Jump to content

బాలాపూర్ (రంగారెడ్డి జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 17°18′04″N 78°29′10″E / 17.3011557°N 78.4862333°E / 17.3011557; 78.4862333
వికీపీడియా నుండి
(బాలాపూర్ (రంగారెడ్డి) నుండి దారిమార్పు చెందింది)
బాలాపూర్
—  రెవెన్యూ గ్రామం  —
బాలాపూర్ is located in తెలంగాణ
బాలాపూర్
బాలాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°18′04″N 78°29′10″E / 17.3011557°N 78.4862333°E / 17.3011557; 78.4862333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం బాలాపూర్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బాలాపూర్,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలానికి చెందిన గ్రామం.[1]

ప్రతి ఏడాది వినాయక చవితికి వినాయకుడి లడ్డును వేలం వేస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును రాష్ట్రంలోనే అత్యధికంగా వేలం పాట పడి దక్కించుకుంటారు. దీనితో బాలాపూర్ లడ్డు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని భక్తులకు నమ్మకంగా మారింది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]

నూతన మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]

లోగడ బాలాపూర్  గ్రామం రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని సరూర్‌నగర్ మండలానికి చెందింది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బాలాపూర్ గ్రామాన్ని (1+16) పదిహేడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా, కందుకూరు రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-16.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లింకులు

[మార్చు]