120 km/h (75 mph) maximum 65 km/h (40 mph) (average with halts)
మార్గపటం
హౌరా - చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ప్రెస్భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు హౌరా స్టేషను, చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తున్న అతి ప్రతిష్ఠాత్మకమైనది. ఇది భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ లలో ఒకటి. భారతదేశ తూర్పు తీరం బంగాళాఖాతం కలిగి యున్న ఈ తీరాన్ని కోరమండలం తీరం అని పిలుస్తున్నందున ఈ తీరంలో నడుపుతున్న ఈ రైలుకు కోరమండలం ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేసారు. ఈ రైలు కోరమండలం మొత్తం తీరాన్ని ప్రయాణించే రైలు. ఈ రైలు ఈశాన్య రైల్వే జోన్ కు చెందినది. చెన్నై వెళ్ళే అత్యధిక ప్రయాణీకులు ఈ రైలుపై వెళ్ళుటకు యిష్టపడతారు. ఎందుకంటే ఈ రైలు హౌరా చెన్నై మెయిల్ కన్నా ముందుగా చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చేరుతుంది.
చోళ సామ్రాజ్యం ఉన్న ప్రదేశాన్ని తమిళంలో చోళమండలం అని పులుస్తారు. సాహితీపరంగా "చోళ రాజ్యం" అనే పదం "కోరమండలం"గా పిలూబడుతుంది. భారతదేశం యొక్క్ దక్షిణ సముద్ర తీరాన్ని కోరమండల తీరం గా నామకరణం చేసారు.
ఈ రైలు సంఖ్యలు 12841, 12842. 12841 సంఖ్య గల రైలు హౌరా వద్ద 14.50 కు బయలుదేరి చెన్నై సెంట్రల్ కు 17.15 కు రెండవరోజు చేరుతుంది. 12842 సంఖ్య గల రైలు చెన్నై సెంట్రల్ నుండి 8.45 కు బయలుదేరి హౌరా రైల్వే స్టేషనుకు 11.50 కు చేరుతుంది. ఒకవైపు మొత్తం ప్రయాణ దూరం 1661 కి.మీ.
ఈ రైలు హౌరా నుండి విశాఖపట్నం వరకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సత్రాగచి ఎలక్ట్రిక్ లోకో షెడ్ నుండి WAP-4 ఇంజనుతోనూ, తరువాత చెన్నై వరకు రాయపురం ఆధారిత ఇంజనుతోనూ ప్రయాణిస్తుంది. ఈ 5000 అశ్వసామర్థం గల ఇంజన్లు 140 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తూ రైలును లాగగలవు. కానీ పరిమితులకు లోబడి వేగం ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ అత్యధికంగా 120కి.మీ/గంటగా అనుమతించబడింది. విద్యుదీకరణ జరిగిన తరువాత ఈ రైలు WAP-4లాలాగూడ ఆధారిత
ఇంజనుతో చెన్నై నుండి హౌరాకు ప్రయాణిస్తుంది. కానీ రైలును విశాఖపట్నం వ వ్యతిరేక దిశలో మార్చుటకు అత్యధిక సమయం కావలసి వస్తున్నందున హౌరా నుండి విశాఖపట్నం వరకు సత్రాగచి ఆధారిత ఇంజనుతోనూ, విశాఖపట్నం నుండి చెన్నై వరకు ఏరోడ్ ఆధారిత ఇంజనుతోనూ నడపాలని నిర్ణయించారు. చెన్నైకి దగ్గరలో రాయపురం షెడ్ నెలకొల్పిన తరువాత రాయపురం ఆధారిత ఇంజనును విశాఖపట్నం నుండి చెన్నై వరకు వాడుతున్నారు. తీరప్రాంతమంతా విద్యుదీకరణ జరుగక పూర్వం ప్రత్యామ్నాయం లేని కారణంగా ఖర్గపూర్ లోకో షెడ్ నుండి రెండు WDM ఇంజనులను వాడేవారు. 24 కోచ్‌లను లాగడానికి 110కి.మీ/గంట వేగాన్ని పొందుటకు ఈ రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగించవలసి వచ్చింది. విద్యుదీకరణ జరిగిన తరువాత ఒక్క WAP4 ఇంజను సరిపోయేది. ఈ విధంగా భారతీయ రైల్వేలకు ఒక ఇంజను మిగిలింది. ఈ ఇంజను ఉపయోగించడం వలన సమయం ఆదా అయి అత్యధిక వేగవంతమైన త్వరణం సాధించగలిగాము.
