Coordinates: 16°42′N 81°06′E / 16.7°N 81.1°E / 16.7; 81.1

పశ్చిమ గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: పట్టణము → పట్టణం
పంక్తి 79: పంక్తి 79:
| footnotes =
| footnotes =
}}
}}
'''పశ్చిమ గోదావరి జిల్లా''', [[భారత దేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని [[ఏలూరు]] కృష్ణాజిల్లా రాజధాని [[విజయవాడ]]కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ [[తూర్పు గోదావరి]] జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు పశ్చిమాన [[కృష్ణా జిల్లా]], దక్షిణాన కృష్ణా జిల్లా, [[బంగాళాఖాతం]], ఉత్తరాన [[తెలంగాణా]] రాష్ట్రానికి చెందిన [[ఖమ్మం]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. [[తాడేపల్లిగూడెం]], జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణము. ఈ జిల్లాలో 52% అక్షరాస్యత ఉంది. [[తణుకు]] పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం. [[భీమవరం]] వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో [[పాలకొల్లు]] మరొక ముఖ్య నగరంగా వెలుగొందింది.{{maplink|type=shape}}
'''పశ్చిమ గోదావరి జిల్లా''', [[భారత దేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని [[ఏలూరు]] కృష్ణాజిల్లా రాజధాని [[విజయవాడ]]కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ [[తూర్పు గోదావరి]] జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు పశ్చిమాన [[కృష్ణా జిల్లా]], దక్షిణాన కృష్ణా జిల్లా, [[బంగాళాఖాతం]], ఉత్తరాన [[తెలంగాణా]] రాష్ట్రానికి చెందిన [[ఖమ్మం]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. [[తాడేపల్లిగూడెం]], జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఈ జిల్లాలో 52% అక్షరాస్యత ఉంది. [[తణుకు]] పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం. [[భీమవరం]] వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో [[పాలకొల్లు]] మరొక ముఖ్య నగరంగా వెలుగొందింది.{{maplink|type=shape}}
== జిల్లా చరిత్ర ==
== జిల్లా చరిత్ర ==
[[దస్త్రం:Guntupalli Buddist site 4.JPG|right|thumb|225px|గుంటుపల్లిలోని బౌద్ధారామం గుహలు]]
[[దస్త్రం:Guntupalli Buddist site 4.JPG|right|thumb|225px|గుంటుపల్లిలోని బౌద్ధారామం గుహలు]]
పంక్తి 497: పంక్తి 497:
* న్యాయశాస్త్ర కళాశాలలు - 2 (ఏలూరు, భీమవరం)
* న్యాయశాస్త్ర కళాశాలలు - 2 (ఏలూరు, భీమవరం)
* NIT-1(TADEPALLIGUDEM)
* NIT-1(TADEPALLIGUDEM)
*Dr.YSR HORTICULTURE University(TADEPALLIGUDEM)
*Dr.YSR HORTICULTURE University(TADEPALLIGUDEM)


=== ప్రముఖ విద్యా సంస్థలు ===
=== ప్రముఖ విద్యా సంస్థలు ===

13:22, 9 డిసెంబరు 2020 నాటి కూర్పు

పశ్చిమ గోదావరి జిల్లా
.
.
CountryIndia
Stateఆంధ్ర ప్రదేశ్
Regionకోస్తా
Headquarterఏలూరు
Area
 • Total7,742 (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ పూర్వము) km2 (Formatting error: invalid input when rounding sq mi)
Population
 (2011)
 • Total39,34,782
 • Density508/km2 (1,320/sq mi)
Languages
 • Officialతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Telephone code+91 0( )
Literacy73.95(2001)
Literacy Male78.43
Literacy Female69.45

పశ్చిమ గోదావరి జిల్లా, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా రాజధాని ఏలూరు కృష్ణాజిల్లా రాజధాని విజయవాడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. జిల్లాకు పశ్చిమాన కృష్ణా జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లా, బంగాళాఖాతం, ఉత్తరాన తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, జిల్లాలోని ఒక అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఈ జిల్లాలో 52% అక్షరాస్యత ఉంది. తణుకు పారిశ్రామికంగా వృద్ధి పొందుతున్న గ్రామం. భీమవరం వ్యాపారాత్మకంగా వృద్ధిపొందుతున్న నగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మరొక ముఖ్య నగరంగా వెలుగొందింది.Map

జిల్లా చరిత్ర

గుంటుపల్లిలోని బౌద్ధారామం గుహలు

బౌద్ధుల కాలంనుండి ఇక్కడి చరిత్రకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లిలలో ఉన్న బౌద్ధారామాలు క్రీ.పూ 200 నుండి క్రీ.శ. 300 మధ్యకాలానికి సంబంధించినవి. బుద్ధుని ప్రతిమలేవీ లేకపోవడం వలన ఇవి ముఖ్యంగా 'హీనయానం' (బౌద్ధం ఆరంభ సమయం) కాలానికి చెందినవని అనిపిస్తున్నది. భీమవరం దగ్గర పెదమిరం గ్రామంలోను, పెనుమంచిలి, ఆచంట లలోనూ జైన తీర్ధంకరుల మందిరాలున్నాయి.[1]

ప్రస్తుతం పశ్చిమ గోదావరిగా పిలువబడే ప్రాంతం చారిత్రికంగా నందుల సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తరువాత మిగిలిన దక్షిణ దేశంలాగానే (క్రీ.శ. 1 నుండి 3వ శతాబ్దం వరకు) ఇది కూడా శాతవాహనుల యేలుబడిలోకి వచ్చింది. క్రీ.శ.350 ప్రాంతంలో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తాడు. తరువాత మహారాజు శక్తి వర్మతో ఆరంభమైన మఠరకుల వంశం వారు క్రీ.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం (పిష్టపురం) కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. వీరిలో విక్రమేంద్ర వర్మ ముఖ్యమైనవాడు. విక్రమేంద్ర వర్మ ప్రతినిధిగా రణ దుర్జయుడు పిఠాపురం నుండి పాలన చేశాడు. ఇంద్ర భట్టారకుడనే విష్ణు కుండిన రాజును జయించి, కళింగ గంగులు వారి రాజ్యంలో చాలా భాగాన్ని ఆక్రమించారు. 3వ మాధవ వర్మ విష్ణు కుండినులలో చివరి రాజు.

