వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2014
Jump to navigation
Jump to search
|
2014 సంవత్సరం లోని వాక్యాలు
[మార్చు]1 వ వారం
[మార్చు]- ....యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి ఫీల్డ్స్ పతకం అనీ!
- ...అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర అనీ! ( సప్తగిరులు వ్యాసం )
- ...కాయలను కృత్రిమంగా త్వరగా పండ్లుగా మార్చుటకు ఎసిటిలీన్ వాయువు వాడతారనీ!
- ... భూమి నుండి సుదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు వోయెజర్ 1 అనీ!
- ....వాతావరణ పీడనంలోని హెచ్చు, తగ్గులను గుర్తించుటకు వాడే పరికరం భారమితి అనీ!
2 వ వారం
[మార్చు]- ....ఆంజనేయ స్వామివారు చతుర్భుజములతో శంఖచక్రములతో యోగముద్రలో వేంచేసి ఉండే ఆలయం తిరుక్కడిగై అనీ!
- ... ఇన్ఫోసిస్ అవార్డు పొందిన తొలి తెలుగు శాస్త్రవేత్త వలిపె రాంగోపాలరావు అనీ!
- ... భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు బల్వంతరాయ్ మెహతా అనీ!
- ... మండలి వెంకటకృష్ణారావు గారు "దివిసీమ గాంధీ" గా ప్రతీతి అనీ!
- ... తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్త బాలసరస్వతి అనీ!
3 వ వారం
[మార్చు]- ....చంద్ర మండల శోధన మిషన్ చాంగ్ ఈ 3 అనీ!
- ...శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటాన్ని కావ్యరూపంగా మలచిన ప్రముఖ కవి ఛాయరాజ్ అనీ!
- ...త్రిపిటకాలలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రసిధ్ధికెక్కిన గ్రంథము ధమ్మపదం అనీ!
- ...అన్ని మతాలను మానవ కల్యాణార్ధం కలుపుకోయే సంస్థ సంత్ నిరంకారీ మిషన్ అనీ!
- ...సౌరకుటుంబంలో దట్టమైన వాయుమండలం గల సహజ ఉపగ్రహం టైటన్ అనీ!
4 వ వారం
[మార్చు]- ...వనములతోను, జలప్రవాహములతోను రమణీయమైన విలక్షన పుణ్యక్షేత్రం తిరునీర్మలై అనీ!
- ...కాంతి వేగాన్ని ఖచ్చితంగా గణించిన శాస్త్రవెత్త లీయాన్ ఫోకాల్ట్ అనీ!
- ...ప్రపంచంలోనే అతిపెద్దదైన సహజ వంతెన జియాన్ రెన్ బ్రిడ్జి అనీ!
- ...మొఘల్ సామ్రాజ్యంలో అక్బరు పరిపాలనా కాలంలో అనేక మహిమలు గల సూఫీ సంతుడు సలీం చిష్తీ అనీ!
- ...గ్రహం యొక్క ఉపరితలంపై లేదా ఇతర ఖగోళ గ్రహాంపై తరలించేందుకు రూపొందించబడిన వాహనం రోవర్ అనీ!
5 వ వారం
[మార్చు]- ...వృక్షాల అభివృద్ధిని కొలిచే సాధనం క్రెస్కోగ్రాఫ్ అనీ!
- ...అచ్చమైన తెలంగాణా వాతవరణం, మానవ సంబంధాలూ కలిపి చక్కనైన కుటుంబకథా నవల అగ్నిపరీక్ష (నవల) అనీ!
- ... భారీ బరువులను సులువుగా ఎత్తే ఉపకరణం విన్డ్ లస్ అనీ!
- ...తొలి అచ్చతెలుగు కావ్యం రాసిన విశిష్టమైన కవి పొన్నెగంటి తెలగన్న అనీ!
- ...కులప్రాతిపదికన ఓ వర్గం ఎదుర్కొన్న అనేకరకాల అక్రోశాల, బాధల, అన్యాయాల, తిరుగుబాటు వివరణలను చిత్రీకరించిన నవలఅంటరాని వసంతం అనీ!
6 వ వారం
[మార్చు]- ... గోనరెడ్ల పాలకులకు మరియు చాళుక్యులకు సంబంధించిన పలు చారిత్రక ఆధారాలు శాసనాలు భూత్పూరు గ్రామంలో ఉన్నాయనీ!
- ...నూనె తీయు యంత్రాలను, పరికరాలను డిజైన్ చెయ్యడం, అయిల్ ప్రాసెసింగ్ లో వచ్చు సమస్యలను సరిదిద్దగలిగిన విషయాలు తెలియజేసిన శాస్త్రవేత్త పాలగిరి రామక్రిష్ణా రెడ్డి అనీ!
- ...కొన్ని ప్రాంతాలలో కారాగారవాసం చేసే ఖైదీలకు గుర్తుగా పంచ బిందు పచ్చబొట్టు ను వాడతారనీ!
- ...భారత దేశం లోని మిస్సైల్ ప్రాజెక్టు ను నిర్వహించిన మొదటి మహిళగా ఖ్యాతినార్జించింది టెస్సీ థామస్ అనీ!
- ...ధారణాశక్తిని పెంపొందించడానికి ఉపకరించే తొలి ప్రయోగాత్మ పుస్తకం విజయానికి ఎనిమిది సూత్రాలు అనీ!
