ఆఘాపురా
ఆఘాపురా | |
---|---|
శివారు ప్రాంతం | |
Coordinates: 17°23′18″N 78°27′52″E / 17.3882°N 78.4645°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500457 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
ఆఘాపురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది హైదరాబాదు, నాంపల్లి, మెహదీపట్నం ప్రాంతాల మధ్యన ఉంది.
ప్రత్యేకత
[మార్చు]అఘాపురా చార్ఖండిల్కు ఈ ప్రాంతం పేరొందింది. ఈ ప్రాంతంలో రాత్రిపూట వెలిగే నాలుగు లైట్లు ఉండేవి. వాటికోసం నియమించబడిన వ్యక్తి, ప్రతిరోజూ సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించేవాడు. సూఫీ సాధువు షా మొహమ్మద్ హసన్ అబుల్ ఉలై శిష్యుడైన అఘా ముహమ్మద్ దావూద్ అబుల్ ఉలై పేరు మీద ఈ ప్రాంతానికి అఘాపురా అనే పేరు పెట్టబడింది.[1][2] ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అఘాపురా దర్గా అని కూడా పిలువబడే ఈ మందిరాన్ని ప్రదానం చేశారు.[3]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అఘాపురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి కిలోమీటరు దూరంలోని నాంపల్లి లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
వ్యాపారం
[మార్చు]అఘాపురా దర్గా ఉర్స్ (వేడుక) సందర్భంగా అఘాపురాలో ఉత్సవాలు జరుగుతాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐంఐఎం) పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాం వద్ద ఉండడంవల్ల ఈ ప్రాంతం రాజకీయంగా పేరుపొందింది.[4]
సమీప ప్రాంతాలు
[మార్చు]- బజార్ ఘాట్
- ధూల్‌పేట్
- గోషామహల్
- జియాగూడ
- కార్వాన్
- ఆసిఫ్‌నగర్
- ధూల్‌పేట్
- మెహదీపట్నం
- మసాబ్ ట్యాంక్
- మురాద్ నగర్
- నాంపల్లి
- సీతారామ్ బాగ్
- శాంతినగర్
మూలాలు
[మార్చు]- ↑ Khan, Asif Yar (2012-08-30). "Aghapura moving ahead with times". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.
- ↑ Iyer, Lalita (2018-01-28). "Illuminated Aghapura Dargah is a delight". Deccan Chronicle. Retrieved 2021-01-11.
- ↑ "World Heritage award". 2004. Archived from the original on 2009-08-03. Retrieved 2021-01-11.
- ↑ "AIMIM Headquarters at Darusalama". www.uniindia.com. 30 December 2018. Retrieved 2021-01-11.