మదీనాగూడ
మదీనాగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′46″N 78°20′30″E / 17.496111°N 78.341667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 050 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
మదీనాగూడ, తెలంగాణ రాష్ట్ర హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది నగరానికి వాయవ్య దిశలో చందానగర్, హఫీజ్‌పేట, మియాపూర్ ప్రాంతాల మధ్యలో ఉంది.[1][2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో చందానగర్, తారానగర్, హఫీజ్‌పేట, మియాపూర్, హెచ్‌ఎమ్‌టి కాలనీ, విశ్వస్వరనగర్ కాలనీ, ఇంద్రారెడ్డి అల్విన్ కాలనీ, ఉషోదయ ఎన్‌క్లేవ్, సప్తగిరి కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[4]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఇక్కడ అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. మియాపూర్ ప్రాంతంలో ఒక పెద్ద మార్కెటు ఉంది. చుట్టుపక్కల శివారు ప్రాంతాలలో బాగా ప్రాచూర్యం పొందిన మార్కెటు ఉంది.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మదీనాగూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు (10కెవి: సికింద్రాబాద్ జంక్షన్ నుండి మియాపూర్ బస్టాప్ వరకు, 17/226: ఇసిఐఎల్ బస్ స్టేషను నుండి లింగంపల్లి బస్టాప్ వరకు, 17హెచ్/226సి: ఇసిఐఎల్ బస్టాప్ నుండి భెల్ వరకు, 113కె: లింగంపల్లి బస్టాప్ నుండి ఉప్పల్ బస్టాప్ వరకు, 216కెఎల్: లింగంపల్లి బస్టాప్ నుండి మెహదీపట్నం బస్టాప్ వరకు) సౌకర్యం ఉంది.[5] ఇక్కడికి సమీపంలో చందానగర్ రైల్వే స్టేషను, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను, మియాపూర్ మెట్రో స్టేషను ఉన్నాయి.
ప్రార్థన స్థలాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో షిర్డీ సాయిబాబా దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, దుర్గా దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయం, మసీదు-ఎ-అమీనా కలీమి, జూబ్లీహిల్స్ మసీదు, ఇస్లామిక్ సెంటర్, మసీదు ఇ ఎరాజ్ మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Madinaguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-29.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "Madinaguda, Chanda Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.