Jump to content

ద్విసప్తతి-కళలు

వికీపీడియా నుండి

(అ.)

  1. వివిధ లిపులను వ్రాయుట
  2. గణితము
  3. శిల్పము చిత్రము వస్త్రము బంగారము మొ|| వానితో ఆకృతులను నిర్మించుట
  4. నాట్యము
  5. గానము
  6. వాద్యములను వాయించుట
  7. సప్తస్వరములను తెలిసియుండుట
  8. పుష్కరమను చర్మవాద్యమును వాయించుట
  9. సమతాళమను వాద్యవిశేషము
  10. జూదము
  11. జనులతో సంభాషించు నేర్పు
  12. పాచికలతో నాడు ఒక యాట
  13. చదరములు గల పలకపై యాడుట
  14. పట్టణమును పాలించుట-అన్ని విషయములందును ముందుండుట
  15. మట్టిని నీటితో కలుపు నేర్పు
  16. వంటచేయుట మొదలగు నాహారవిధులు
  17. పానీయములు చేయుట మొదలగు విధులు
  18. విలేపనమునకు సంబంధించిన విధులు
  19. వస్త్రవిధులు
  20. శయనవిధులు
  21. ఆర్యాఛందస్సునకు చెందిన పద్యములు
  22. ప్రహేళికలు (పొడుపుకథలు)
  23. మాగధీభాషలోని పద్యములు
  24. గాథలు
  25. ప్రాకృత పద్యజాతి
  26. సంస్కృత పద్యములు
  27. వెండిని ఇతరములతో మిశ్రణము చేయుట
  28. బంగారమును ఇతరములతో మిశ్రణము చేయుట
  29. కరగించిన రాగిని బంగారముగా మార్చుటకై చూర్ణములను కలుపుట
  30. ఆభరణ విధులు
  31. తరుణులను అలంకరించు విధము
  32. స్త్రీ లక్షణములు
  33. పురుష లక్షణములు
  34. అశ్వ లక్షణములు
  35. ఆబోతుల లక్షణములు
  36. అశ్వలక్షణములు
  37. కుక్కుట లక్షణములు
  38. మేకల లక్షణములు
  39. ఛత్రలక్షణము
  40. దండ లక్షణము
  41. ఖడ్గలక్షణము
  42. మణిలక్షణములు
  43. భూషణ లక్షణములు
  44. గృహ నిర్మాణము
  45. శిబిరములను కొలుచుట
  46. నగరములను కొలుచుట
  47. వివిధాకృతులు గల సేనావ్యూహములను నిర్మించుట
  48. త్రివ్యూహా విధానము
  49. విషవిద్య
  50. ప్రతివిషవిద్య
  51. చక్రవ్యూహము
  52. గరుడవ్యూహము
  53. శకటవ్యూహము
  54. యుద్ధము
  55. నియుద్ధము
  56. శత్రువును మించి యుద్ధము చేయుట
  57. అస్థియుద్ధము
  58. ముష్టి యుద్ధము
  59. బాహుయుద్ధము
  60. లతాయుద్ధము
  61. బాణప్రయోగము
  62. ఖడ్గాఘాతము
  63. ధనుర్వేదము
  64. వెండిని కరగించుట మిశ్రణము చేయుట చూర్ణము చేయుట మొ||
  65. బంగారమును కరగించుట మిశ్రణము చేయుట చూర్ణము చేయు మొ||
  66. సూత్రక్రీడ
  67. వృత్తక్రీడ
  68. బాణములతో నాడుట-లేక తామర తూడులతో నాడు ఆట
  69. పత్రచ్ఛేద్యము
  70. కటకచ్ఛేధ్యము (బంగారము మొదలగువానితో కడియములు చేయుట)
  71. పుంజు గుఱ్ఱము మొ|| వానిని పణమొడ్డి ఆడు ఆటలు
  72. శకున విద్య

-[శ్రీవత్సనిఘంటువు]

(ఆ.)

  1. లేఖనము
  2. పఠనము
  3. గణితము
  4. గానము
  5. నర్తనము
  6. తాళమునకు దగిన వాద్యవిశేషము
  7. పటహము (చర్మవాద్య విశేషము)
  8. మృదంగము
  9. వీణ
  10. వేణువు
  11. భేరీపరీక్ష
  12. గజశిక్ష
  13. ఆశ్వశిక్ష
  14. ధాతువాదము
  15. దృగ్వాదము
  16. మంత్రశిక్ష
  17. శరీరమందలి వికృతత్వమును పోగొట్టుట
  18. పలితవినాశము
  19. రత్నలక్షణము
  20. నారీలక్షణము
  21. పురుషలక్షణము
  22. ఛందస్సు
  23. తర్కము
  24. సునీతి (నీతి రాజనీతి అర్థశాస్త్రము)
  25. తత్త్వము
  26. కవిత్వము
  27. జ్యోతిషము
  28. శ్రుతులు
  29. వైద్యము
  30. భాషలు
  31. యోగశాస్త్రము
  32. రసాయనశాస్త్రము
  33. అంజనవిద్య
  34. లిపి
  35. స్వప్నము
  36. ఇంద్రజాలము
  37. కృషి
  38. వాణిజ్యము
  39. నృపసేవనము
  40. శకునము
  41. వాయుసంసూచనము
  42. అగ్నిసంసూచనము
  43. దృష్టి
  44. లేపనము
  45. మర్దనము
  46. ఊర్ధ్వగతి
  47. ఘటబంధము
  48. ఘటభ్రమ
  49. పత్రచ్ఛేదనము
  50. పద్మభేదనము
  51. ఫలమును కోయుట
  52. జలస్థానమును తెలిసికొనుట
  53. వర్షాగమనమును తెలిసికొనుట
  54. లోకాచారము
  55. జనానువృత్తి
  56. ఫలభృత్తు (బంతి కట్టి పంటనూర్చి తీసకొనిపోవుట)
  57. ఖడ్గబంధనము
  58. క్షురీబంధనము
  59. ముద్రలు
  60. ఇనుముతో వస్తువులు చేయుట
  61. దంతములతో వస్తువులు చేయుట
  62. కట్టెతో వస్తువులు చేయుట
  63. చిత్రకర్మ
  64. బాహుయుద్ధము
  65. దృగ్యుద్ధము
  66. ముష్టియుద్ధము
  67. దండయుద్ధము
  68. ఖడ్గయుద్ధము
  69. వాగ్యుద్ధము
  70. గారుడదమనము
  71. సర్పదమనము
  72. భూతదమనము

-[శ్రీవత్సనిఘంటువు]

మూలాలు

[మార్చు]