తరువాత బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల (పశ్చిమ చాళుక్యులు) వంశానికి చెందిన 2వ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువు పిఠాపురాన్ని జయించి ఇక్కడ చాళుక్యుల పాలనకు నాంది పలికాడు. కుబ్జ విష్ణునితో తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగి|ఏలూరుకి, తరువాత రాజమహేంద్ర వరం|రాజమండ్రికి మార్చబడింది. క్రీ.శ. 892-921 మధ్య రాజైన 1వ చాళుక్య భీముడు ద్రాక్షారామ శివాలయాన్ని నిర్మించాడు.కాకతీయ వంశ జ రాణి రుద్రమదేవి నిర్వర్జ్యపురము అనబడే ఈనాటి నిడదవోలును రాజధానిగా పాలించిన చాళిక్యుల ఇంటి కోడలు. తరువాత వివిధ రాజుల రాజ్యాలు సాగాయి.

బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[2]

భౌగోళిక స్వరూపం

పశ్చిమ గోదావరి జిల్లా కలవలపల్లి వద్ద సూర్యాస్తమయం

భౌగోళికంగా ఈ జిల్లా 16 - 15' నుండి 17-30' ఉత్తర అక్షాంశాల మధ్య, 80-55' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. గోదావరి నది డెల్టాలో కొంత భాగం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మొత్తం జిల్లా వైశాల్యం 7,780 చ.కి.మీ. (19,26,277 ఎకరాలు). జిల్లాలో సగటు వర్షపాతం 1076.20 మిల్లీమీటర్లు. [3]. నైసర్గికంగా జిల్లాను మూడు సహజ ప్రాంతాలుగా విభజించవచ్చును -

డెల్టా ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదుల కాలవలు ప్రధానమైన నీటి వనరులు. పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు ఈ జిల్లాలోనే ఉంది. మెరక భూములలో ఇటీవల విస్తారంగా కరంటు బావుల ద్వారా వ్యవసాయం జరుగుతున్నది. ఏజన్సీ ప్రాంతంలోనూ, మెరక ప్రాంతంలోనూ చిన్న, పెద్ద సాగునీటి ప్రాజెక్టులు నీటిని అందిస్తున్నాయి.

జిల్లాలో అటవీ ప్రాంతం 81,200 హెక్టేరులు - మొత్తం వైశాల్యంలో సుమారు 10.5%. సాగు అవుతున్న భూమిలో అధిక భాగం వరి పంట (82.8%), తరువాత పుగాకు (4.9%), చెరకు (4.7%), మిర్చి (1.3%)[4].

ఆర్ధిక స్థితి గతులు

వ్యవసాయం

ధాన్యమును తూర్పారబోస్తున్న రైతు
పంట నూర్పిడి కోసం సిద్దముగా ఉన్న ట్రాక్టరులు

జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం పైనా, వ్యవసాయాధారిత సేవలు, పరిశ్రమలపైనా ఆధారపడి ఉంది. పనిచేసే వారిలో దాదాపు 78% జనాభా వ్యవసాయాధారితమైన వృత్తులే సాగిస్తున్నారు. వరి, చెరకు, పుగాకు, కొబ్బరి, మామిడి, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వేరుశనగ, అపరాలు, ప్రొద్దు తిరుగుడు పూలు - ఇవి ఈ జిల్లాలో ప్రధానమైన పంటలు. జిల్లాలోని వివిధ పంటల విస్తీర్ణం క్రింద ఇవ్వబడింది[5].

రంగాపురం గ్రామం వద్ద పాడిపశువులు
పశ్చిమ గోదావరి జిల్లాలో పంటలు
పంట విస్తీర్ణం

హెక్టేరులు

ఉత్పత్తి

మెట్రిక్ టన్నులు

వరి 219.6 వేల హె. 1,413,108
మొక్కజొన్న 11.5 వేల హె. 39,557
కంది 0.28 వేల హె. 191
మినుము 9.54 వేల హె. 3,885
పెసర 2.79 వేల హె. 1,130
వేరుశనగ 3.21 వేల హె. 6,476
చెరకు 32.22 వేల హె. 2,900,000
పుగాకు 5.76 వేల హె. 12,685
మామిడి 20,483 హె. 1,22,898
నిమ్మ 1,449 హె. 11,592
బత్తాయి 183 హె. 1,464
అరటి 5,021 హె. 3,26,365
జామ 657 హె. 13,140
సపోటా 568 హె. 4,544
జీడిమామిడి 44,744 హె. 22,372
పసుపు 530 హె. 1,855
మిరప 2,703 హె. 5,406
తమలపాకు 175 హె. 700
కొబ్బరి 22,183 హె. 3,327లక్షలు
పామాయిల్ 10,250 హె. 61,500
కోకో 2,800 హె. 1,400
పోక చెక్క 125 హె. 125
కాఫీ 50 హె. 25
మిరియం 150 హె. 45

ఈ పంటలలో వరి, చెరకు సాగు ప్రధానంగా డెల్టా ప్రాంతంలో సాగుతుంది. అపరాలు ఎక్కువగా డెల్టా ప్రాంతంలో అంతర పంటగా పండిస్తారు. మొక్కజొన్న, పుగాకు, కొబ్బరి వంటివి మెరక ప్రాంతంలోనూ, పల్లపు ప్రాంతంలోనూ కూడా పండుతాయి. జీడిమామిడి, మామిడి, నిమ్మ, ఆయిల్ పామ్ వంటి తోటల వ్యవసాయం అధికంగా మెరక ప్రాంతంలో జరుగుతుంది.

