సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • సంఘమిత్ర సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
  • ಸಂಘಮಿತ್ರ ಸೂಪರ್ ಫಾಸ್ಟ್ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್
  • संघमित्रा सुपरफास्ट एक्सप्रेस
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు
స్థానికతకర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్
తొలి సేవ1 జనవరి 2002
ప్రస్తుతం నడిపేవారునైరుతి రైల్వే జోన్
మార్గం
మొదలుబెంగుళూరు నగర రైల్వేస్టేషన్
ఆగే స్టేషనులు37
గమ్యంపాటలీపుత్ర జంక్షన్
ప్రయాణ దూరం2,721 కి.మీ. (1,691 మై.)
సగటు ప్రయాణ సమయం48.20 గంటలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
సదుపాయాలు
శ్రేణులుAC 1 Tier, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes
సాంకేతికత
వేగం56 km/h (35 mph) average with halts Maximum speed : 110 kmph
మార్గపటం

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బీహార్ రాష్ట్రంలోని పాట్నా రైల్వే స్టేషను, కర్ణాటక లోని బెంగుళూరు నగర రైల్వేస్టేషన్ మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు చెన్నై సెంట్రల్ గుండా పోతుంది. ఈ రైలు 2729 km మొత్తం దూరాన్ని 48 గంటలలో ప్రయాణం చేస్తుంది. ఈ రైలు 12295 (అప్), 12296 (డౌన్) సంఖ్యలను కలిగియుంతుంది. ఈ రైలు నైరుతి రైల్వే జోన్కు చెందినది.

రైలు నామం వ్యుత్పత్తి

[మార్చు]

పాటలీపుత్ర (ప్రస్తుతం పాట్నా) ను పరిపాలించిన మౌర్య వంశానికి చెందిన చక్రవర్తి అయిన అశోకుని కుమార్తె సంఘమిత్ర పేరును ఈ రైలుకు నామకరణం చేసారు.

చరిత్ర

[మార్చు]

ఈ రైలు చెన్నై సెంట్రల్ నుండి ప్రతీ మంగళ, గురు వారాలలో 1:30PM కు బయలుదేరేది. 2001 ప్రారంభంలో ఈ రైలును యశ్వంత్ పూర్ రైల్వే స్టేషను వరకు పొడిగించి ఉదయం 7:00 లకు ప్రతీ మంగళ, గురు వారాలలో 6595/6596 సంఖ్యలతో ప్రయాణించేది.

2005 లో ఈ రైలును ప్రతీరోజూ వెళ్ళే విధంగా నిర్ణయించారు. ఈ రైలు బెంగళూరు సిటీ రైల్వే స్టేషను నుంటి పాట్నా జంక్షను మధ్య తిరిగేటట్లు నిర్ణయించారు.

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

[మార్చు]

ఈ రైలు వారానికి ఏడు రోజులు నడుస్తుంది.

ట్రాక్షన్

[మార్చు]

సంఘమిత్ర సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ బెంగళూరు నుండి చెన్నై వరకు రాయపురం యొక్క WAP7 ఇంజను ద్వారా ప్రయాణిస్తుంది. తరువాత చెన్నై నుండి ఇటార్సీ వరకు గల దూరాన్ని ఇటార్సీ యొక్క WAP4 ఇంజను ద్వారా ప్రయాణిస్తుంది. ఇటార్సీ నుండి అలహాబాదుల వరకు WDP4D ఇంజను ద్వారా ప్రయాణం చేసి చివరికి అలహాబాదులోని పాటలీపుత్ర గమ్యస్థానానికి ముఘల్ సరాయి షెడ్ కు చెందిన WAP4 ఇంజనుతో ప్రయాణిస్తుంది.

రైలు సమయాలు

[మార్చు]

ఈ రైలు బెంగళూరు సిటీ రైల్వే స్టేషను నుండి అన్నిరోజులలో ఉదయం 9:00 గంటలకు బయలుదేరుతుంది. పాట్నా రైల్వేస్టేషనుకు ఈ రైలు అన్ని దినాలలో ఉదయం 9:20 గంటలకు చేరుతుంది. ఈ రైలు పాట్నా రైల్వే స్టేషను నుండి అన్ని దినాలలో 19:55 కు బయలుదేరి అన్నిదినాలలో బెంగళూరు సిటీ రైల్వే స్టేషనును 20:40 కు చేరుతుంది.