7 వ వారం
[మార్చు]- ...ఆక్యు ప్రెషర్ , మాగ్నెట్ థెరపీ వంటి వాటిని నయం చేయగలిగే అద్భుతమైన వైద్యవిధానం అయస్కాంతంతో ఆరోగ్యం అనీ!
- ...తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున అనీ!
- ...ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుతేజం నూతలపాటి వెంకటరమణ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనారనీ!
- ... "నాసా" లో సౌరవ్యవస్థలో జరుగుతున్న విశేష మార్పులను అధ్యయనం చేస్తున్న భారతీయ మహిళా శాస్త్రవేత్త మధులికా గుహాతకుర్త అనీ!
- .... కృత్రిమ పాదం ( జైపూర్ ఫుట్) సృష్టి కర్త ప్రమోద్ కరణ్ సేథీ అనీ!
8 వ వారం
[మార్చు]- ...ఇతరులను ప్రేమించే మనస్తత్వం బోన్సాయ్ ప్రేమికులకు వుంటుందనీ!
- .... భారత దేశమునకు చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు నారాయణ్ కార్తికేయన్ అనీ!
- ..."మళయాళ మనోరమ" పత్రికను దేశీయ పత్రికా రంగంలో ఉన్నత స్థానంలో నిలిపినది కె.ఎం.మాథ్యూ అనీ!
- ...మనం నిత్యం వాడుతున్న "సెల్‌ఫోన్" రేడియోధార్మికతను నివారించే మార్గాలు ఉన్నాయనీ! సెల్ ఫోన్ రేడియో ధార్మికశక్తి
- ...వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం వైఖానసం అనీ!
9 వ వారం
[మార్చు]- ...1910 లో గురజాడ అప్పారావు వర్ణించిన "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక" అనునది హేలీ తోకచుక్క అనీ!
- ...కథక్ నృత్యాన్ని నిరంతరాయంయంగా 9 గంటల 20 నిముషాల పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన కళాకారుడు గోపీకృష్ణ అనీ!
- ... మహబూబ్ నగర్ జిల్లా లోని గిరిదుర్గాలలో గల పర్యాటక ప్రదేశం చంద్రగఢ్ కోట అనీ!
- ...రామాయణం లో రామరావణ యుద్ధ సమయంలో రామలక్ష్మణులను అపహరించిన వ్యక్తి మైరావణుడు అనీ!
- ... ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ప్రమాదకరమైనవనీ! ప్లాస్టిక్ తో ప్రమాదాలు వ్యాసం.
10వ వారం
[మార్చు]- ... మూడు వంతెనలతో కూడిన ముచ్చటైన జలపాతం బాటరా గోర్జ్ జలపాతం అనీ!
- ... ప్రపంచ ప్రాచ్య గ్రంథాలయాల్లోకీ ముఖ్యమయినదిగా పేరొందినది అడయారు గ్రంథాలయము అనీ!
- ... కఠోపనిషత్తు మీద విశేషమైన గ్రంథం "కఠయోగ" వ్రాసిన ఆధ్యాత్మిక గురువు కందుకూరి శివానందమూర్తి అనీ!
- ...దక్షిణ భారతములో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పిలువబడ్డ శాస్త్రవేత్త గోపాలస్వామి దొరస్వామి నాయుడు అనీ!
- ...విద్యుత్ బల్బులో ఉపయోగించే ఫిలమెంట్ ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్త విలియం డి.కూలిడ్జ్ అనీ!
11 వ వారం
[మార్చు]- ... రుద్రప్రయాగ్ లో కల త్రియుగి నారాయణ్ ప్రాంతంలో శివపార్వతుల వివాహం సత్యయుగంలో జరిగిందనీ!
- ....కుంభకోణం వద్ద తిరునాగేశ్వరం రాహుస్థలం లో శక్తిమంతమైన గణపతి యంత్రాన్ని స్థాపించిన ఆధ్యాత్మిక యోగి సదాశివబ్రహ్మేంద్ర అనీ!
- ...దక్షిణ ధృవాన్ని మొట్టమొదటి సారిగా వెళ్ళిన భారతీయ వనిత రీనా కౌశల్ ధర్మ్‌శక్తు అనీ!
- ...ఎవరెష్టు శిఖరాన్ని ఐదు సార్లు అధిరోహించిన పర్వతారోహకుడు లవ్ రాజ్ సింగ్ ధర్మ్‌శక్తు అనీ!
- ...మనసులో తలచుకొన్న ప్రశ్నలకి , సులభంగా, సమాధానాలు చెప్పే శాస్త్రమే ప్రశ్నా శాస్త్రము అనీ!
12 వ వారం
[మార్చు]- ...భారతీయ, యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు గల అద్భుతమైన రాజమందిరం మైసూర్ రాజభవనం అనీ!
- .... తల్లి గర్భమందే వేదములు వల్లెవేసిన మహర్షి అష్టావక్ర మహర్షి అనీ!
- ... హైందవ బౌద్ధ మతముల వ్యాప్తికి, ఆంధ్రుల నౌకాయానం ఎంతగా దోహదపడిందనీ! (ప్రాచీనాంధ్ర నౌకాజీవనము వ్యాసం)
- ...తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి ఎస్. టి. జ్ఞానానంద కవి అనీ!
- ... దివ్యతిరుపతులు 114 ఉన్నాయనీ!
13 వ వారం
[మార్చు]- ...గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర పట్టణాలలో ఉత్తరకాశి ఒకటనీ!
- ...దుర్వాస మహర్షి తన భార్య అయిన "కందని" ని కూడా తన కోపాగ్నితో భస్మం చేశాడనీ! ఔరవ మహర్షి వ్యాసం.
