ద్విసప్తతి-కళలు
స్వరూపం
(అ.)
- వివిధ లిపులను వ్రాయుట
- గణితము
- శిల్పము చిత్రము వస్త్రము బంగారము మొ|| వానితో ఆకృతులను నిర్మించుట
- నాట్యము
- గానము
- వాద్యములను వాయించుట
- సప్తస్వరములను తెలిసియుండుట
- పుష్కరమను చర్మవాద్యమును వాయించుట
- సమతాళమను వాద్యవిశేషము
- జూదము
- జనులతో సంభాషించు నేర్పు
- పాచికలతో నాడు ఒక యాట
- చదరములు గల పలకపై యాడుట
- పట్టణమును పాలించుట-అన్ని విషయములందును ముందుండుట
- మట్టిని నీటితో కలుపు నేర్పు
- వంటచేయుట మొదలగు నాహారవిధులు
- పానీయములు చేయుట మొదలగు విధులు
- విలేపనమునకు సంబంధించిన విధులు
- వస్త్రవిధులు
- శయనవిధులు
- ఆర్యాఛందస్సునకు చెందిన పద్యములు
- ప్రహేళికలు (పొడుపుకథలు)
- మాగధీభాషలోని పద్యములు
- గాథలు
- ప్రాకృత పద్యజాతి
- సంస్కృత పద్యములు
- వెండిని ఇతరములతో మిశ్రణము చేయుట
- బంగారమును ఇతరములతో మిశ్రణము చేయుట
- కరగించిన రాగిని బంగారముగా మార్చుటకై చూర్ణములను కలుపుట
- ఆభరణ విధులు
- తరుణులను అలంకరించు విధము
- స్త్రీ లక్షణములు
- పురుష లక్షణములు
- అశ్వ లక్షణములు
- ఆబోతుల లక్షణములు
- అశ్వలక్షణములు
- కుక్కుట లక్షణములు
- మేకల లక్షణములు
- ఛత్రలక్షణము
- దండ లక్షణము
- ఖడ్గలక్షణము
- మణిలక్షణములు
- భూషణ లక్షణములు
- గృహ నిర్మాణము
- శిబిరములను కొలుచుట
- నగరములను కొలుచుట
- వివిధాకృతులు గల సేనావ్యూహములను నిర్మించుట
- త్రివ్యూహా విధానము
- విషవిద్య
- ప్రతివిషవిద్య
- చక్రవ్యూహము
- గరుడవ్యూహము
- శకటవ్యూహము
- యుద్ధము
- నియుద్ధము
- శత్రువును మించి యుద్ధము చేయుట
- అస్థియుద్ధము
- ముష్టి యుద్ధము
- బాహుయుద్ధము
- లతాయుద్ధము
- బాణప్రయోగము
- ఖడ్గాఘాతము
- ధనుర్వేదము
- వెండిని కరగించుట మిశ్రణము చేయుట చూర్ణము చేయుట మొ||
- బంగారమును కరగించుట మిశ్రణము చేయుట చూర్ణము చేయు మొ||
- సూత్రక్రీడ
- వృత్తక్రీడ
- బాణములతో నాడుట-లేక తామర తూడులతో నాడు ఆట
- పత్రచ్ఛేద్యము
- కటకచ్ఛేధ్యము (బంగారము మొదలగువానితో కడియములు చేయుట)
- పుంజు గుఱ్ఱము మొ|| వానిని పణమొడ్డి ఆడు ఆటలు
- శకున విద్య
-[శ్రీవత్సనిఘంటువు]
(ఆ.)
- లేఖనము
- పఠనము
- గణితము
- గానము
- నర్తనము
- తాళమునకు దగిన వాద్యవిశేషము
- పటహము (చర్మవాద్య విశేషము)
- మృదంగము
- వీణ
- వేణువు
- భేరీపరీక్ష
- గజశిక్ష
- ఆశ్వశిక్ష
- ధాతువాదము
- దృగ్వాదము
- మంత్రశిక్ష
- శరీరమందలి వికృతత్వమును పోగొట్టుట
- పలితవినాశము
- రత్నలక్షణము
- నారీలక్షణము
- పురుషలక్షణము
- ఛందస్సు
- తర్కము
- సునీతి (నీతి రాజనీతి అర్థశాస్త్రము)
- తత్త్వము
- కవిత్వము
- జ్యోతిషము
- శ్రుతులు
- వైద్యము
- భాషలు
- యోగశాస్త్రము
- రసాయనశాస్త్రము
- అంజనవిద్య
- లిపి
- స్వప్నము
- ఇంద్రజాలము
- కృషి
- వాణిజ్యము
- నృపసేవనము
- శకునము
- వాయుసంసూచనము
- అగ్నిసంసూచనము
- దృష్టి
- లేపనము
- మర్దనము
- ఊర్ధ్వగతి
- ఘటబంధము
- ఘటభ్రమ
- పత్రచ్ఛేదనము
- పద్మభేదనము
- ఫలమును కోయుట
- జలస్థానమును తెలిసికొనుట
- వర్షాగమనమును తెలిసికొనుట
- లోకాచారము
- జనానువృత్తి
- ఫలభృత్తు (బంతి కట్టి పంటనూర్చి తీసకొనిపోవుట)
- ఖడ్గబంధనము
- క్షురీబంధనము
- ముద్రలు
- ఇనుముతో వస్తువులు చేయుట
- దంతములతో వస్తువులు చేయుట
- కట్టెతో వస్తువులు చేయుట
- చిత్రకర్మ
- బాహుయుద్ధము
- దృగ్యుద్ధము
- ముష్టియుద్ధము
- దండయుద్ధము
- ఖడ్గయుద్ధము
- వాగ్యుద్ధము
- గారుడదమనము
- సర్పదమనము
- భూతదమనము
-[శ్రీవత్సనిఘంటువు]