మార్గం

[మార్చు]

ఈ రైలు బంగార్‌పేట, జోలార్‌పెట్టై, ఆరక్కోణం, చెన్నై సెంట్రల్, గూడూరు, నెల్లూరు, విజయవాడ జంక్షన్, సిర్పూర్ కాగజ్‌నగర్ (నాగపూర్), ఇటార్సీ, జబల్‌పూర్, అలహాబాదు, ముఖల్ సరాయి.

ఈ రైలు యొక్క లోకో చెన్నై సెంట్రల్, అలహాబాదు జంక్షన్ ల మధ్య వ్యతిరేక దిశలో అమరుస్తారు.

కోచ్లు కూర్పు

[మార్చు]

ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

12295 (అప్) [2]

బెంగళూరు సిటీ రైల్వే స్టేషను నుండి పాట్నాకు నడిచే ఈ రైలులో కోచ్ ల అమరిక ఈ విధంగా ఉంటుంది. ఎస్.ఎల్.ఆర్ (2), జనరల్ (3), పి.సి (1), రిజర్వేషన్ బోగీలు (18) ఉంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ జనరల్ A3 A2 A1 బి4 బి3 బి2 బి1 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 PC ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR
12296 (డౌన్) [3]

పాట్నా నుండి బెంగళూరు సిటీ రైల్వే స్టేషనుకు నడిచే ఈ రైలులో కోచ్ ల అమరిక ఈ విధంగా ఉంటుంది. ఎస్.ఎల్.ఆర్ (2), జనరల్ (3), పి.సి (1), రిజర్వేషన్ బోగీలు (18) ఉంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 PC ఎస్9 ఎస్10 ఎస్11 బి1 బి2 బి3 బి4 A1 A2 A3 జనరల్ జనరల్ SLR

