Jump to content

త్రిలింగాలు

వికీపీడియా నుండి
శ్రీశైలం గోపురం
ద్రాక్షారామం దేవాలయం
దస్త్రం:Kaleswaram Temple.jpg
కాళేశ్వర దేవాలయ గోపురం

తెలుగునాట సుప్రసిద్ధి చెందిన మూడు శైవక్షేత్రాలకు త్రిలింగాలని పేరు. ఈ మూడు శైవక్షేత్రాలూ నెలకొన్న ప్రాంతాలే త్రిలింగ ప్రాంతాలని, అందుకే ఈ భాషకు త్రిలింగ అనే పదం ఏర్పడిందని భావిస్తూంటారు. త్రిలింగ అన్న పదం నుంచే తెలుగు అన్న పదం వచ్చిందని ఒక కాలంలో కొందరు పండితుల భావన.

త్రిలింగాలు

[మార్చు]
  1. శ్రీశైలం
  2. దాక్షారామం (దీనికి దక్షుడి పేరుమీద దాక్షారామమని పేరు వచ్చింది. కానీ కొంతమంది దీన్ని ద్రాక్షారామం అంటారు.)
  3. కాళేశ్వరం.

తెలుగు-త్రిలింగం

[మార్చు]

ఈ మూడు లింగాల మధ్య ఉన్న దేశం త్రిలింగదేశం అంటే తెలుగునాడు అనడం వాడుక. అప్పకవి, మరికొందరు ఈ మాటను వాడారు కానీ ప్రాచీనకావ్యాల్లో గానీ, సంస్కృతనిఘంటువుల్లో ఉండే యాభైఆరుదేశాల్లో గానీ త్రిలింగదేశమంటే తెలుగునాడు అనే అర్థం లేదని సిపి బ్రౌన్ తన తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులో పేర్కొన్నాడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇది కల్పిత నామం. త్రిలింగ అనే పదం నుంచి తెలుగు ఏర్పడిందనడం కేవలం గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజంలేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం మొదలుకొని పలు సారస్వత, చారిత్రికాధారాలు పరిశీలించి చెప్పారు.[1]

వ్యాకరణం

[మార్చు]
  • త్రి+లింగములు=మూడువిద లింగములు

మరో త్రిలింగాలు

[మార్చు]

మరికొందరి అభిప్రాయం ప్రకారం త్రిలింగాలని వీటిని కూడా అంటారు.

  1. తారకలింగము (ఆకాశమున)
  2. మహాలింగము (భూలోకమున)
  3. హటకేశ్వరలింగము(పాతాళలోకమున)

మూలాలు

[మార్చు]
  1. వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Archived from the original on 28 సెప్టెంబరు 2017. Retrieved 6 March 2015.