Jump to content

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
Bhubaneswar bound Prashanti Express at Pithapuram
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక
తొలి సేవ22nd నవంబర్ 2000
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే జోన్
మార్గం
మొదలుభుబనేశ్వర్
ఆగే స్టేషనులు43
గమ్యంబెంగుళూరు
ప్రయాణ దూరం1,547 కి.మీ. (961 మై.)
సగటు ప్రయాణ సమయం30గంటల 35నిమిషాలు
రైలు నడిచే విధంరోజు
రైలు సంఖ్య(లు)18463 / 18464
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్,రెండవ తరగతి ఎ.సి,ముడవ తరగతి ఎ.సి,సాధారణ భోగీలు
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం50 km/h (31 mph) average with halts
మార్గపటం

బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది బెంగుళూరు రైల్వే స్టేషను, భువనేశ్వర్ రైల్వే స్టేషను మధ్య నడిచే రోజువారి ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు 18463 నెంబరుతో భుబనేశ్వర్లో ఉదయం 05 గంటల 30 నిమిషాలకు బయలుదేరి, తరువాతి రోజు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు (ksr) స్టేషన్ కు చేరుకుంటుంది.

చరిత్ర

[మార్చు]

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ను 2000 నవంబర్ 22విశాఖపట్నం, బెంగళూరు రైల్వే స్టేషన్ల మద్య ప్రారంభించారు. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ను భుబనేశ్వర్ వరకు 2007 ఫిబ్రవరి 20 నుండి పొడిగించారు.

మార్గం

[మార్చు]

బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ నుండి బయలుదేరి ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్టాల్లో ముఖ్య పట్టణాలైన బరంపురం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, గుంటూరు, నంద్యాల, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, హిందూపురం, శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుగొండ, యెలహంక ల మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు, విశాఖపట్నం రైల్వే స్టేషను ల వద్ద తన ప్రయాణదిశను మార్చుకుంటుంది.

వేగం

[మార్చు]

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్, బెంగళూరు ల మద్య 1548 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల 35నిమిషాల ప్రయాణసమయంతో సగటున గంటకు 51 కిలోమీటర్ల వేగంతో అధిగమిస్తుంది.

ట్రాక్షన్

[మార్చు]

భువనేశ్వర్ - బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ నుండి విశాఖపట్నం వరుకు విశాఖపట్నం లోకో షెడ్ అధారిత WAP-4 లేదా WAP-7 లోకోమోటివ్ ను, అక్కడినుండి గుంతకల్లు వరుకు లాల్ గుడ లేదా విజయవాడ లోకోషెడ్ ఆధారిత WAP-4 లోకోమోటివ్ ను, గుంతకల్లు నుండి బెంగుళూరు వరకు లాల్ గుడ లేదా విజయవాడ అధారిత WAP-4 లేదా WAP-7 లోకోమోటివ్ లను ఉపయోగిస్తున్నారు.

భోగీల అమరిక

[మార్చు]

బెంగుళూరు - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి, 4 మూడవ తరగతి ఎ.సి భోగీలు,11 స్లీపర్ భోగీలు, 4 సాధరణ భోగీలతో కలిపి మొత్తం 23 భోగీలుంటాయి.

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
SLR UR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 PC S10 S11 B1 B2 B3 B4 A1 UR UR SLR

సమయ సారిణి

[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు 18463:ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 BBS భుబనేశ్వర్ ప్రారంభం 05:30 0.0 1
2 KUR ఖుర్దా రోడ్ జంక్షన్ 05:55 06:00 5ని 19.1 1
3 BALU బలుగావున్ 06:48 06:50 2ని 90.2 1
4 KIT కళ్ళికోట్ 07:03 07:05 2ని 107.4 1
5 CAP చత్రపూర్ 07:31 07:33 2ని 144.9 1
6 BAM బరంపురం 07:50 07:55 5ని 166.4 1
7 IPM ఇచ్చాపురం 0816 0818 2ని 190.9 1
8 SPT సోంపేట 0831 0833 2ని 208.8 1
9 PSA పలాస 09:25 09:27 2ని 240.8 1
10 NWP నౌపడ 09:48 09:50 2ని 266.6 1
11 CHE శ్రీకాకుళం రోడ్ 1023 1025 2ని 313.7 1
12 CPP చీపురుపల్లి 10:53 10:55 2ని 352.4 1
13 VZM విజయనగరం 11:22 11:27 5ని 383.3 1
14 VSKP విశాఖపట్నం 12:45 13:05 20ని 444.4 1
15 DVD దువ్వాడ 13:34 13:35 1ని 461.6 1
16 AKP అనకాపల్లి 13:46 13:47 1ని 477.5 1
17 TUNI తుని 14:30 14:31 1ని 541.3 1
18 ANV అన్నవరం 14:45 14:46 1ని 558.0 1
19 SLO సామర్లకోట 15:13 15:14 1ని 594.9 1
20 RJY రాజమండ్రి 16:08 16:10 2ని 645.1 1
21 NDD నిడదవోలు 16:39 16:40 1ని 667.5 1
22 TDD తాడేపల్లి గూడెం 16:57 16:58 1ని 687.3 1
23 EE ఏలూరు 17:31 17:32 1ని 735.0 1
24 BZA విజయవాడ 19:10 19:25 15ని 794.6 1
25 GNT గుంటూరు 20:10 20:30 20ని 826.5 1
26 NRT నర్సారావుపేట 21:20 21:21 1ని 871.7 1
27 VKN వినుకొండ 21:54 21:55 1ని 909.0 1
28 DKD దొనకొండ 22:35 22:36 1ని 946.4 1
29 MRK మార్కాపూర్ 22:54 22:55 1ని 970.7 1
30 CBM కంభం 23:23 23:24 1ని 996.6 1
31 GID గిద్దలూరు 23:55 23:56 1ని 1030.0 1
32 DMT దిగువమెట్ట 00:14 00:15 1ని 1041.6 2
33 NDL నంద్యాల 01:30 01:35 5ని 1083.5 2
34 BMH బేతంచెర్ల 02:14 02:15 1ని 1123.4 2
35 DHNE డోన్ 03:08 03:10 2ని 1159.2 2
36 GTL గుంతకల్లు 04:35 04:40 5ని 1227.7 2
37 GY గుత్తి 05:08 05:10 2ని 1256.2 2
38 ATP అనంతపురం 06:18 06:20 2ని 1313.2 2
39 DMM దర్మవరం 07:20 07:25 5ని 1346.6 2
40 SSPN శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం 08:08 08:10 5ని 1380.1 2
41 PKD పెనుగొండ 08:29 08:30 1ని 1400.2 2
42 HUP హిందూపురం 08:58 09:00 2ని 1437.8 2
43 GBD గౌరిబిదనూరు 09:24 09:25 1ని 1461.0 2
44 YNK యెలహంక 10:38 10:40 2ని 1521.4 2
45 BNCE బెంగుళూరు ఈస్ట్ 10:58 11:00 2ని 1541.3 2
46 BNC బెంగళూరు క్యాంట్. 11:18 11:20 2ని 1544.0 2
47 SBC క్రాంతివిరా సంగోలి రాయ్నా బెంగళూరు (ksr) 12:05 గమ్యం 1548.3 2

సంఘటనలు

[మార్చు]

ఆగస్టు 29 2015 లో బెంగుళూరు సిటి రైల్వే స్టేషన్ వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ యొక్క ఇంజన్, రెండు భోగీల పట్టాలు తప్పాయి.అయితే ప్రయాణికులకు ఎటువంటి హాని కలుగలేదు.

మూలాలు

[మార్చు]