- ...మొదటి వివాహం అమలులో ఉన్నప్పుడు భర్త రెండో వివాహం చేసుకుంటే నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించే చట్టం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనీ! సి.హెచ్.విద్యాసాగర్ రావు వ్యాసం.
- ...దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అనీ!
- ... పితోరాఘర్ సమీపంలోని జౌళ్ జిబి ప్రాంతంలోని కాలాపానీ హిల్ ప్రదేశంని వేడి నీటి బుగ్గలలోని నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయనీ!
14 వ వారం
[మార్చు]- ...శివుడి భార్య అయిన సతి యొక్క ఎడమ కన్ను పడి నైనీతాల్ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడిందనీ!
- ... విష్ణువు కూర్మావతారం కనిపించే విశిష్ట పర్యాటక ప్రదేశం చంపావత్ అనీ!
- ... తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్షను రచించినవారు గాజుల సత్యనారాయణ అనీ!
- ... ఇండోనేషియాలో మర్రి ఊడలతో కూడిన సహజ వంతెన జెంబతాన్ అకర్ అనీ!
- ...స్వామి వివేకానంద తపస్సు చేసే ప్రాంతంగా విశ్వసింపబడుతున్న ఆలయం "కాసర్ దేవి ఆలయం" అనీ! (ఆల్మోరా వ్యాసం)
15 వ వారం
[మార్చు]- ...సుదూర ప్రాంతాలలో వున్న వస్తువులను పరిశీలించుటకు ఉపయోగిందు సాధనం టెలిస్కోపు అనీ!
- ...కేరళ లో అతిపెద్ద జలపాతం అతిరాపల్లి జలపాతం అనీ!
- ... తెలుగు సాహిత్యరంగంలో, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందిన కవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి అనీ!
- ...ఆరు కాండాలలో సుమారు 13 వందల పద్యాలతో అచ్చమైన తెలుగులో వ్రాయబడిన గ్రంథం అచ్చతెలుగు రామాయణం అనీ!
- ...అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గిజిగాడు నిర్మించిన గూడు గిజిగాడి గూడు అనీ!
16 వ వారం
[మార్చు]- ...ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన సత్య నాదెళ్ల మన తెలుగువారనీ!
- ...పాశ్చాత్య వైద్యం లో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి అనీ!
- ...విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేనరాజు నాటకాన్ని వ్యతిరేకిస్తూ అదే ఇతివృత్తాన్ని నాస్తిక దృక్కోణంలో త్రిపురనేని రామస్వామి ఖూనీ అనే నాటకాన్ని వ్రాశారనీ!
- ... 'బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్' గా పిలువబడే అందమైన పక్షి స్వర్గలోకపు పక్షి అనీ!
- ...మడగాస్కర్ దీవిలో కొత్తగా బయటపడ్డ ఓ పొట్టి వానరం లావాసో డ్వార్ఫ్ లెమర్ అనీ!
17 వ వారం
[మార్చు]- ...సూర్యుని గమనం ద్వారా సమయాన్ని తెలిపే పరికరము పలభా యంత్రము అనీ!
- ...చావులేని జలచరం టర్రిటోప్సిస్ నూట్రికోలా అనీ!
- ...మెడసాయంతో ఆడవి లో గూళ్లు కట్టే కీటకం జిరాఫీ వీవిల్ అనీ!
- ...సజాతీయమైన లోహంలనే కాకుండ భిన్నమైన లోహాలను కూడా అతుకగలిగే విధానం ఫ్రిక్షను వెల్డింగు అనీ!
- ...మిగ్-35 లో వాయువిహారం చేసిన తొలి భారతీయురాలు సుమన్ శర్మ అనీ!
18 వ వారం
[మార్చు]- ...ప్రపంచంలో అతిచిన్న వానరం పిగ్మీ మార్మోసెట్ అనీ!
- ...పొగ తాగటం, వూబకాయం, మధుమేహం, మద్యం అలవాటు వంటివి క్లోమ కాన్సర్ కు కారకాలనీ!
- ...ఘర్షణ ఫలితంగా వెలువడిన ఉష్ణశక్తి ఆధారంగా లోహాలను అతుకు ప్రక్రియ ఫ్రిక్షను వెల్డింగు అనీ!
- ...భారతదేశంలోని మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీ గా జన్మించిన కృతి పరేఖ్ ఇంద్రజాలంలో సైన్స్ ను ప్రదర్శించిన బాలమేధావి అనీ!
- ...కూచిపూడి నాట్యంలో అత్యంత యువ నాట్య కళాకారిణిగా గుర్తింపు పొందిన వారు అచ్యుత మానస అనీ!
19 వ వారం
[మార్చు]- ... ఫాదర్ ఆఫ్ బర్మా గా కీర్తించబడిన అంగ్ సాన్ యొక్క ఏకైక పుత్రిక అంగ్ సాన్ సూకీ అనీ!
- ...సముద్రం నీలిరంగులో కనబడటానికి కారనం రామన్ ఎఫెక్ట్ అనీ!
- ...భారత దేశంలో అతిపిన్న వయసులో లోక్‌సభ సభ్యురాలయిన మహిళ అగాథా సంగ్మా అనీ!
- ...మాంసాహారులు కొన్ని రకాల చేపల,కోడి కూరలకు ఇచ్చే స్థానాన్ని శాకాహారుల పనస పొట్టు కూర కు ఇస్తారనీ!
