పార్సిగుట్ట
పార్సిగుట్ట | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°25′45″N 78°29′43″E / 17.4292°N 78.4953°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
పార్సిగుట్ట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది సికింద్రాబాదుకు సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో నివాసగృహాలు, దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బౌద్ధానగర్ మున్సిపల్ డివిజన్, సికింద్రాబాదు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది.
ఉపప్రాంతాలు
[మార్చు]ఇక్కడ న్యూ అశోక్ నగర్, సంజీవపురం, ఎల్‌ఎన్ నగర్, అంబర్ నగర్, అల్లాడి రాజ్‌కుమార్ నగర్, వారసిగూడ, వినోభా కాలనీ అనే ఉప ప్రాంతాలు ఉన్నాయి.[2]
సంస్కృతి
[మార్చు]ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలతో సహా అన్ని మతాలకు చెందిన సంస్కృతులు ఉన్నాయి.[3] వినాయక చవితి, నవరాత్రి పండుగల సందర్భంగా ఈ ప్రాంతంలో వినాయకుడు, దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు జరుపుకుంటారు. అలాగే రంజాన్, క్రిస్టమస్ పండుగలను కూడా జరుపుకుంటారు.
ఇక్కడ షిర్డీ సాయిబాబా దేవాలయం, శ్రీ శక్తి మహాంకాళి దేవాలయం, శ్రీ కంచి కామకోటి శంకర మందిరం, శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి. ఈ ఆలయాల్లో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, వినాయకచవితి, శ్రీరామనవమి జరుపుకుంటారు, అన్నదానం నిర్వహిస్తారు. మొహమ్మదియా మసీదు, ఏక్ మినార్ మసీదు, మసీదు-ఎ-సామి మొదలైన మసీదులు ఉన్నాయి.
రవాణా
[మార్చు]దీనికి సమీపంలో పద్మారావు నగర్, వారసిగూడ, రాంనగర్, ముషీరాబాద్ ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో నగరంలోనే అతిపెద్ద చేపల మార్కెటు ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పార్సిగుట్ట మీదుగా 44 నెంబరు బస్సు, సికింద్రాబాద్ రెతిఫైల్ బస్టాండ్ నుండి పార్సిగుట్టకు నడుపబడుతోంది.[4]సికింద్రాబాద్ రైల్వే స్టేషను, జామియా ఉస్మానియా రైల్వే స్టేషను, ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషను సమీపంలో ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Parsigutta". www.onefivenine.com. Retrieved 2021-02-04.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Parsigutta Main Road". www.onefivenine.com. Retrieved 2021-02-04.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Nanisetti, Serish (2018-08-27). "Bawas of Hyderabad". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-02.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-04.
{{cite web}}
: CS1 maint: url-status (link)