ఈ రైలు 1661 కి.మీ దూరాన్ని 26 గంటల 25 నిమిషాలలో చేరుతుంది. ఈ రైలు అత్యధిక వేగం 120 కి.మీ/గంట. భారతీయ రైల్వేలలో ఈ రైలు యొక్క వేగం, త్వరణం యితర సూపర్ ఫాస్టు రైలులతో విభిన్నంగా ఉంటాయి. ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు రాజధాని ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించే అనుభూతి పొందుతారు. ఈ రైలు రాజధాని/శతాబ్ది ఎక్స్‌ప్రెస్ యొక్క రెండవ వెర్షన్. ఈ రైలు భారతీయ రైల్వేల చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఫాస్టు రైలు. ఈ రైలును సాధారణంగా దక్షిణ ఆగ్నేయ రైల్వేల రాజుగాను, ఆగ్నేయ రైల్వేల లెజెండ్ గానూ, అన్ని రైళ్ళలో వేగ మహారాజుగా పిలుస్తారు. ఆగ్నేయ రైల్వే జోనులో ప్రయాణిస్తున్న అన్ని రైళ్ళలో అతి వేగవంతమైనది.
ప్రస్తుతం ఈ రైలు హౌరా-చెన్నై రైలు మార్గంలో చెన్నై మైలు తరువాత అతి ముఖ్యమైన రైలుగా కొనియాడబడుతున్నది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, ఇతత సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ ల వలె అతి వేగంగా ప్రయాణిస్తున్న రైలు.
ఈ రైలు చెన్నై, విజయవాడల మధ్య ఆగకుండా ప్రయాణిస్తుంది. 12842 సంఖ్య గల రైలు ఒంగోలు వద్ద పాంట్రీ కారణంగా ఆగుతుంది. కనుక ఒంగోలు వాణిజ్యపరమైన స్టాపు. మొత్తం 432 కి.మీ దురాన్ని 6 గంటలలో చేరుతుంది. తరువాత విశాఖపట్నం వరకు ఒక్క రాజండ్రి వద్ద మాత్రమే అగుతుంది. ఈ రైలు విజయవాడ, విశాఖపట్నం మద్య వేగం తగ్గుతుంది. 6 గంటల 25 నిమిషాల వ్యవధి తీసుకుంటుంది. ఈ వేగం రత్నాచల్/ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ ల మాదిరిగా ఉంటుంది. ఈ మార్గంలో ఒకే ఆపుదల ఉందడం వలన ఈ రైలుకు ప్రాముఖ్యత ఉంది. యితర స్టాపులు బ్రహ్మపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ మొదలైనవి. పూర్వపు రోజుల కన్నా ఈ రైలు వేగం క్రమంగా తగ్గినది. ప్రయోగాత్మకంగా యితర స్టాపులను నిర్ణయించారు. అవి జైపూర్ కిన్‌ఝర్ రోడ్, ఒడిశా, తాడేపల్లి గూడెం,ఏలూరు .
ఈ రైలులో 12 స్లీపర్స్, 6 ఎ.సి కోచ్‌లు (1AC, 2AC, 3AC), 1 పాంట్రీ కార్, 3 జనరల్ సిటింగ్, 2 ఎస్.ఎల్.ఆర్ బోగీలు ఉంటాయి. ఈ రైలు తన రాక్లను హౌరా చెన్నై మైలుతో 2008 సంవత్సరం నుండి పంపకం చేసుకుంటుంది. ఈ కోరమండలం ఎక్స్‌ప్రెస్ 24 భోగీలను కలిగి కార్నరింగ్ భ్రేక్ కంట్రోల్ ను కలిగి ఉంటుంది.
2002 మార్చి 15 న నెల్లురు జిల్లాలోని కొవ్వురు మండలంలో గల పడుగుపాడు ఓవర్ బ్రిడ్జి వద్ద 2.40 కు పట్టాలు తప్పింది. సుమారు 100 మంది ప్రయాణీకులు గాయాలు పాలయ్యారు. ఈ సంఘటనకు రైల్వే ట్రాక్ లోపం అని తేలింది.
2009 ఫిబ్రవరి 13 న ఒరిస్సా రాష్ట్రంలోన్ భువనేశ్వర్ కు 100 కి.మీ దూరంలో గల జైపూర్ రోడ్ కు దగ్గరలో పట్టాలు తప్పింది. 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దీనికి కారణం తెలియదు. ఈ ప్రమాదం జరిగినపుడు దానివేగం 115 కి.మీ/గం.
2012 డిసెంబరు 30 న ఒరిస్సా రాష్ట్రంలోని గంజాంజిల్లాలో జరిగిన ప్రమాదంలో ట్రాక్ పైకి వచ్చిన ఆరు ఏనుగులు, రెండు ఏనుగు పిల్లలు మరణించాయి. ఈ సంఘటనలో బెడ్రోల్ సహాయకులు కూడా మరణించారు. కారణాలు తెలియది.
2012 జనవరి 14 న లింగరాజ్ రైల్వేస్టేషన్ దగ్గరలో జనరల్ కంపార్టుమెంటులో మంటలు వచ్చాయి. ఈ మంటలు 20 నిమిషాలలో అదుపులోకి వచ్చాయి. ఏ ప్రమాదం జరుగలేదు.
2015 ఏప్రిల్ 18 న నిడదవోలు వద్ద రెండు భోగీలకు మంటలు అంటుకున్నాయి.