- ... సిక్ఖులకు రెండవ గురువుగా చరిత్రకెక్కిన వారు గురు అంగద్ దేవ్ అనీ!
20 వ వారం
[మార్చు]- ...అతిపిన్న వయసులో భారత దేశంలో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళ కుమారి సెల్జా అనీ!
- ... నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక యోగిని అక్కూర్తి మూటలమ్మ అనీ!
- ... మైధిలీ సాహిత్య వైతాళికుడు విద్యాపతి అనీ!
- ...తిరుమల వేంకటేశ్వరస్వామికి చుబుకం(గడ్డం)పై ఉండే తెల్లని పచ్చకర్పూరం మచ్చ(శ్రీవత్స చిహ్నం) వెనుక భక్తుడు అనంతాచార్యుల కథ ఉందనీ!
- ...రసికప్రియ అను హిందీ శృంగార కావ్యమును రచించినవారు కేశవదాసు అనీ!
21 వ వారం
[మార్చు]- ...ఎన్.డి.ఎ. ను విజయపథంలో నడిపి భారత ప్రధాని పదవి చేపట్టబోతున్న ప్రముఖ రాజకీయ వేత్త నరేంద్ర మోడి అనీ!(చిత్రంలో)
- ...నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని విజయ పథంలో నడిపి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న నాయకుడు నారా చంద్రబాబునాయుడుఅనీ!
- ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసి తెలంగాణ ను సాధించి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనీ!
- ...ఆంధ్ర ప్రదేశ్ లో పురపాలక సంఘ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు విజయ పథంలో ఉన్నాయనీ! (ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘ ఎన్నికలు - 2014 వ్యాసం)
- ...ఆంధ్ర ప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికలలో సీమాంధ్ర లో తెలుగుదేశం, తెలంగాణ లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు పొందాయనీ! (ఆంధ్ర ప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికలు - 2014 వ్యాసం)
- ...ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా ఎన్నికలలో సీమాంధ్ర లో తెలుగుదేశానికీ, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పట్టంకట్టారనీ! (2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వ్యాసం)
22 వ వారం
[మార్చు]- ...గుజరాత్ రాష్ట్రం లో విద్యాశాఖా మంత్రిగా విశేష సేవలందించిన ముఖ్యమంత్రి అయిన ఆదర్శ మహిళ ఆనందిబెన్ పటేల్ అనీ!(చిత్రం)
- ...టెక్సస్‌లో 3వ పెద్ద మహానగరంగా శాన్ అంటోనియో గుర్తింపబడినదనీ!
- ...ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ ఆరతి సాహా అనీ!
- ...పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంశంలో ప్రముఖ ఆధ్యాత్మిక యోగిని కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ అనీ!
- ...నల్లమల అడవీ ప్రాంతంలో శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఉమామహేశ్వరం ప్రఖ్యాతి చెందినదనీ!
- ...ఏకవింశతి పత్రపూజ లో ఉపయోగించిన పత్రాలకు ఔషథ గుణాలున్నాయనీ!
23 వ వారం
[మార్చు]- ...ఎక్కువ భాగం కృత్రిమ చర్మాలకోసం జీవఅధోకరణం చెందే పాలిమర్ల ను ఉపయోగిస్తున్నాయనీ! (ప్రక్క చిత్రంలో)
- ...భారత దేశంలో 29 వ రాష్ట్రంగా యేర్పడిన తెలంగాణ కు ఏలె లక్ష్మణ్ తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందించారనీ!
- ...నూతనంగా యేర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందెశ్రీ వ్రాసిన జయజయహే తెలంగాణ అనీ!
- ...లాటిన్ అమెరికాలో జన్మించిన తొలి నోబెల్ బహుమతి స్వీకర్త గబ్రియేలా మిస్ట్రాల్ అనీ!
- ...జైనమత 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడు త్రిశాల కుమారుడనీ!
24 వ వారం
[మార్చు]- ...ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితా మహుడిగా పేరుగాంచిన ప్రముఖుడు చినువ అచెబె అనీ!
- ... "క్యోటో ప్రైజ్ ఇన్ ఆర్ట్స్ అండ్ ఫిలాసపీ" అవార్డు పొందిన భారతీయురాలు గాయత్రి చక్రవర్తి స్పివాక్ అనీ!
- ... కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక యోగిని దొంతులమ్మ అనీ!
- ... ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేథావి వశిష్ఠ నారాయణ సింగ్ అనీ!
- ... తెలుగు సాహిత్యంలో భయానక కథల తొలి సంకలనంగా చరిత్రకెక్కిన పుస్తకం ఆ అరగంట చాలు అనీ!
25 వ వారం
[మార్చు]- ... 'మార్మిక వాస్తవ వాదం' పేరిట ప్రభావవంతమైన సిద్ధాంతాన్నీ అందించిన సుప్రసిద్ధ కొలంబియన్ రచయిత గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ అనీ!(చిత్రంలో)
- ... 800 పైగా కూచిపూడి ప్రదర్శనలు ప్రదర్శించిన ప్రముఖ నాట్యకళాకారిణి అచ్యుత మానస అనీ!
- ... దక్షిణాఫ్రికా లో వర్ణవివక్ష వ్యతిరేక పోరాటంలో తన కుమారుని సైతం కోల్పోయిన ఉద్యమకారిణి ఈలా గాంధీ అనీ!
- ...భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర(శనేశ్వర) స్వామి దేవాలయం ఒకటి అనీ!