జిల్లాలోని డెల్టా ప్రాంతలో సారవంతమైన నల్లరేగడి నేల ఉంది. కొద్దిభాగం పాటి నేల. ఎక్కువ భాగం ఎర్ర చెక్కు నేల, ఇసుక నేల కలిసి ఉంది. మొత్తం జిల్లాలోని 7.7 లక్షల హెక్టేరుల వైశాల్యంలో సుమారు 5.5 లక్షల హెక్టేరులు వ్యవసాయానికి అనుకూలమైన భూమి. 0.8 లక్షల హెక్టేరులు అడవి ప్రాంతము. 0.45 లక్షల హెక్టేరులు బీడు భూములు. 0.94 హెక్టేరులు ఇతర ఉపయోగాలకు వాడుతున్నారు. 1996-97లో మొత్తం 6 లక్షల హెక్టేరులలో వ్యవసాయం జరిగింది[3].

వ్యవసాయానికి అనుబంధంగా సాగే పశుపాలన కూడా జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యభాగం వహిస్తున్నది. జిల్లాలో 2.5 లక్షల ఆవులు, 4.2 లక్షల గేదెలు, 75వేల గొర్రలు, లక్ష మేకలు, 30 వేల పందులు, 84 లక్షల కోళ్ళు పెంచబడుతున్నాయని అంచనా.[3]

నీటి వనరులు

నిడదవోలు-నరసాపురం కాలువ.

జిల్లాలో సరాసరి సంవత్సర వర్షపాతం 1076.2 మి.మీ. ఇందులో సుమారు 64% వర్షపాతం నైరుతి ఋతుపవనాల సమయంలో (జూన్-సెప్టెంబరు కాలం) ఉంటుంది.

జిల్లాకు తూర్పు హద్దుగా ఉన్న గోదావరి నది విజ్జేశ్వరం వద్ద గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి అనే రెండు పాయలుగా చీలుతుంది. అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎర్రకాలువ, తమ్మిలేరు, బైనేరు, కొవ్వాడ కాలువ, జల్లేరు, గుండేరు ఇతర ప్రవాహ నీటి వనరులు. జిల్లాలో దాదాపు 20.2% నేల గోదావరి నది పరీవాహక ప్రాంతంలోనూ, 48.1 % యెర్రకాలువ పరీవాహక ప్రాంతంలోను, 26.8% తమ్మిలేరు ప్రాంతంలోను, 1.4% రామిలేరు ప్రాంతంలోను, 3.5% లోయేరు ప్రాంతంలోను ఉంది.[3].

245 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి, దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు కృష్ణా, గోదావరి నదుల మధ్యప్రాంతలో ఏర్పడిన పల్లపు జలాశయం. ఈ రెండు నదుల మధ్యలోను సహజంగా వరద నీటిని బాలన్స్ చేసే సరస్సుగా ఉపయోగ పడుతుంది. బుడమేరు, తమ్మిలేరు అనే రెండు పెద్ద యేరులతోబాటు సుమారు 30 చిన్న, పెద్ద కాలువలు కొల్లేరులో కలుస్తాయి. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఎన్నో ప్రత్యేకమైన వృక్ష, పక్షిజాతులకు ఇది ఆలవాలమైంది. ఇటీవలి కాలంలో ఇక్కడ చేపల పెంపకం పెద్దయెత్తున ఆర్థిక, సామాజిక మార్పులను తెచ్చింది. అక్రమంగా కొల్లేరు భాగాలను వ్యవసాయానికి, ఆక్వా కల్చర్‌కు ఆక్రమించుకోవడం వలన కొల్లేరు మనుగడకే ప్రమాదం ఏర్పడింది[6].

జిల్లాలో వ్యవసాయానికి నీరందించేవాటిలో మూడు వ్యవస్థలు ఉన్నవి:

  • గోదావరి డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (సర్ అర్ధర్ కాటన్ బారేజి ద్వారా - 2,10,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.)
  • కృష్ణా డెల్టా నీటిపారుదల వ్యవస్థ. (ప్రకాశం బారేజి ద్వారా - 23,000 హెక్టేరుల వరకు అవకాశం ఉంది.)

ఇవి కాక తమ్మిలేరు రిజర్వాయరు ద్వారా 3,700 హెక్టేరులు, జల్లేరు రిజర్వాయరు ద్వారా 1,700 హేక్టేరులు సాగుకు అవకాశం ఉంది.[7]

మెరక ప్రాంతంలో పెద్దయెత్తున గొట్టపు బావులద్వారా సాగునీరు వినియోగం జరుగుతున్నది.

పోలవరం ప్రాజెక్టు

పరిశ్రమలు

పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెందిందనడానికి ఆస్కారం లేదు. అందువలన ఉద్యోగావకాశాలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చును. ప్రధానంగా వ్యవసాయాధారితమైన ఈ జిల్లాలో ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు కూడా వ్యవసాయాధారితమైనవే.

జిల్లాలో ఏలూరు, భీమవరం, తణుకు, పాలకొల్లులలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. మొత్తం జిల్లాలో పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఇలా ఉన్నాయి[5]:

  • లో టెన్షన్ (తక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 7125
  • హై టెన్షన్ (ఎక్కువ వోల్టేజి) పారిశ్రామిక కనెక్షన్లు: 118
  • కుటీర పరిశ్రమ పారిశ్రామిక కనెక్షన్లు: 251
  • జిల్లాలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు: 13,541
  • పరిశ్రమలకు విద్యుత్తునిచ్చే ప్రధాన విద్యుత్ సరఫరా లైనులు, హై వోల్టేజీ సబ్‌స్టేషన్లు ఉన్న స్థలాలు: నిడదవోలు, కొవ్వూరు, తణుకు, భీమవరం, దూబచర్ల, తాడిమళ్ళ, చాగల్లు, తాడేపల్లి గూడే, పాలకొల్లు, ఏలూరు.

