ఏకోనపంచాశత్-ఉపపాతకములు
1. గోవధము, 2. అయాజ్య యాజనము, 3. పరదారగమనము, 4. ఆత్మవిక్రయము, 5. గురుత్యాగము, 6. మాతృత్యాగము, 7. పితృత్యాగము, 8. పై రెండింటిని (6,7) చేయువారికి కన్యనిచ్చుట, 9. పై రెండింటిని (6,7) చేయువారిచే యాగము చేయించుట, 10. స్వాధ్యాయత్యాగము, 11. అగ్నిత్యాగము, 12. సుతత్యాగము, 13. పరివిత్తిత (తమ్మునికి పెళ్ళియయి అన్నకు పెళ్ళికాకుండ నుండుట), 14. పరివేదనము (తమ్ముడు అన్నకంటె ముందు పెళ్ళియాడుట), 15. కన్యాదూషణము, 16. వార్ధుష్యము (వడ్డీకిచ్చి జీవనము చేయుట), 17. వ్రతలోపము, 18. తటాక విక్రయము, 19. ఆరామ విక్రయము, 20. భార్యావిక్రయము, 21. అపత్యవిక్రయము, 22. వ్రాత్యత (సంస్కారహీనత), 23. బాంధవత్యాగము, 24. వేతనము కొఱకు వేదాధ్యయనము గావించుట, 25. వేతనిమిచ్చి వేదాధ్యయనము గావించుట, 26. అమ్మదగని వస్తువుల నమ్ముట, 27. సర్వాకరముల యందధికారము, 28. మహాయంత్ర ప్రవర్తనము, 29. ఓషధి హింస, 30. స్త్రీచే బ్రతుకుట, 31. అభిచారము, 32. మూలకర్మ, 33. ఇంధనము కొఱకు వృక్షములను కొట్టివేయుట, 34. స్వార్థము కొఱకేపనిని చేయుట, 35. దూషితాన్నమును భక్షించుట, 36. అగ్న్యాధానము చేయకుండుట, 37. దొంగతనము చేయుట, 38. త్రివిధ-ఋణములను తీర్చకుండుట, 39. చెడుశాస్త్రములను చదువుట, 40. నృత్యము, గానము వీని నభ్యసించుట, 41. ధాన్యచౌర్యము, 42. కుప్యచౌర్యము, 43. పశుచౌర్యము, 44. మద్యపానము చేసే స్త్రీతోడి సంగమము, 45. స్త్రీవధ, 46. శూద్రవధ, 47. వైశ్యవధ, 48. క్షత్రియవధ, 49. నాస్తిక్యము. [మనుస్మృతి 11-59] [ఉపపాతకముల విషయమున మతభేదములు గలవు. యాజ్ఞవల్క్య స్మృతి యందు 51 ఉపపాతకములు చెప్పబడినవి. శంఖుడు 18, శాతాతపుడు 8 ఉపపాతకములనే పేర్కొనినట్లు యా.స్మృ. వ్యాఖ్యానమగు బాలక్రీడయందు తెలుపబడినది]