26 వ వారం
[మార్చు]- ...మధుర నందలి బృందావనం కు సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం ప్రేమమందిరం అనీ! (ప్రక్క చిత్రంలో)
- ...సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి రక్షణకు వాడే లేపనము సన్‌స్క్రీన్ లేపనము అనీ!
- ... రవిశంకర్ కు ఎక్కువసార్లు వాద్య సహకారం అందించిన ప్రముఖ భారతీయ తబలా కళాకారుడు అల్లా రఖా అనీ!
- ...దాల్చిన చెక్క పొడిచేసి ఒక స్పూన్ తేనెకలిపి సేవిస్తే ఆస్తమా అదుపులో ఉండుననీ! (ఆరోగ్య సూత్రాలు వ్యాసం)
- ...ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ధర్మబిక్షం అనీ!
27 వ వారం
[మార్చు]- ...రెండు తోకలు కలిగిఉండే పక్షి జిహోలార్నిస్ అనీ!(ప్రక్క చిత్రంలో)
- ...భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన నటి దేవికారాణి అనీ!
- ...స్వాతంత్ర్యాభిలాషి. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన వారిలో ఒకడు గాజుల లక్ష్మీనరసింహ శ్రేష్టి అనీ!
- ... బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారతీయ అంతర్జాల వాణిజ్య వేదిక ఫ్లిప్‌కార్ట్ అనీ!
- ... తెలుగు సినిమా రంగంలో చక్కటి కుటుంబ చిత్రాల దర్శకుడు ముత్యాల సుబ్బయ్య అనీ!
- ...తొలి తెలుగు మహిళా వెబ్ పత్రిక విహంగ అనీ!
28 వ వారం
[మార్చు]- ...నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి మహిళ బర్ధావాన్ సట్నర్ అనీ!
- ... భారతదేశంలోని మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీ కృతి పరేఖ్ ప్రముఖ ఇంద్ర జాలికురాలనీ!
- ... తొలి తెలుగు నిఘంటు కర్త మామిడి వెంకటార్యులు అనీ!
- ...జపనీస్ కాగితపు మడత యొక్క కళను ఒరిగామి అంటారనీ! (కాగితపు విమానం వ్యాసం)
- ...ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి చేతి పంపు ఇండియా మార్క్ II అనీ!
29 వ వారం
[మార్చు]- ... శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము శ్రీరాముడు ప్రతిష్టించిన రామనాథ స్వామి దేవాలయం అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... "బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక" రచించిన ప్రముఖ తెలుగు కవి కల్లూరి వేంకట రామశాస్త్రి అనీ!
- ...కూచిపూడి రంగం లోనే కాక యావత్ కళాలోకానికి సుపరిచితులయిన ప్రముఖ జంట రాజా రాధా రెడ్డి అనీ!
- ...మహాత్మా గాంధీ మరియు కస్తూరిబాయి గాంధీ ల యొక్క ప్రథమ పుత్రుడు హరిలాల్ గాంధీ తన తండ్రితో విభేధించి కుటుంబ బంధాలను పరిత్యజించాడనీ!
- ...తన తండ్రి మహాత్మా గాంధీ వలెనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు మణిలాల్ గాంధీ అనీ!
30 వ వారం
[మార్చు]- ... రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి తులసీదాసు అనీ!(ప్రక్క చిత్రంలో)
- ...శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ లలో అధిక ప్రాచుర్యం పొందిన వంటకం గులాబ్ జామ్ అనీ!
- ...శక్తి పానీయాలుతాగినవెంటనే తాత్కాలికంగా హుషారు పొందినా మేలు కంటే కీడే ఎక్కువ ఉంటుందనీ!
- ...వ్యక్తిగత కంప్యూటరు నుండి అధిక వేడికల్గిన రేడియేషన్ మనకెంతో హానికరమైనదనీ! పి.సి.చిట్కాలు వ్యాసం.
- ...భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ వి. ఎస్. రమాదేవి అనీ!
31 వ వారం
[మార్చు]- ... భూమిపై అత్యంత వేగంగా, చిరుత కన్నా వేగంగా, పరిగెత్తే కీటకము తవిటి పురుగు అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... పిన్నవయస్సులో ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలిక తెలంగాణకు చెందిన మాలావత్ పూర్ణ అనీ!
- ... కాళిదాసు రచించిన మేఘసందేశంకు వ్యాఖ్యానం రాసిన ప్రముఖ కవి మల్లినాథసూరి అనీ!
- ....పొగాకు వినియోగంతోపాటు వివిధ రకాల ఉత్పత్తుల్నీ నిషేధించిన మొట్టమొదటి దేశంగా భూటాన్ అనీ!
- ... పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4 వేల రకాల రసాయనాలు ఉంటాయనీ... ఇందులో 400 రకాలు కేన్సర్ కారకాలే అనీ!
32 వ వారం
[మార్చు]- ... మిశ్రమ సమ్మేళనాలలోని వివిధ పదార్థాలను వడపోత కాగితం ద్వారా వేరుచేసే పద్ధతి క్రొమటోగ్రఫి అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే బయోడిగ్రేడబుల్ పదార్థాలలో ఒకటి ఖైటోసాన్ అనీ!
- ... ప్రతియేడు చైత్ర పౌర్ణమి నాడు జరుగుతున్న హిజ్రాల విశేష పర్వదినం హిజ్రాల పండగ అనీ!
- ...ఏడు లక్షల చదరపు అడుకుల విస్తీర్ణంలో నిర్మితమైన విశాలమైన దేవాలయం చంద్రోదయ దేవాలయము అనీ!