మొత్తం జిల్లాలో 52 పెద్ద, మధ్య తరగతి పరిశ్రమలున్నాయి. వీటిలో సుమారు 17వేల మందికి ఉపాధి లభిస్తున్నది. జిల్లాలోని ముఖ్య పరిశ్రమలు:

  • పూర్ణిమ కెమికల్ ఇండస్ట్రీస్ -ఏలూరు
  • అంబికా దర్బార్ బత్తి - ఏలూరు
  • ఆంధ్రా షుగర్స్ - తణుకు
  • గౌతమి సాల్వెంట్స్ - తణుకు
  • ఫుడ్స్, ఫాట్స్ & ఫెర్టిలైజర్స్ - తాడేపల్లిగూడెం
  • శ్రీ గురువాయురప్పన్ రైస్ బ్రాన్ ఆయిల్, గణపవరం
  • పశ్చిమ గోదావరి సహకార చక్కెర ఫాక్టరీ - సూరప్పగూడెం
  • ఆంధ్రా షుగర్స్ (ఆల్కహాలు విభాగం) - కొవ్వూరు
  • సహకార చక్కెర ఫాక్టరీ, పాలకొల్లు
  • విజయదుర్గా ఆగ్రో ఆయిల్స్ & స్ట్రా బోర్డు - తణుకు
  • వి.వి.ఎస్.షుగర్స్, చాగల్లు
  • పద్మజా ఎడిబుల్ రైస్ సాల్వెంట్ ఆయిలగ, ఉండి
  • రీజెంట్ ఆగ్రో ప్రొడక్ట్స్ - దేవరపల్లి
  • ఆంధ్రా షుగర్స్ - తాడ్వాయి
  • గోద్రెజ్ ఆగ్రోవెట్ - ద్వారకా తిరుమల
  • సహకార పామ్ ఆయిల్ - పెదవేగి
  • గవర్నమెంట్ డిస్టిలరీ - చాగల్లు
  • శ్రీ ఇంద్ర డిస్టిలరీ - తణుకు
  • సదర్న్ పెస్టిసైడ్స్ - కొవ్వూరు
  • శ్రీ రామా డిస్టిలర్స్ - జంగారెడ్డి గూడెం
  • కృష్ణా ఇండస్ట్రియల్ కార్బన్ - జంగారెడ్డిగూడెం
  • కృష్ణా ఇండస్ట్రియల్ సల్ఫ్యూరిక్ ఆసిడ్ - నిడదవోలు
  • డాక్టర్స్ ఆర్గానిక్ - తణుకు
  • శుభోదయ కెమికల్స్ - గౌరీ పట్నం (దేవరపల్లి)
  • ఆంధ్రా షుగర్స్ (కాస్టిక్ సోడా) - గోపాలపురం
  • డెల్టా పేపర్ మిల్స్ - వెండ్ర
  • కోస్టల్ కెమికల్స్ - నిడదవోలు
  • రోలెక్స్ పేపర్స్ - పాలకొల్లు
  • కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ - ఉండ్రాజవరం
  • శ్రీ సత్యనారాయణ కాటన్ యార్న్ - తణుకు
  • శ్రీ అనంతలక్ష్మీ కాటన్ యార్న్ - ఉండ్రాజవరం
  • శ్రీ అక్కమాంబా టెక్స్టైల్స్ - తణుకు
  • శ్రీ రామభద్ర స్పిన్నర్స్ - తణుకు
  • శ్రీ వెంకటరాయ కాటన్ యార్న్ - తణుకు
  • ఈస్ట్ ఇండియా కమర్షియల్ (జూట్ మిల్లు) - ఏలూరు
  • కృష్ణా హెస్సియన్ - ఏలూరు
  • సదరన్ మెగ్నీషియం మెటల్ - దేవరపల్లి
  • కళ్యాణి ఫ్లోరైడ్ - నిడదవోలు
  • ఎన్.సి.ఎల్. ఇండస్ట్రీస్ - దొమ్మేరు (నిడదవోలు)
  • త్రివేణి గ్లాస్ వర్క్స్ - కొవ్వూరు
  • దేవి సీ ఫుడ్స్ - పెరవలి
  • అవంతి ఫీడ్స్ - కొవ్వూరు
  • శ్రీ వీరభద్రా మెటల్ ఇండస్ట్రీస్ - అజ్జరం
  • రీఫ్రెష్ వాటర్ ప్లాంట్ - జంగారెడ్డిగూడెం

ఇవి కాక జిల్లాలో ఈ క్రింది కుటీర పరిశ్రమలు చిన్నపరిశ్రమలు కొన్ని పట్టణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి.

  • తివాచీ పరిశ్రమలు - ఏలూరు
  • ఇత్తడి పనిముట్లు - అజ్జరం, పెరవలి
  • లేసులు - నరసాపురం
  • స్టోన్ క్రషింగ్ యూనిట్లు - దేవరపల్లి
  • పీచు పరిశ్రమలు - నిడదవోలు

నీలి విప్లవం

ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భావం నాటికి పశ్చిమగోదావరి జిల్లాలో చేపల సాగుకు ప్రత్యేకమైన పద్ధతులంటూ ఏమీ లేవు. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో విస్తరించిన గోదావరి, దక్షిణం వైపున 19.5 కిలోమీటర్ల మేర సముద్రం కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో లభించే చేపలతోనే మత్స్యకారులు వ్యాపారం జరిపేవారు. చేపల అధికోత్పత్తి, వాణిజ్య రంగ విస్తరణకు ఎటువంటి పద్ధతులు అప్పట్లో లేవు. 1961 నాటికి జిల్లాలో తొమ్మిది మార్కెట్లే ఉండేవి. నాడు 460 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1969-70 మధ్య రూ. 10.25 లక్షల విలువైన 471 టన్నుల చేపలు, రూ. 1.61 లక్షల విలువ చేసే 73 టన్నుల రొయ్య అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే మత్స్యపరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల కోసం 42 ఫిషర్‌మేన్ కోఆపరేటివ్ సొసైటీలు 5805 మంది సభ్యులతో ఏర్పడ్డాయి. 1981 నాటికి ఆ సంఖ్య 61 సొసైటీలకు పెరిగింది. 1960లో బాదంపూడిలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడంతో జిల్లాలో చేపల పెంపకం చెరువుల్లో మొదలైంది. ఇందుకోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో భీమవరం సమీపంలోని పెదఅమిరం, నరసాపురం, కొవ్వలి, తణుకు, ఏలూరు, కొవ్వూరు తదితర చోట్ల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వెలిశాయి.