వివిధ స్టేషన్లలో చేరు సమయాలు

[మార్చు]
స్టేషను పేరు (కోడ్) రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు రూటు
బెంగళూరు సిటీ జంక్షన్ ప్రారంభం 09:00 0 0 కి.మీ 1 1
బెంగళూరు కాంట్ (BNC) 09:10 09:12 2 నిమిషాలు 5 కి.మీ 1 1
కృష్ణరాజపురం (KJM) 09:21 09:23 2 నిమిషాలు 15 కి.మీ 1 1
బంగారపేత (BWT) 10:08 10:10 2 నిమిషాలు 71 కి.మీ 1 1
జోలపేట్టై  (JTJ) 11:28 11:30 2 నిమిషాలు 149 కి.మీ 1 1
కాట్పాడి జంక్షన్ (KPD) 12:38 12:40 2 నిమిషాలు 232 కి.మీ 1 1
అరక్కోణం (AJJ) 13:33 13:35 2 నిమిషాలు 293 కి.మీ 1 1
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను (MAS) 15:15 15:45 30 నిమిషాలు 362 కి.మీ 1 1
గూడూరు జంక్షన్ (GDR) 18:03 18:05 2 నిమిషాలు 499 కి.మీ 1 1
నెల్లూరు  (NLR) 18:23 18:25 2 నిమిషాలు 537 కి.మీ 1 1
ఒంగోలు (OGL) 19:53 19:54 1 నిమిషం 653 కి.మీ 1 1
విజయవాడ జంక్షన్ (BZA) 22:25 22:35 10 నిమిషాలు 792 కి.మీ 1 1
వరంగల్ (WL) 01:05 01:06 1 నిమిషం 1000 కి.మీ 2 1
రామగుండం  (RDM) 02:32 02:33 1 నిమిషం 1101 కి.మీ 2 1
సిర్పూర్ కాగజ్ నగర్ (SKZR) 03:32 03:33 1 నిమిషం 1173 కి.మీ 2 1
బల్లార్షా జంక్షన్ (BPQ) 05:00 05:10 10 నిమిషాలు 1243 కి.మీ 2 1
చంద్రపూర్ (CD) 05:29 05:30 1 నిమిషం 1257 కి.మీ 2 1
సేవాగ్రాం (SEGM) 07:12 07:13 1 నిమిషం 1378 కి.మీ 2 1
నాగపూర్ (NGP) 08:20 08:30 10 నిమిషాలు 1454 కి.మీ 2 1
పందుర్న (PAR) 10:08 10:09 1 నిమిషం 1558 కి.మీ 2 1
బేతుల్ (BZU) 11:40 11:41 1 నిమిషం 1644 కి.మీ 2 1
ఘోరాడోంగ్రి (GDYA) 12:22 12:24 2 నిమిషాలు 1681 కి.మీ 2 1
ఇటార్సీ జంక్షన్  (ET) 14:35 14:45 10 నిమిషాలు 1751 కి.మీ 2 1
పిపారియా (PPI) 15:38 15:40 2 నిమిషాలు 1818 కి.మీ 2 1
నర్సింగపూర్  (NU) 16:40 16:42 2 నిమిషాలు 1912 కి.మీ 2 1
జబల్పూర్  (JBP) 18:10 18:20 10 నిమిషాలు 1996 కి.మీ 2 1
కాట్నీ (KTE) 19:30 19:35 5 నిమిషాలు 2087 కి.మీ 2 1
సట్నా (STA) 21:15 21:25 10 నిమిషాలు 2185 కి.మీ 2 1
అలహాబాదు జంక్షన్  (ALD) 01:35 02:03 28 నిమిషాలు 2363 కి.మీ 3 1
మిర్జాపూర్  (MZP) 03:13 03:15 2 నిమిషాలు 2453 కి.మీ 3 1
ముఘల్ సరాయ్ జంక్షన్  (MGS) 05:10 05:20 10 నిమిషాలు 2515 కి.మీ 3 1
బక్సార్  (BXR) 06:48 06:50 2 నిమిషాలు 2609 కి.మీ 3 1
ఆగ్రా (ARA) 07:53 07:55 2 నిమిషాలు 2678 కి.మీ 3 1
దనాపూర్ (DNR) 08:52 08:54 2 నిమిషాలు 2717 కి.మీ 3 1
పాటలీపుత్ర (PPTA) 09:20 గమ్యస్థానం 0 2723 కి.మీ 3 1

వివిధ సంఘటనలు

[మార్చు]
  • మే 10 2016 న బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన 10 మంది దోపిడీ దొంగలు గుండ్రాతిమడుగు దగ్గర చైన్‌లాగి రైలును ఆపారు. S-2, S-11 బోగీల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదు దోచుకున్నారు.[4]
  • అక్టోబరు 20 2014 న పాట్నా నుండి బెంగళూరు వెళ్తున్న ఈ రైలులో మంటలు చెలరేగాయి. పాట్రీకార్ కింది భాగంలో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమై రైలును వరంగల్ లోనిలిపి వేసారు. సాంకేతిక కారణాలవలన మంటలు చెలరేగినట్లు గుర్తించారు.[5]
  • జూలై 2 2014 ముగల్ సరాయ్, అలహాబాదు జంక్షన్ మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ లోని నాలుగు ఎ.సి కోచ్ లలో భారీ దోపిడీ జరిగి 60 లక్షల రూపాలయ నష్టం సంభవించింది.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mail/Express/Superfast Train Names with Details
  2. Anand, Siddharth (2023-02-16). "12295/Sanghamitra SF Express (PT) — SMVT Bengaluru to Danapur SWR/South Western Zone". Railway Enquiry. Retrieved 2023-09-20.
  3. ICF Rake, 2296/Sanghamitra SF Express (PT)
  4. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడి... May 10, 2016[permanent dead link]
  5. సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు
  6. मुगलसराय से इलाहाबाद के बीच एसी कोचों से 60 लाख की चोरी

ఇతర లింకులు

[మార్చు]