- ... మనదేశంలో తొలి విమానయాన తయారీ కేంద్రము ఆదిభట్ల గ్రామము అనీ!
33 వ వారం
[మార్చు]- ... ప్రముఖ ఆవిష్కర్త మరియు వ్యాపారవేత్త అయిన థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క స్మారకచిహ్నాం ఎడిసన్ మెమోరియల్ టవర్ ఎడిసన్ నగరంలో ఉన్నదనీ!(ప్రక్క చిత్రంలో)
- ... భారత ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వంతెన అనీ!
- ... ముస్లిం సోదరులు దివ్యఖురాన్ లైలతుల్ ఖదర్ రోజుకే అవతరించిందని భావిస్తారనీ!
- ... సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి ముంతాజ్ అలి అనీ!
- ... బలూచిస్తాన్ (పాకిస్తాన్) కు చెందినా నొక్ కుండి లకు చెందిన ఒక చారిత్రాత్మక ప్రాంతం సీస్తాన్ అనీ!
34 వ వారం
[మార్చు]- ...ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో క్షీరారామం ఒకటనీ!
- ...జపాన్ మరియు చైనాలలో పక్షులకు శిక్షణనిచ్చి సాంప్రదాయక చేపలు పట్టే పద్ధతి కార్మోరాంట్ ఫిషింగ్ అనీ!
- ...1930లో దండి వరకు జరిగిన ప్రసిద్ధ ఉప్పు సత్యాగ్రహ కాలినడక యాత్రతో మహాత్మా గాంధీ పాదయాత్ర చేశారనీ!
- ...తెలుగులో తొలి వృత్తి కథారచయిత అందే నారాయణస్వామి అనీ!
- ...వేదసార రత్నావళి అనే పుస్తకాన్ని వ్రాసింది ఉప్పులూరి గణపతి శాస్త్రి అనీ!
35 వ వారం
[మార్చు]- ...క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొదట సృష్టింపబడిన క్షీరదం డాలి అనీ!
- ...ప్రపంచంలోనే తొలిసారిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా నిర్మించిన హరిత మసీదు ఖలీఫా అల్ తజర్ అనీ!
- ... గుజరాత్ లో ప్రపంచంలోనే 182 మీటర్లతో ఎత్తైన విగ్రహంగా నిలవబోతున్న విగ్రహం ఐక్యతా ప్రతిమ అనీ!
- ...రాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన ప్రముఖ కవి కల్లూరు అహోబలరావు అనీ!
- ... రసాయన శాస్త్రంలో తరచుగా ఆమ్ల క్షారాలను గుర్తించుటకు వాడబడే సూచిక మిథైల్ ఆరెంజ్ అనీ!
36 వ వారం
[మార్చు]- ...20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం పిక్టోరియలిజం అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... ఇన్సులిన్ లోపము వకబ అధికంగా రక్తంలో గ్లూకోజ్ చే వర్ణించబడినటువంటి ఒక జీవక్రియ అపవ్యవస్థ మధుమేహము రకం 2 అనీ!
- ... సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి ముంతాజ్ అలి అనీ!
- ... విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, సూఫీ తరీకాలకు, సాహితీ సంస్కృతులకు నెలవు సీస్తాన్ అనీ!
- ... 54.2 సెకన్లలో 603 పదాలను మాట్లాడి రికార్డు సృష్టించిన వ్యక్తి ఫ్రాన్ కాపో అనీ!
37 వ వారం
[మార్చు]- ... హిందీ యాత్రాసాహిత్య పితగా సుప్రసిద్ధులు రాహుల్ సాంకృత్యాయన్ అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత జిజాబాయి అనీ!
- ...న్యూయార్క్‌లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో 211 కోట్ల రూపాయల ధర పలికిన వజ్రం గోల్కొండ వజ్రం అనీ!
- ...గాంధీ కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శీరిపి ఆంజనేయులు అనీ!
- ...భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త మరియు శ్వేత విప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ అనీ!
38 వ వారం
[మార్చు]- ...తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి కోహినూరు వజ్రము అనీ!
- ... 2014 కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో మహిళల యొక్క 53 కిలోల బరువు విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన వనిత చికా అమలహఅనీ!
- ...కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం మత్స సంతోషి అనీ!
- ...మాటీవి ద్వారా అక్కినేని నాగార్జునచే నిర్వహింపబడి విశేషాదరణ పొందుతున్న టెలివిజన్ షో మీలో ఎవరు కోటీశ్వరుడు అనీ!
- ... ప్రపంచంలోనే అతి పెద్ద గుహ వియత్నాం లోని సన్ డూంగ్ కేవ్ అనీ!
39 వ వారం
[మార్చు]- ... దక్షిణ కొరియా లో నిర్మించబడిన మొట్టమొదది డబుల్ డెక్ వంతెన బాన్పో వంతెన అనీ!(ప్రక్క చిత్రంలో)
- ...ముంబై, నగరంలో పోవై లోయలోని ఒక కృత్రిమమైన సరస్సు పోవై సరస్సు అనీ!
- ...తెలుగుభాషలో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ తయారు చేసింది దేవరాజు వేంకటకృష్ణారావు అనీ!
- అక్బర్ ఆస్థానం లోని నవరత్నాలలో ఒకడు అబుల్ ఫజల్ ఇబ్న్ ముబారక్ అనీ!