80వ దశకం నుంచి విప్లవాత్మక మార్పులు
ఏలూరులో ఒక వాణిజ్య ప్రాంతం

శాస్త్రీయ పద్ధతుల్లో వాణిజ్య వ్యాపారంగా చేపల పెంపకం 1980 నుంచి ప్రారంభమైంది. తొలుత జిల్లాలో ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు పంట ప్రాంతాలుగా చేపల పెంపకం విస్తరించింది. ప్రారంభంలో 20 వేల ఎకరాల్లో మొదలైన ఈ సాగు 1985-86 ప్రాంతంలో వరి పంట నష్టాలకు గురవుతుండటంతో ఒకేసారి మరో 10 వేల ఎకరాలకు విస్తరించింది. భీమవరం, నిడమర్రు, గణపవరం, కాళ్ళ, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురంలలో చేపల చెరువులు బాగా విస్తరించాయి. ప్రధానంగా భీమవరం ప్రాంతంలో చేపల పరిశ్రమ అభివృద్ధి కోసం ఆనంద గ్రూపు-అమాల్‌గమ్ ఫిషరీస్ సంయుక్తంగా 1988లో కొత్త పద్ధతులను, ఫిష్ ప్యాకింగ్ గ్రేడింగ్ విధానాలను ప్రారంభించాయి. అప్పటి వరకు ఒక మోస్తరుగా రైళ్ళ ద్వారా చేపల ఎగుమతులు జరిగేవి. తదుపరి ప్యాకింగ్‌తో ట్రేడింగ్ విధానం ప్రారంభం కావడంతో భీమవరం చేపల ఉత్పత్తుల పెంపకానికి ప్రధాన కేంద్రంగా మారింది. అస్సాం, ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు చేపల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో 500 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి.

1985 నాటికిఉప్పునీటి చేపల ఉత్పత్తి 4 వేల టన్నులు, మంచినీటి చేపల ఉత్పత్తి 10546 టన్నులకు పెరిగింది.1990 నాటికి జిల్లాలో ఏలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, తణుకు, పడాల, కొవ్వలి ప్రాంతాలలో 200 టన్నుల ఐస్‌ను ఉత్పత్తి చేసే 24 ఫ్యాక్టరీల ఉత్పత్తిని పెంచుతూ నెలకొల్పారు. 1990 ప్రాంతంలో మరో 50వేల ఎకరాలు చేపల చెరువులుగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మరలాయి.

తాజా పరిణామాలు

రెండున్నర దశాబ్దాలలో 20 వేల ఎకరాల నుంచి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెరిగాయి. 1990 నాటికి ప్రభుత్వం ప్రైవేటు రంగాలలో 7054 చెరువులు ఉండగా 20 వేలకు పెరిగినట్లు అంచనా. ఒక్క గణపవరం, నిడమర్రు, ఆకివీడు మండలాలలో గతంలో 35 లారీల చేపలు కలకత్తా మార్కెట్‌కు రోజూ వెళ్ళేవి. ప్రస్తుతం రోజుకి 1250 లారీల్లో చేపలు ఎగుమతి అవుతున్నాయి.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

జిల్లాలో 48 మండలాలున్నాయి. (OSM గతిశీల పటము)

రెవిన్యూ డివిజన్లు
పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు
పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

1 జీలుగుమిల్లి మండలం

2 బుట్టాయగూడెం మండలం

3 పోలవరం మండలం

4 తాళ్ళపూడి మండలం

5 గోపాలపురం మండలం

6 కొయ్యలగూడెం మండలం

7 జంగారెడ్డిగూడెం మండలం

8 టి.నరసాపురం మండలం

9 చింతలపూడి

10 లింగపాలెం మండలం

11 కామవరపుకోట మండలం

12 ద్వారకా తిరుమల మండలం

13 నల్లజర్ల మండలం

14 దేవరపల్లి

15 చాగల్లు మండలం

16 కొవ్వూరు మండలం

17 నిడదవోలు మండలం

18 తాడేపల్లిగూడెం మండలం

19 ఉంగుటూరు మండలం

20 భీమడోలు మండలం

21 పెదవేగి మండలం

22 పెదపాడు మండలం

23 ఏలూరు మండలం

24 దెందులూరు మండలం

25 నిడమర్రు మండలం

26 గణపవరం

27 పెంటపాడు మండలం

28 తణుకు మండలం

29 ఉండ్రాజవరం మండలం

30 పెరవలి మండలం

31 ఇరగవరం మండలం

32 అత్తిలి మండలం

33 ఉండి మండలం

34 ఆకివీడు మండలం

35 కాళ్ళ మండలం

36 భీమవరం మండలం

37 పాలకోడేరు మండలం

38 వీరవాసరము మండలం

39 పెనుమంట్ర మండలం

40 పెనుగొండ

41 ఆచంట మండలం

42 పోడూరు మండలం

43 పాలకొల్లు మండలం

44 యలమంచిలి మండలం

45 నరసాపురం మండలం

46 మొగల్తూరు మండలం

47 కుక్కునూరు మండలం[8]

48 వేలేరుపాడు మండలం[8]

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఈ జిల్లాలో కలిసినవి.

రవాణా వ్వవస్థ

ఏలూరు రైలు సముదాయం ముఖద్వారం
పశ్చిమగోదావరిజిల్లాలో ఒక రహదారి
నర్సాపురం-నిడదవోలు ప్రధాన రహదారి, కాలువ.
పిప్పర గ్రామం వద్ద రహదారి

5వ నెంబరు జాతీయ రహదారి పశ్చిమ గోదావరి జిల్లా గుండా వెళుతుంది. జిల్లాలో రోడ్ల వివరాలు [5]:

  • మొత్తం రోడ్ల పొడవు: 5,194 కి.మీ. అందులో
    • జాతీయ రహదారి: 108 కి.మీ.
    • రాష్ట్రం రహదారులు: 281 కి.మీ.
    • జిల్లా స్థాయి రోడ్లు: 1308 కి.మీ.

మద్రాసు-కొలకత్తా రైలు మార్గం ఈ జిల్లాగుండా వెళుతుంది. ట్రంకు రైలు మార్గం పొడవు 90 కి.మీ. బ్రాంచి లైను పొడవు 75 కి.మీ. (గుడివాడ-భీమవరం-నిడదవోలు/నరసాపురం) జిల్లాలో ముఖ్యమైన రైల్వే స్టేషన్లు: ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు (జంక్షన్), భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, కొవ్వూరు, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, భీమడోలు

జిల్లాలో కాలువల ద్వారా ప్రయాణం, సరకుల రవాణా పెద్దగా జరగడం లేదు. గోదావరి డెల్టాలో కొంత వినియోగం జరుగుతున్నది.

