ద్వాదశ జ్యోతిర్లింగాలు

వికీపీడియా నుండి
(జ్యోతిర్లింగాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శైవులు శివున్ని మూర్తి రూపంలో, లింగరూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైందిగా భావిస్తారు.ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు.... అవి...[1][2]

  1. రామనాథస్వామి లింగం - రామేశ్వరం
  2. శ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం) - శ్రీశైలం
  3. భీమశంకర లింగం - భీమా శంకరం
  4. ఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం - ఎల్లోరా గుహలు
  5. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)
  6. సోమనాథ లింగం - సోమనాథ్
  7. నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
  8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
  9. మహాకాళ లింగం - ఉజ్జయిని
  10. వైద్యనాథ జ్వోతిర్లింగం - చితా భూమి (దేవఘర్)
  11. విశ్వేశ్వర లింగం - వారణాశి
  12. కేదార్‌నాథ్‌ ఆలయం

జ్యోతిర్లింగ స్త్రోత్రం

[మార్చు]
ద్వాదశ జ్యోతిర్లింగాలు

ఈ జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకం.

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

జ్యోతిర్లింగాలు

[మార్చు]
త్రయంబకేశ్వర ఆలయం
  1. సోమనాథుడు - విరవల్ రేవు, ప్రభాస్ పటాన్, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్ - దీనిని ప్రభాస్ క్షేత్రం అంటారు. చంద్రునిచే ఈ లింగం ప్రతిష్ఠింపబడిందని స్థలపురాణం.[3]
  2. మల్లికార్జునుడు - శ్రీశైలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ - ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటి. ఆది శంకరాచార్యుడు శివానందలహరిని ఇక్కడే వ్రాశాడు. ఇక్కడ అమ్మవారు భ్రమరాంబాదేవి.
  3. మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్ - క్షిప్రానది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 84 సిద్ధ లింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి.
  4. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరం, మధ్య ప్రదేశ్ - నర్మద (రేవా) నదీతీరాన వెలసింది. ఇక్కడ ఒకే లింగం రెండు బాగాలుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతుంది. అమ్మవారు అన్నపూర్ణ.
  5. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవఘర్, బీహార్ - బ్రహ్మ, వేణు, సరస్వతీ నదుల సమీపంలో ఉంది. సహ్యాద్రి కొండల అంచునుంది. అమృతమధనానంతరం ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచిరనీ, సృశించిన భక్తులకు అమృతం లభించుననీ నమ్మకం.
  6. భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనే వద్ద, మహారాష్ట్ర - చంద్రభాగ (భీమ) నది ఒడ్డున, భీమశంకర పర్వతాలవద్ద - త్రిపురాపుర సంహారానంతరం మహాశివుడు విశ్రాంతి తీసికొన్న చోటు. అమ్మవారు కమలజాదేవి. శాకిని, ఢాకిని మందిరములు కూడా యున్నవి. మోక్ష కుండము, జ్ఙాన కుండం ఉన్నాయి.
  7. రామేశ్వరుడు - రామేశ్వరం, తమిళనాడు - శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలం - కాశీ గంగా జలాన్ని రామేశ్వరంనకు తెచ్చి అర్చించిన తరువాత, మరల రామేశ్వరములోని ఇసుకను కాశీలో కలుపుట సంప్రదాయం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి.
  8. నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనం) ద్వారక వద్ద, మహారాష్ట్ర - ఈ జ్యోతిర్లింగము ద్వారక, ఔధ్ గ్రామ్, ఆల్మోరా (ఉత్తరప్రదేశ్) అను మూడు స్థానములలో ఉన్నట్లు చెబుతారు.
  9. విశ్వనాథుడు - వారణాసి, ఉత్తర ప్రదేశ్ - కాశీ అని కూడా ప్రసిద్ధం - వరుణ, అసి నదులు గంగానదిలో కలిసే స్థానం - పరమపావన తీర్థం - ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి.
  10. త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర - గౌతమీ తీరాన - ఇక్కడి లింగం చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న (బొటనవేలివంటి) లింగాలున్నవి. అమ్మవారు కొల్హాంబిక. గంగాదేవి మందిరం ఉంది. కుశావర్త తీర్థం, గంగాధార తీర్థం, వరాహ తీర్థం ముఖ్యమైనవి. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థపర్వం పెద్ద పండుగ.
  11. కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో- మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనానికి తెరచి ఉంటుంది.
  12. ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర - (దేవగిరి లోనిదే జ్యోతిర్లింగమని కూడా చెప్పుదురు)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు విశేషాలు." web.archive.org. 2023-01-21. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "12 Jyotirlinga". Hindu Janajagruti Samiti. Retrieved 2023-01-21.
  3. "Shree Somnath Trust :: Jay Somnath". web.archive.org. 2011-10-30. Archived from the original on 2011-10-30. Retrieved 2023-01-21. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వనరులు

[మార్చు]