- ఆలయాల పురంగా ప్రసిద్ధిచెందిన అలంపూర్‌లో వెలసిన ప్రసిద్ధ దర్గా షా అలీ పహిల్వాన్ దర్గా అనీ!
40 వ వారం
[మార్చు]- ...భారత దేశం లోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన పంబన్ వంతెన అనీ!(చిత్రంలో)
- ...ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్దె అనీ!
- ... ప్రపంచంలో యోగ ఉపాధ్యాయులలో ఒక ప్రసిద్ధ యోగ గురువు బి. కె. ఎస్. అయ్యంగార్ అనీ!
- ...కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం హోగెనక్కల్ జలపాతం అనీ!
- ...గుప్తేశ్వర గుహ నేపాల్ లోని పోఖారా లో ప్రత్యేకమైనదనీ!
41 వ వారం
[మార్చు]- ...అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిస్(ఎఎల్ఎస్) అనే వ్యాధిపై అవగాహన కల్పించడానిపి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమము ఐస్ బకెట్ ఛాలెంజ్ అనీ!(ప్రక్క చిత్రంలో)
- ... ఉత్తమ వచన కవితాసంకలనానికి అందజేసే విశిష్ట అవార్డు ఫ్రీవర్స్ ఫ్రంట్ అనీ!
- ...జహంగీర్ పీర్ దర్గా నందు రాత్రివేళల్లో సింహాలు సంచరించి, తెల్లవారు జామున తమ తోకలతో దర్గాను శుభ్రపరిచి వెళ్ళేవనీ!
- ...ఉత్తర,దక్షిణ అమెరికా ఖండాల్లో అత్యంత సుఖవంతంగా నివసించగలిగే రెండో నగరం అటావా అనీ!
- ...రాథోర్ వంశీకుల్లో 15వ వాడైన రావ్ జోధా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజ్యం సుభిక్షంగానూ శత్రు దుర్భేద్యంగానూ ఉండేందుకు కట్టిన విశేష కోట మెహరాన్ ఘర్ కోట అనీ!
42 వ వారం
[మార్చు]- ...ప్రపంచంలోని అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ అద్భుత చారిత్రక కట్టడం భోపాల్ తాజ్‌మహల్ అనీ!(ప్రక్క చిత్రంలో)
- ...టెర్రకోట, పండిన ఏప్రికాట్ రంగు లేదా విచ్చుకున్న గోధుమరంగు పైకప్పులు గల భవంతులు గల నగరం మార్సే అనీ!
- ...హిందూమతంలో కాళికాదేవి దశ అవతారములలో ఒకటైనది బగళాముఖీ దేవి అనీ!
- ...చట్టానికి చెందిన న్యాయస్థానాలచే రమ్మీ ఆట నైపుణ్యానికి చెందినదని ప్రకటించబడిందనీ!
- ...రామాయణాన్ని దండక రూపంలో వ్రాసింది కలుగోడు అశ్వత్థరావు ఒక్కరే అనీ!
43 వ వారం
[మార్చు]- ...తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న శ్రీకాకుళం పట్టణం నందలి దేవాలయం నారాయణ తిరుమల అనీ!(చిత్రంలో)
- ... ‘వరల్డ్ కేపిటల్ సిటీ ఆఫ్ పాప్’ గా పిలువబడే ప్రసిద్ధ నగరం లివర్‌పూల్ అనీ!
- ...ఆఫ్రికాలో పంటలపై దాడిచేసి తీవ్రనష్టాన్ని కలుగజేసే అతి పెద్ద నత్త ఆఫ్రికా రాక్షస నత్త అనీ!
- ... రామ గుండం రాతిపై దక్షిణం వైపు రెండు జతల సీతారాముల పాదముద్రలు కలిగిన కోట పానగల్ కోట అనీ!
- ...ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైన కీలక ఉద్యమాలు ప్రారంభమైన ప్రాంతం సబర్మతీ ఆశ్రమం ఆనీ!
44 వ వారం
[మార్చు]- ...హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగంగా ఉన్న ప్రసిద్ధ ఆలయం విరూపాక్ష దేవాలయం అనీ! (చిత్రంలో)
- ...సార్డీనియా లోని అసినారా నేషనల్ పార్క్ లో పర్యాటకులు గాడిదలతో ఫొటోలు తీసుకుంటారనీ!
- ... పెంగ్విన్ లు సముద్రపు నీరును కూడా తాగగలవనీ... ఉత్తర ధ్రువంలో అస్సలు ఉండవనీ!
- ... రాతి పైన వండే మొఘల్ కాలం నాటి విశేషమైన వంటకం పత్థర్ కా గోష్త్ అనీ!
- ...యిప్పటికి ప్రపంచంలో అత్యధిక వయస్కురాలు లియాండ్రా బెకెర్రా లుంబ్రెరాస్ అనీ!
45 వ వారం
[మార్చు]- ... యూరప్‌లోని అత్యంత ఎత్తయిన "ఎత్నా" అగ్నిపర్వతం సిసిలీ లో ఉన్నదనీ!
- ... ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉన్నదనీ! (పక్క చిత్రంలో)
- ... మగధ సామ్రాజ్యము యొక్క మొదటి రాజధానిగా రాజగిరి ఉండేదనీ!
- ... తమిళభాషలోని కంబ రామాయణం మొదట తెలుగు భాషలోకి అనువదించింది ఆదిపూడి సోమనాథరావు అనీ!
- ... కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకం పై పద్మాక్షి దేవాలయం లో ఉన్న గరుడ రూపాన్ని వినియోగించుకున్నారనీ!