జిల్లాలో తాడేపల్లిగూడెంలో విమనాశ్రయం ఉన్నప్పటికీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. ఇటీవల కాలంలో ఈ విమానాశ్రయం వినియోగంలోకి తీసుకురావలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గన్నవరం (విజయవాడ), మధురపూడి (రాజమండ్రి) విమానాశ్రయాలు ప్రస్తుతం జిల్లావాసులకు అందుబాటులో ఉన్నాయి.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలాగానే ప్రయాణికుల నిత్యావసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారి బస్సు సర్వీసులే ప్రధాన ప్రయాణ సాధనాలు. కొంత వరకు హైదరాబాదు, విశాఖపట్నం నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. పట్టణ పరిసర గ్రామాలలో ఆటోల వినియోగం ఇటీవల బాగా పెరిగింది.

జనాభా లెక్కలు

పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం జనాభా 37.96 లక్షలు. ఇందులో 30.48 లక్షలు గ్రామీణ ప్రాంతాలలోను, 7.45 లక్షలు పట్టణ ప్రాంతాలలోను నివసిస్తున్నారు. జిల్లా వైశాల్యం 7742 చ.కి.మీ. కనుక జనసాంద్రత చ.కి.మీ.కు 490[9]. జనాభాలో 70% పైగా జనులు వ్యవసాయ సంబంధితమైన ఉపాధిపై జీవిస్తున్నారు.

ఇతర ప్రధాన జన విస్తరణాంశాలు (2001 జనాభా లెక్కలననుసరించి)
  • జనాభా: 37.96 లక్షలు (పురుషులు 19.06 లక్షలు, స్త్రీలు 18.9 లక్షలు)
  • దశాబ్దంలో జనాభా పెరుగుదల: + 7.92%
  • జన సాంద్రత: చ.కి.మీ.కు 490 మంది
  • అక్షరాస్యత: 73.95% (పురుషులలో 78.4%, స్త్రీలలో 69.4 %)
  • సాపేక్ష అభివృద్ధి సూచిక : 20.71
  • మొత్తం జనాభాలో పని చేసేవారు: 43.4%
    • వ్యవసాయ సంబంధిత ఉపాధిలో : 71.2%
    • గనుల పనులలో : 0.2%
    • పరిశ్రమలలో: 5.1% (కుటీర పరిశ్రమలు మినహాయించి)
    • కుటీర పరిశ్రమలలో: 2.21%
    • నిర్మాణం పనులు: 1.01%
    • సేవా రంగంలో: 19.5%
  • మొత్తం వైశాల్యంలో అడవులు 10.38%
  • వ్యవసాయం జరిగే భూమిలో నీటి వసతి ఉన్నది: 86.5%
  • తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి: 383 కి.గ్రా.
  • ప్రతి 100 చ.కి.మీ.కు రోడ్ల పొడవు: 77.42 కి.మీ.

సంస్కృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం గ్రామీణ సంస్కృతి ఉంది. కాపు, కమ్మ, రెడ్డి, బి.సి, యస్.టి సామాజిక వర్గాల జనాభా ఎక్కువ. ఆంధ్ర క్షత్రియులు (క్షత్రియ రాజులు), బ్రాహ్మణ కులాల జనాభా తక్కువగా ఉంది. భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు వంటి పట్టణాల్లో పాశ్చాత్య నాగరికత కనిపిస్తుంది. మహిళా అక్షరాస్యత - సాధికారతలో కూడా ఈ జిల్లా ముందంజలో ఉంది. ఈ జిల్లా వాసులకు వివాహ సంబంధాలు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా వాసులతో జరుగుతూవుంటాయి.

పర్యాటకం

కొల్లేరు సరస్సు
  • జిల్లాలో 700 కి.మీ. వైశాల్యంగల కొల్లేరు సరస్సు ఉంది. విదేశాలనుండి అనేకరకాల పక్షులు అక్టోబరు - మే మాసాలలో ఇక్కడ చేరుతాయి.
  • ఏలూరు సమీపాన "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల ఉంది. యాత్రికులకు సమస్త సౌకర్యాలున్న ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి.
  • పోలవరం సమీపంలో ఉన్న పాపి కొండలు ముఖ్యమైన పర్యాటక ప్రాంత్రం. ప్రతి రోజు పట్టిసం నుండి రాజమండ్రి గుండా పేరంటాలపల్లి వరకూ గోదావరిలో లాంచి ప్రయాణం ఉంటుంది.
  • కామవరపుకోట మండలంలో బౌద్ధారామాలు ఉన్నాయి.

వ్యవసాయం

జిల్లాలోని అధిక ప్రాంతం సాంద్ర వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, వ్యావసాయికంగా ఎంతో అభివృద్ధి సాధించి, ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధిచెందింది. జిల్లాలో మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. భీమవరం నగరం రాష్ట్రంలోనే ప్రముఖ మత్స్య పరిశ్రమ వ్యాపారకేంద్రం. తణుకులో ఆంధ్రా సుగర్స్, అక్కమాంబ టెక్స్ టైల్స్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

ప్రధానంగా వ్యవసాయంపై ఆధార పడిన ప్రాంతము, అటవీ ప్రాంతము ఉన్న ఈ జిల్లా 73.95% (పురుషులు 78.43%, స్త్రీలు 69.45%) అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు తరువాత రెండవ స్థానంలో ఉంది. మొత్తం దేశంలో ఈ జిల్లా చదువుకొన్న వారి సంఖ్య ప్రకారం 31వ స్థానంలోను, అక్షరాస్యత శాతం ప్రకారం 149వ స్థానంలోను ఉంది. జిల్లాలో మహానగరాలు ఏవీ లేకపోవడం వలనా, విశ్వవిద్యాలయం లేకపోవడం వలనా ఉన్నత విద్యకు అవకాశాలు దాదాపు శూన్యం. పై చదువులకు విద్యార్థులు ఎక్కువగా ఇతర జిల్లాలకు, లేదా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటీవల ప్రైవేటు రంగంలో విద్యావకాశాలు పెరగడం వలన ఇంజినీరింగ్, మెడికల్ విద్యాలయాలు జిల్లాలో స్థాపించబడ్డాయి. జిల్లాలో విద్యాలయాల సంఖ్య ఇలా ఉంది[10].

