అనుక్రమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనుక్రమణికములు (సంస్కృతం: अनुक्रमणी, Anukramaṇī) (Anukramaṇikā కూడా ) వేద శ్లోకాల స్వరూపాలను [1] ఉన్నది ఉన్నట్లుగా కాపాడటానికి, వేద అర్థాన్ని తెలుసుకోవడానికి, మంత్ర దేవతలు ఎవరు, ప్రతి వేదాన్ని దర్శించిన మహర్షులెవరు, వేద సంహితలో ఎటువంటి చందస్సులు, విభాగాలు ఉన్నాయి, అనే విషయాలను తెలుసుకునే వీలున్న క్రమ సూచికలు.

ఋగ్వేదంలో అనుక్రమణికములు[మార్చు]

 • ఋగ్వేదం రక్షణ కొరకు శౌనకుడు (1) అనువాకానుక్రమణి (2) ఆర్షానుక్రమణి (3) చందోనుక్రమణి (4) దేవతానుక్రమణి (5) పాదానుక్రమణి, (6) సూక్తానుక్రమణి అను ఆరు (6) అనుక్రమణికములు రచించాడు. ఇందులో అనువాకానుక్రమణి తప్ప మరొకటి లభించుట లేదు. మిగతావి కేవలం వేదరాశులలో (సధ్గురశిష్య రచనలలో) ఉల్లేఖనాలు రూపాలలో మాత్రమే మనుగడలో ఉన్నాయి.
 • శౌనకుడు వ్రాశిన ఋగ్విధానం గ్రంథం [2] (ఋగ్వానుక్రమణి అనుకోవచ్చు) కూడా అనుక్రమణికా వాజ్మయములో చేరుతుంది.
 • ఋగ్వేదం యొక్క అనుక్రమణికములు అన్నీంటిలో అత్యంత ముఖ్యమైన అనుక్రమణి కాత్యాయనుడు వ్రాశిన ఋక్సర్వానుక్రమణి అత్యంత ముఖ్యమైనది. ఇందులో మొదటి పదం, శ్లోకాలు, పేరు, ఋషులు కుటుంబం, ఋగ్వేద దేవతల పేర్లు, వేదానుక్రమణికములు ఋగ్వేదం లోని 1,028 శ్లోకాలకు వ్రాశి ఉంది. సా.శ. 12వ శతాబ్దంలో సధ్గురశిష్య రచించిన వేదార్థదీపిక లో ఈ కృతి యొక్క ఒక ముఖ్యమైన వ్యాఖ్యానం కూడా ఉంది.

ఇతర వేదాలలో అనుక్రమణీలు[మార్చు]

 • కౌతుమ శాఖకు చెందిన ఆర్షేయ బ్రాహ్మణం యొక్క మొట్టమొదటి అనుక్రమణి సామవేదమునకు[1] సంబంధించినంత వరకు పురాతన మైనది. జైమినీయ శాఖకు చెందిన జైమినీయ ఆర్షేయ బ్రాహ్మణం తదుపరి కాలంలో సామవేదం యొక్క అనుక్రమణిగా ఉంది.
 • ఆత్రేయి 'శాఖకు చెందిన తైత్తిరీయ సంహిత, చరణీయ శాఖ (మంత్రార్షధ్యాయ), మాధ్యందిన శాఖకు చెందిన వాజసనేయి సంహిత యజుర్వేదం 'యొక్క మూడు అనుక్రమణీలు ఉన్నాయి అని కాత్యాయనీయుడు ఆపాదించాడు.[1]
 • ఛందస్సు ప్రత్యేకంగా నిరూపించబడిన యాజుషసర్వానుక్రమణి కృష్ణయజుర్వేదానికి చెందినది యాస్కుడు వ్రాశాడు.[2]
 • అథర్వణ వేదమునకు బృహత్సర్వానుక్రమణి [1], అథర్వవేదియపంచప్తాలిక లు అనుక్రమణీలు ఉన్నాయి. బృహత్సర్వానుక్రమణి విశిష్టమైన గ్రంథం. అథర్వసంహిత యొక్క పూర్తి సూచిక పది అధ్యాయాల్లో ఇందులో ఉంది.[1]
 • శుక్ల యజుర్వేదము నకు చెఈందిన శుక్లయజుస్సర్వానుక్రమసూత్రం అయుదు (5) అధ్యాయాల్లో [2] కాత్యాయనుడు వ్రాశాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

వేదాలు, వేద ఆనుగుణ్యమైన వాటి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. [1]

 • Manfred Mayrhofer, Die Personennamen in der Ṛgveda-Saṁhitā. Sicheres und Zweifelhaftes, Munich (2003).
 • Hermann Oldenberg, Ueber die Liedverfasser des Rigveda. ZDMG 42 (1888) 199-247.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 Max Müller, F. (1860) A History of Ancient Sanskrit Literature So Far As It Illustrates the Primitive Religion of the Brahmans, London:Williams and Norgate, pp.215-29
 2. 2.0 2.1 2.2 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