలంలోని వ్యవసాయదారులు అగ్నిని రగిల్చినపుడు ఆ కాంతి పుంజాలకు భ్రాంతిని పొంది మిడుతలు అగ్గిలో పడి చస్తాయి. అది కన్నులు చేసే మాయ.
  • చెవులు: జింక పిల్లలను పట్టుకోవడానికి వేటగాడు శ్రావ్యమైన సంగీతాన్ని వాయిస్తాడు. ఆ శబ్దాన్ని విని జింకలు చెవులు విప్పారించి తన్మయత్వములో ఉన్నప్పుడు వెనుక నుంచి వచ్చి మరొక వేటగాడు పట్టుకుంటాడు.. ఇది చెవులు చేసే మాయ.
  • నాలుక: గాలానికి ఎర్రను కుట్టి జాలరి నీటి నందు వేస్తే, ఆ రుచికి భ్రమించిన చేప దానిని మింగి జాలరికి చిక్కి చస్తుంది.. అది నాలుక చేసే మాయ.
  • ముక్కు: సువాసనకు లోనయిన తుమ్మెద కొన్ని పువ్వుల నుండి వెలువడే విషపదార్థ వాసనలను పీల్చి చనిపోతుంది… అది ముక్కు చేసే మాయ.
  • చర్మము: అడవి ఏనుగును పట్టుకోవడానికి తర్పీదు ఇచ్చిన ఆడ ఏనుగును అడవికి పంపుతారు. ఆ మగ ఏనుగును కలసి దానితో చర్మాన్ని రాసి దీనితో పాటు దానిని పిలుచుకొని వస్తుంది.. దారిలో పయోముఖ విష కుంభము నందు పడి మనుషులకు చిక్కుతుందు. ఇది చర్మము చేసే మాయ.

ఒక్కొక్క పంచేద్రియము ఒక్కొక్క దానిని మాయ చేస్తే మనిషిని మాత్రం పంచేద్రియాలు కలిసి కట్టగా మాయ చేసి మత్తెక్కించి, పతనాన్ని శాసిస్తున్నాయి.

ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య. ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.[2]

ఇంద్రియ నిగ్రహం

[మార్చు]

మానవులకు ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకం అయినది. దీనిని పాటించి ఎందరో మహానీయులు ప్రఖ్యాతి గడించారు. ఇంద్రియాలను నియంత్రించుకుంటూ, సుఖ దుఖాలు, చావు పుట్టుకలు, ఆనంద విచారాలు మొదలైన ద్వందాలు నుండి విడివడి పరిపూర్ణమైన, శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ఎలా పొందవచ్చునో శ్రీ కృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు.'[3]

యదా సమరతే చాయం కూర్మోజ్గానీవ సర్వస: ఇంద్రియాణీంద్రియార్దేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||

మూలాలు

[మార్చు]
  1. "పంచేంద్రియాలు: 2. చూపు – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). 2025-03-05. Retrieved 2025-11-29.[permanent dead link]
  2. Charya, M. N. (2022-09-19). "మనిషి పుట్టుకలోనే ఉన్న ఇంద్రియాలు ఏవి..? వాల్మీకీ సూక్తులు ఏంటి..!". https://telugu.oneindia.com. Retrieved 2025-11-29. {{cite web}}: External link in |website= (help)
  3. "ఇంద్రియ నిగ్రహం". అచ్చంగా తెలుగు. Retrieved 2025-11-29.

బాహ్య లంకెలు

[మార్చు]