బాగ్ లింగంపల్లి
బాగ్ లింగంపల్లి | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°23′57″N 78°29′51″E / 17.39918°N 78.49757°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500044 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
బాగ్ లింగంపల్లి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో ఒకటైన ఈ బాగ్ లింగంపల్లి ప్రాంతం వ్యాపారాలకు, నివాసానికి అత్యంత ప్రముఖమైన ప్రాంతంగా ప్రసిద్ధిచెందింది. నవాబులకు నివాసంగా ఉన్న ఈ ప్రాంతంలో పండ్ల తోటలు ఉండడం వల్ల దీనికి 'బాగ్' అని, పక్కనే ఉన్న లింగంపల్లిలోవున్న ట్యాంకులలో రాణులు స్నానం చేసేవారు. ఆర్.టి.సి. క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, బర్కత్‌పురా, హిమాయత్, నల్లకుంట, కోఠి మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది.
వాణిజ్యం
[మార్చు]బాగ్ లింగంపల్లిలో అనేక చాట్ బండార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, టీ స్టాల్స్, పాన్ షాప్స్, జ్యూస్ సెంటర్స్, రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి.
రవాణా
[మార్చు]బాగ్ లింగంపల్లి నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. దీనికి దగ్గరలో కాచిగూడ రైల్వేస్టేషను, విద్యానగర్ రైల్వే స్టేషనులు ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]ఈ డివిజనులో డా. బిఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల పరిధిలో పది, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ కళాశాలలు, లా అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ కళాశాల, నారాయణ జూనియర్ కళాశాల, సెయింట్ గాబ్రియల్స్ స్కూల్, గౌతం మోడల్ స్కూల్ వంటి ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి.[1]
సాంస్కృతిక కేంద్రం
[మార్చు]ఇక్కడ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ సాయిబాబా ఆలయం, సుందరయ్య ఉద్యానవనం ఉన్నాయి. వివిధ కార్యక్రమాల నిర్వహణకు సుందరయ్య విజ్ఞాన కేంద్రము కూడా ఉంది.
రహదారులు
[మార్చు]ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రహదారి ఉంది. 426 కోట్ల రూపాయల అంచనాతో ఇందిరా పార్కు - వి.ఎస్.టి. మధ్య స్టీల్ వంతెనను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బాగ్‌లింగంపల్లి, వి.ఎస్.టి. జంక్షన్ల మధ్య ఎక్కేందుకు ర్యాంపు ఏర్పాటుచేయబోతున్నారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ముషీరాబాద్ నియోజకవర్గం. "కళాశాలలు". Archived from the original on 15 అక్టోబరు 2016. Retrieved 8 June 2018.
- ↑ టీన్యూస్ (5 January 2018). "భాగ్యనగరంలో స్టీల్ వంతెనలు". Retrieved 8 June 2018.[permanent dead link]