46 వ వారం
[మార్చు]- ... పడవలనే పైకి లేపే వంతెన ఫాల్కిర్క్ చక్రము అనీ! (పక్కచిత్రంలో)
- ... యూరప్‌లో పర్యాటకులని ఆకర్షించే ఓ చిన్న దేశం మొనాకో అనీ!
- ... శ్రీరాముడు స్వయంగా లింగాన్ని స్థాపించి పూజించిన క్షేత్రం రంగారెడ్డి జిల్లా లోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనీ!
- ... నిజాం యొక్క అధికార నివాసం హైదరాబాదు లోని పురానీ హవేలీ అనీ!
- ... దక్షిణ హిందూ మహాసముద్రంలో యేర్పడిన తుఫాను హుద్‌హుద్ తుఫాను అనీ!
47 వ వారం
[మార్చు]- ... అంగారక వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఒక అంతరిక్ష ప్రోబ్ మావెన్ అనీ!(చిత్రంలో)
- ... 2014 నోబెల్ శాంతి బహుమతిని పొందిన భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి అనీ!
- ... చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన పారిశ్రామికవేత్త జాక్ మా అనీ!
- ... ప్రతిష్టాత్మక "ప్రపంచ ఆహార బహుమతి" అవార్డు పొందిన భారతీయ శాస్త్రవేత్త సంజయ రాజారాం అనీ!
- ... కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ ప్రి పురస్కారానికి ఎంపికైన తొలి ఆసియావాసి పామర్తి శంకర్ అనీ!
48 వ వారం
[మార్చు]- ...ఇరాక్ దేశంలో ఉన్న ఒక అద్భుత మసీదు గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా అనీ!(చిత్రంలో)
- ... ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క విశేష ఆవిష్కరణ డైనమైట్ అనీ!
- ...తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి అనీ!
- ...వాగ్గేయకారుడయిన అన్నమాచార్యుని దైవ సంకీర్తనల యొక్క సుప్రసిద్ధ గాయనీమణి శోభా రాజు అనీ!
- ...తోకచుక్కపై దిగిన తొలి ఫీలే ల్యాండర్ ను వదలిన వ్యోమనౌక రోసెట్టా అనీ!
49 వ వారం
[మార్చు]- ... బుద్ధుని జీవిత గాథలను ఒకే ఏనుగు దంతంపై అంతర్భాగాలతో చెక్కిన విశిష్ట కళాఖండం బుద్ధుని జీవిత గాథలు చెక్కబడ్డ ఏనుగు దంతపు కళాకృతి అనీ! (చిత్రంలో)
- ... దేశంలోనే తొలి వైఫై సౌకర్యం కలిగిన రైల్వేస్టేషన్ బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ అనీ!
- ... పశ్చిమ చాళుక్యులు నిర్మించిన విశేష ఆలయం శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం అనీ!
- ...తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు నందగిరి ఇందిరాదేవి అనీ!
- ...ఆంధ్ర ఉత్ప్రేక్ష చక్రవర్తి, అభినవ కాళిదాసు గా పేరొందిన ప్రముఖ కవి వానమామలై వరదాచార్యులు అనీ!
50 వ వారం
[మార్చు]- ... త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్టించినట్లు భావిస్తున్న ఆలయం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం అనీ!(చిత్రంలో)
- ...పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్పసంస్కృతి ప్రభల సంస్కృతి అనీ!
- ...భారతదేశంలోని హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రసిద్ధమైన ఏకశిలా విగ్రహం బుద్ధ విగ్రహం అనీ!
- ...నూటొక్క సొరంగాలు కలిగి రహస్యాలకు కేంద్రబిందువైన బిలం గుత్తికొండ బిళం అనీ!
- ... బోయి భీమన్న తన పద్దెనిమిదేండ్ల వయసులో రస దృష్టితో కంటే సంఘప్రయోజన దృష్టితో వ్రాసిన నాటకము రాగవాసిష్ఠం అనీ!
51 వ వారం
[మార్చు]- ...ముంబై నగర మందు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పొడవైన ఆకాశహర్మం నమస్తే టవర్ అనీ!
- ...విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనబడే మహొన్నత పదవి కోసం సత్రయాగం చేసిన ప్రదేశం సత్రశాల అనీ!
- ...అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై వ్రాయించి సంకీర్తనా భండాగారంలో భద్రపరపించినవాడు తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు అనీ!
- ...ఒక బాకీ విషయమై తనకు జరిగిన అన్యాయాన్ని సహించలేక ఈస్టిండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి మేకా నరసింహ అప్పారావు అనీ!
- ...ప్రతి ఎటా సుమారుగా 7000 మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న సేవాసంస్థ వనవాసి కల్యాణ ఆశ్రమం అనీ!
52 వ వారం
[మార్చు]- ...తోకచుక్కపై దిగిన తొలి ల్యాండర్ ఫీలే అనీ!
- ...ప్రపంచంలోనే అతిపెద్ద లీడ్ సంస్థ నుంచి గ్రీన్ హోటల్ సర్టిఫికెట్ అందుకున్న హోటల్ ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్ అనీ!
- ...భారతీయ సంప్రదాయిక వైద్యవిధానమైన ఆయుర్వేదంలో శుశృత సంహితతో కలిపి ప్రాచీనమైన గ్రంథాల్లో ఒకటి చరక సంహిత అనీ!
- ...చిన్ననాడే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్ళిన కథకుడు ఇరివెంటి కృష్ణమూర్తి అనీ!