ముర్కాంగ్స్లెక్ - రంగియా (ఎంజి) అరుణాచల్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముర్కాంగ్స్లెక్ - రంగియా (ఎంజి) అరుణాచల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ముర్కాంగ్స్లెక్ రైల్వే స్టేషను, రంగియా రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2] అరుణాచల్ అనేది సమీపంలోని రాష్ట్రం పేరు పెట్టి ఉన్నప్పటికీ దాని ప్రారంభం, ముగింపు రెండు అస్సాంలో ఉన్నాయి. దీని ప్రయాణ మార్గం సుమారు 508 కిలోమీటర్ల దూరం ఉంది.[3]

గేజ్ మార్పిడి[మార్చు]

రంగియా జంక్షన్ నుండి ముర్కాంగ్స్లెక్ వరకు ఉన్న మీటర్ గేజ్ రైల్వే ట్రాక్ 2011 సం.లో బ్రాడ్ గేజ్ మార్పిడి కోసం మూసివేశారు, మార్పిడి తర్వాత 2014 సం.లో తిరిగి ప్రారంభించాలని భావించారు.[4]

"ఉత్తర లఖింపూర్, ముర్కాంగ్స్లెక్ మధ్య 154 కిమీ.ల విస్తరణలో రంగియా -ముర్కాంగ్స్లెక్ గేజ్ మార్పిడి ప్రాజెక్టు చివరి దశలో ఉంది. ఉత్తర లఖింపూర్, ముర్కాంగ్స్లెక్ మధ్య 154 కిమీ. పొడవున 68 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు, రోడ్డు పైవంతెన (ఆర్‌ఒబి), నాలుగు రహదారి క్రిందవంతెన (ఆర్‌యుబి), 12 స్టేషన్లను కలిగి ఉంది. రంగియా జంక్షన్ నుండి ముర్కాంగ్స్లెక్ మధ్య మొత్తం విభాగంలో, 662 ప్రధాన వంతెనలు, 210 చిన్న వంతెనలు, పది రోడ్డు పైవంతెనలు (ఆర్‌ఒబి), ఎనిమిది క్రిందవంతెనలు (ఆర్‌యుబి), 39 స్టేషన్లు ఉన్నాయి. భారతీయ రైల్వేలు ముందుగా ప్రయాణీకుల సేవ కోసం రంగియా -రంగపార-హర్ముతి విభాగం, అలాగే రంగపార, డెకర్గాం మధ్య ఫింగర్ (వేలు) లైన్ ప్రారంభించింది. అదనంగా, ఈశాన్య సరిహద్దు రైల్వే (సి) కూడా బలిపార, భలుక్పాంగ్ (34.47 కిలోమీటర్లు) మధ్య ఫింగర్ (వేలు) లైన్ లో ఇంజన్ రోలింగ్ నిర్వహించారు. ఇందులోనే (ఫింగర్ లైన్ నందు) పది ప్రధాన వంతెనలు, 101 చిన్న వంతెనలు ఒక క్రిందవంతెన (ఆర్‌యుబి), ఒక 12 స్టేషను కలిగి ఉన్నాయి.[5][6]

జోను , డివిజను[మార్చు]

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 15813⇒15813X. ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది. ప్రస్తుతం ఈ రైలు సేవలు లేవు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]