శైవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:شیواپرستی
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: simple:Shaivism
పంక్తి 41: పంక్తి 41:
[[ro:Șivaism]]
[[ro:Șivaism]]
[[ru:Шиваизм]]
[[ru:Шиваизм]]
[[simple:Shaivism]]
[[sk:Šivaizmus]]
[[sk:Šivaizmus]]
[[sl:Šivaizem]]
[[sl:Šivaizem]]

23:17, 21 జూలై 2012 నాటి కూర్పు

హైందవ మత సాంప్రదాయము లో పరమశివుని ప్రధాన అధిదేవత గా ఆరాదించే శాఖను శైవము (Shaivism) అంటారు. వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులకు శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ముఖ్యులు. వీరిని "శివ కవిత్రయము" అని అంటారు.

వీరశైవం

తెలుగులో వీరశైవ ప్రచారం కోసం పాల్కురికి సోమనాథుడు అనేక రచనలు చేశాడు. సమాజంలోని అన్నివర్గాల వారికి అందుబాటులోకి రావాలని వివిధ ప్రక్రియలు చేపట్టాడు. పురాణం, చరిత్ర కావ్యం, శతకం, ఉదాహరణ కావ్యం, గద్యలు, రగడలు, అష్టకం, పంచకం, స్తవం, భాష్యం ముఖ్యంగా పేర్కొనదగినది. వీటిలో కొన్ని తెలుగులోను, కొన్ని కన్నడం, సంస్కృతంలోనూ రచించాడు. పండితుల కోసం రుద్ర భాష్యం, సోమనాథ భాష్యం రచించాడు.

వీరశైవ మత పురాణమైన బసవ పురాణంలో బసవేశ్వరుని చరిత్ర ప్రధానమైనది. ఒక మత ప్రవక్త జీవితాన్ని పురాణంగా నిర్మించిన మొదటి దేశీయ పురాణం ఇది. వీరశైవంలోని ముగ్ధ భక్తిని, వీర భక్తిని, జ్ఞాన భక్తిని ముప్పేటగా వర్ణించే రచన ఇది. ఇందులో బసవేశ్వరుని జీవితంతో పాటు అతని సమకాలీనులైన భక్తుల కథలను, ప్రాచీన శివ భక్తుల కథలను కలిపి వర్ణించాడు. అందువలన బసవ పురాణం శివభక్తి కథా సాగరంగా రూపొందింది.

శివారాధన

శివుని ఆరాధనకు శివాలయం ప్రధానమైన కేంద్రం. మన దేశంలోను మరియు రాష్ట్రంలోను ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వానిలో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు పంచారామాలు. మన రాష్ట్రంలో శ్రీశైలం మరియు శ్రీకాళహస్తి ముఖ్యమైన క్షేత్రాలు.

"https://te.wikipedia.org/w/index.php?title=శైవం&oldid=744909" నుండి వెలికితీశారు