సంజీవరెడ్డి నగర్
సంజీవరెడ్డి నగర్
ఎస్.ఆర్. నగర్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు Urdu |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500038 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సంజీవరెడ్డి నగర్ (ఎస్.ఆర్. నగర్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. భారతదేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గుర్తుగా దీనికి సంజీవరెడ్డి నగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది అమీర్‌పేటకు అతి దగ్గరలో ఉన్న వ్యాపార కేంద్రం.[1]
పేరు - చరిత్ర
[మార్చు]ఇది మొదటగా గురుమూర్తినగర్ గా పిలువబడుతుండేది. భారతదేశ ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడి 1967లో ఇక్కడ నివసించడం వల్ల ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశాడు. దాంతో 1975లో ఈ గురుమూర్తినగర్ ను సంజీవరెడ్డి నగర్ గా మార్చారు.
వాతావరణం
[మార్చు]ఎక్కువ చెట్లతో మంచి వాతావరణాన్ని కలిగివున్న ఈ ప్రాంతం నివాసానికి అనువుగా ఉంటుంది. దాదాపు సనత్‌నగర్లో కలిసేవున్న ఈ ప్రాంతంలో విభిన్న రకాల సంస్కృతి కనిపిస్తుంది. సంజీవరెడ్డి నగర్ రోడ్డు జంక్షన్ బొంబాయి-పూణే రోడ్డుకు అనుసంధానించబడి ఉంటుంది. 2000 సెప్టెంబరు 4న దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది. ఆయనను టార్గెట్ చేసిన మావోయిస్టులు ఇదే కూడలిలో కాల్చిచంపారు.[2]
చిత్రమాలిక
[మార్చు]-
సంజీవరెడ్డి నగర్ మైదానం
-
ఉమేశ్ చంద్ర విగ్రహం
మూలాలు
[మార్చు]- ↑ ది హన్న్ ఇండియా (18 November 2014). "SR Nagar A well-planned educational hub". Ch. Saibaba. Retrieved 23 May 2018.
- ↑ "Hyderabad: ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం: సీపీ ఆనంద్". EENADU. Retrieved 2022-03-29.