  • ప్రాథమిక పాఠశాలలు - 2555
  • మాధ్యమిక పాఠశాలలు - 349
  • ఉన్నత పాఠశాలలు - 385
  • ప్రభుత్వ గురుకుల పాఠశాలలు - 2
  • నవోదయ పాఠశాలలు - 2
  • జూనియర్ కళాశాలలు - 51
  • డిగ్రీ కళాశాలలు - 37
  • ఐ.టి.ఐ.లు - 23
  • పాలిటెక్నిక్ కళాశాలలు - 6
  • ఇంజినీరింగ్ కళాశాలలు >25 (ఏలూరు-6, తాడేపల్లి గూడెం-3, తణుకు-1, జంగారెడ్డిగూడెం-3, భీమవరం-8[11], నరసాపురం-1)[12]
  • మెడికల్ కళాశాలలు - 2 (ఏలూరు), (భీమవరం)
  • బి.ఎడ్.కళాశాలలు - 4
  • న్యాయశాస్త్ర కళాశాలలు - 2 (ఏలూరు, భీమవరం)
  • NIT-1(TADEPALLIGUDEM)
  • Dr.YSR HORTICULTURE University(TADEPALLIGUDEM)

ప్రముఖ విద్యా సంస్థలు

ఆంధ్ర విశ్వ విద్యాలయం పి.జి కళాశాల, తాడేపల్లిగూడెం


జిల్లాలో ఎక్కువ కళాశాలలు ఆంధ్ర విశ్వ విద్యాలయా నికి అనుబంధంగా ఉన్నాయి [13]. అనేక విద్యాలయాలు నిర్వహించే సంస్థలలో ఏలూరుకు చెందిన సర్.సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థల సముదాయము, సెయింట్ తెరిసా విద్యాలయాలు, భీమవరానికి చెందిన డి.ఎన్.ఆర్. విద్యా సంస్థల సముదాయము ముఖ్యమైనవి.

ఇటీవల కార్పొరేట్ విద్యారంగం పెరిగిన కారణంగా ప్రైవేటు రంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించబడినాయి.

పర్యాటక ప్రదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము, గుంటుపల్లి (జీలకర్రగూడెం) బౌధ్ధారామాలు
అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు

  • ద్వారకా తిరుమల
  • పట్టిసీమ
  • మద్ది
  • గౌరీపట్నం
  • నిడదవోలు
  • వీరంపాలెం
  • పెనుగొండ
  • పాలకొల్లు
  • భీమవరం
  • నత్తా రామేశ్వరం
  • బలివే
  • రాట్నాలకుంట
  • గుబ్బల మంగమ్మ ఆలయం
  • ఖండవల్లి (తణుకు)

చారిత్రక ప్రదేశాలు

  • గుంటుపల్లి (జీలకర్రగూడెం) బౌధ్ధారమాలు
  • పెదవేగి
  • Narsapuram

బీచ్

  • పేరుపాలెం
  • కాళీపట్నం రేవు వద్ద గొల్లపాలెం ద్వీపం

ఇతర ఆకర్షణలు

  • పాపికొండలు (కొరుటూరు రిసార్ట్స్, కల్లూరు రొసార్ట్స్-ఖమ్మం జిల్లా)
  • కొవ్వూరు (గొష్పాద క్షేత్రం, కాటన్ బ్యారేజ్, రోడ్డు, రైలు బ్రిడ్జ్)
  • చించినాడ (దిండి రిసార్ట్స్, హౌస్ బోట్లు-తూర్పు గోదావరి జిల్లా)
  • కొల్లేరు సరస్సు (ఆటపాక, కొల్లేటికోట-కృష్ణా జిల్లా)

క్రీడలు

భీమవరం వాసి అయిన వెంకటపతి రాజు ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం తరపున 28 టెస్ట్ మ్యాచ్ లు, 53 వన్ డే మ్యాచ్ లు ఆడాడు. అతని పూర్తి పేరు సాగి లక్ష్మి వెంకటపతి రాజు.

ప్రముఖవ్యక్తులు

స్వచ్ఛంద సేవా సంస్థలు

  • మహాత్మాగాంధీ మొమొరియల్ ట్రస్ట్ {Mahatma Gandhi Memorial Trust} శ్రీరాంపురం. భీమవరం.
  • అభ్యుదయ మహిళా మండలి. అశొక్ నగర్. ఏలూరు.
  • ఏక్షన్ {Action} గిరిజనాభివృద్ది సంస్థ. జంగారెడ్డి గూడెం.
  • ఆదరణాలయం సేవాసంస్థ. పాలకొల్లు.
  • అసోషియేషన్ ఆఫ్ రూరల్ సోషల్ ఎడ్యుకేషన్. పోష్టల్ కాలనీ. ఏలూరు
  • అవార్డ్ అసోషియేషన్.{ వెల్ఫేర్ రూరల్ డవలప్మెంట్ సెంటర్ } అరుణోదయ మనో వికాసకేంద్రం.ఆర్.పి.ఆశ్రమం.భీమవరం.
  • సెంటర్ ఫర్ రూరల్ రీ కనష్ట్రక్షన్. { Centre for Rural Reconstruction Through Social Action } గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్.కొయ్యలగూడెం.
  • చైతన్య యువజన సంఘం. భీమడోలు కొత్త కాలనీ.భీమడోలు.
  • ఛిల్ద్ రురల్ రీలీఫ్ ఆర్గనయ్సెసతిఒన్ (Child Rural Relief Organisation).తాడేపల్లి గూడెం.
  • ఎలిషా హొం ఫర్ థీ ఒర్ఫన్, బ్లిన్ద్, హన్దికెప్పెద్ లెపెర్స్ (Elisha Home For the Orphan, Blind, Handicapped Lepers etc.) పాలకొల్లు.
  • ది ఏలూరు తాలూక రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మాదేపల్లి{జల్లిపూడి} ఏలూరు.
  • ఫ్లోరెన్స్ నైటెంగేల్ ఉచిత వృత్తివిధ్యా శిక్షణా కేంద్రం. తాటియాకులగుడెం. జీలుగుమిల్లి.
  • జి.ఎమ్.అసోషియేషన్.గిరిజనాభివృద్ది కేంద్రం. C/o సంజీవనీ నర్సింగ్ హోమ్.జంగారెడ్డి గూడెం.
  • గూద్ లామ్ప్ అర్గనిసతిఒన్ ఫొర్ దెప్రెస్సెద్ కమునితిఎస్ (Good Lamp Organsation for Depressed Communities). అమీనా పేట్. ఏలూరు.
  • Life Empowering Action Development.శనివారపుపేట. ఏలూరు.
  • Mercy Orphanage Children Home లంకలకోడేరు. పాలకొల్లు మండలం.
  • ముళ్ళపూడి కమలాదేవి అమెరికన్ హాస్పిటల్. వెంకట్రాయపురం. తణుకు.
  • ముళ్ళపూడి వెంకట్రాయుడు ఉచిత నేత్ర వైద్య శిభిరం.వెంకట్రాయపురం. తణుకు.
  • శాంతి వెనుకబడిన తరగతుల అభ్యుదయ సంఘము. నిడదవోలు.
  • Society for Noble Service to Poor.అన్నదేవరపేట. తల్లపూడి.
  • Sruthi Voluntary Organisation Society.అరవవారి వీధి. ఎస్.బి.అయ్.కాలనీ. భీమవరం.

రాజకీయాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో 16 శాసనసభ నియోజక వర్గాలతో పాటూ రెండు లోక్ సభ (ఏలూరు, నర్సాపురం) నియోజకవర్గాలు ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు పెనుమార్పులకు పెట్టిందిపేరు. రాజకీయంగా సున్నితమైన ఈ జిల్లా రాజకీయ వాతావరణంలో తీవ్రమైన మార్పులు ఎక్కువ. ఏలూరులో కాంగ్రెసు పార్టీకి కూడా తిరుగులేని ప్రస్థానం ఉంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఏలూరులో తిరుగులేని ప్రజానాయకుడు, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలనను సాగించిన ప్రజావాది. 1989 ఎన్నికలలో తప్ప రాష్ట్రములో అధికారములోకి వచ్చిన పార్టీ పశ్చిమగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో శాసనసభా స్థానాలను గెలుచుకోవటం పరిపాటే. 1983లో తెలుగుదేశం ప్రభంజనంలో కోటగిరి విద్యాధరరావు చింతలపూడి నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఒక్క స్థానము తప్ప మిగిలిన 16 స్థానాలూ తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. 1985 ఎన్నికలలో 15 స్థానాలు తేదేపాకు, ఒక్క అచంట నియోజక వర్గము మాత్రం దాని మిత్రపక్షమైన సిపిఐ(ఎం)కు దక్కాయి. 1989లో యేర్పడిన పాలకవర్గ వ్యతిరేక వైఖరివల్ల జిల్లాలో కాంగ్రెసు 7 స్థానాలు గెలుచుకున్నది. 1999 ఎన్నికలలో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్క కొవ్వూరు స్థానము తప్ప మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో తెలుగుదేశమే గెలుపొందింది.[14]

జిల్లాలో సంఖ్యాపరంగా కాపుల ప్రాబల్యము చాలా ఎక్కువగా ఉన్నాధి. ఇక్కడ సినిమారంగ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఆంధ్ర సుగర్స్ వ్యవస్థాపకుడైన ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ కు తణుకు, కొవ్వూరు, గోపాలపాలెం, పోలవరం నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయగల పలుకుబడి ఉంది. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు ముగ్గురు తెలుగుదేశం శాసనసభా సభ్యులకు మద్దతు ఇచ్చినట్టు నివేదికలు వెల్లడించాయి. భీమవరం నుండి పి.వి.నరసింహరాజు, ఉండి నుండి కలిదిండి రామచంద్రరాజు, అత్తిలి నుండి దండు శివరామరాజు.[15]

సినీరంగ ప్రభావములో కేంద్రమంత్రి యు.వి.కృష్ణంరాజు నర్సాపురం లోక్‌సభ స్థానంలో గెలుపొందాడు. సినీ నిర్మాత అంబికాకృష్ణ ఏలూరు నుండి శాసనసభకు ఎన్నికైనాడు. పాలకొల్లు శాసనసభా సభ్యుడు అల్లు వెంకట సత్యనారాయణ సినిమా నటుడు చిరంజీవి అండదండలతో 1983 నుండి తెలుగుదేశం తరఫున పోటీచేసే అవకాశం పొందుతూనే ఉన్నాడు. 1983లో రాజకీయ జీవితము ప్రారంభించినప్పటినుండి ప్రతి ఎన్నికలలోనూ అజేయంగా నిలిచిన తెలుగుదేశం నాయకులు ముగ్గురు: చింతలపూడి నుండి కోటగిరి విద్యాధరరావు, నర్సాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉండి నుండి కలిదిండి రామచంద్రరాజు.

బయటి లింకులు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-07. Retrieved 2007-09-13.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-09-12.
  3. 3.0 3.1 3.2 3.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-02-20. Retrieved 2007-09-12.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-09. Retrieved 2007-09-19.
  5. 5.0 5.1 5.2 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2006-04-07. Retrieved 2007-09-17.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-09. Retrieved 2007-09-17.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-05-13. Retrieved 2007-09-17.
  8. 8.0 8.1 హిందూ పత్రికలో
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-29. Retrieved 2007-09-19.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-11-14. Retrieved 2007-09-17.
  11. http://www.andhracolleges.com/colleges/colleges.aspx?type=Engineering&dist=West%20Godavari
  12. http://www.engineerstudies.com/DW_Eng_Colleges.Asp?DT=West%20Godavari[permanent dead link]
  13. http://www.andhrauniversity.info/affiliate/index.html
  14. http://www.hindu.com/2004/04/29/stories/2004042905280400.htm
  15. http://www.hindu.com/2004/03/09/stories/2004030905930400.htm