గోత్ర ప్రవరలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గోత్రము" అనగా ఒక వంశాన్ని తెలియుజేయునది, గోత్రపురుషుడు ఆ వంశ మూల పురుషుడు అయివుంటాడు, గోత్రపురుషుడు కేవలం వంశ మూలపురుషుడే కాకుండా వంశమునందలి సంతతి, కూటస్థుడు, పుత్రపౌత్ర పరంపరలోని వారు, ఆచార్య శిష్య పరంపరలోని మంత్రద్రష్టలు సైతం గోత్ర ప్రవర్తకులు కావచ్చును,

గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. ప్రతి గోత్రమునకు ఒక ప్రవర ఉండును. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు. మూలపురుషునితో సహా ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు తమ వంశానికి చెందిన మహర్షులు ప్రవరలో ముఖ్యమైనవారు, పూర్వము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకొనుటకై అభివాదం చేసుకొనేవారు. అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు,‌ గృహ్య సూత్రాలని ప్రస్తావించేవారు,

అశ్వలాయన, సాంఖ్యాయన, ఆపస్థంభ, భోదయన, సత్యషాడ, హిరణ్యకేశ, భరద్వాజ, వైఖానస, అగ్నివేశ్య, లోగాక్షి, కాత్యాయనులు, హోత్ర సూత్ర కర్తలు, వైవస్వత మను‌పదవీ కాలంలో సప్త ఋషులైన జమదగ్ని, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమ, అత్రి, కశ్యప, వశిష్టులు, గోత్ర గణాద్యులైన భృగువు(భార్గవ), ఆంగిరస, అగస్త్యులు ఈ గోత్ర ప్రవరలకు మూలకర్తలు.

మత్స్య పురాణం[మార్చు]

మత్స్య పురాణము ప్రకారం మత్స్య భగవానుడు వైవస్వత మనువుకు బ్రహ్మ దేవుడి ఆసీస్సులతో అగ్నినుండి ఆవిర్భవించిన మహర్షుల గురించి జ్ఞానబోధ చేశాడు. అగ్ని వెలుగు నుండి బృగు మహర్షి, అగ్ని కణాలనుండి ఆత్రి, అగ్ని శిఖల నుండి అంగీరసుడు, కాంతి ప్రసరణనుండి మైరీచి, అగ్ని కేశాల నుండి పులస్త్యుడు ఆవిర్భవించారు. అగ్ని ప్రవాహం నుండి పులహుడు, అగ్ని తేజస్సు నుండి వశిష్ఠుడు వచ్చారు. బృగు మహర్షికి ముగ్గురు పత్నులు నలుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మించారు -వారు దాత, విధాత, శుక్రాచార్య, చ్యవన, శ్రీమహాలక్ష్మి దాత పుత్రుండు ప్రాణుడు అవగా విధాతకు మృఖండ మహర్షి మృఖండునకు మార్కండేయుడు తనకు భావనారాయణ (వేదశీర్షుడు) అతని 100 పుత్రులు కలిగిరి

భార్గవ గోత్ర ప్రవర్తకాలు[మార్చు]

భార్గవ గోత్ర ప్రవర్తకాలు ఎవరనగా: బృగు, దాత, విధాత, మృఖండ, మార్కండేయ, భావనారాయణ, చ్యవన, అనుపవన, ఔర్వ, జమదగ్ని, వత్స్య, దంది, నదయన, వయాగన, వీతుహవ్య, పైల, శౌనక, శౌనకాయన, జీవంతి, ఆయేద, కార్షని, వైహీనరి, విరూపాక్ష, రౌహిత్యయాని, వైష్వానరి, నీల, లుబ్ద, శార్వానిక, విష్ణు, పౌర, బాలాకి, ఐలిక, అనంతభహిన, మ్రిగ, మర్గేయ, మండ, మాంద్య, మాండుక, ఫెనప, స్తనాతి, స్థల పింద, శిఖావర్న, షర్కరాక్షి, జాలధి, సౌధిక, క్షుభ్య, కుట్స, గాలవ, మండుకాయన, గర్గ్యయన, వైషంపయన, కౌట్స, కౌటిలి, వాగీయని, అనుమతి, అష్తిషేన, రూపి, వీతిహవ్య, రెవస మొదలైనవారు.

పై ఋషులనుండి ఐదు ప్రవరలు పేర్కొనబడ్డాయి.బృగు, విధాత, మృఖండ, మార్కండేయ, భావనార్షి బృగు, చ్యావన, అనుపవన, ఔర్వ, జమదగ్ని. మొదటి ముగ్గురి ఋషులకు చెందిన వంశస్తుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషేధం. అర్షిసేన, రూపి గోత్రీకుల మధ్య; బృగు వీతిహవ్య, రెవస, వైవస గోత్రీకుల మధ్య, అలాగే బృగు గోత్రీకుల మధ్య నాలు తరాల వరకూ వివాహాలు నిషిద్దం.

అంగీరస మహర్షి[మార్చు]

మరీచి మహర్షి కుమార్తె అయిన సురూపను అంగీరసుడు వివాహమాడిన తరువాత, వారి నుండి 10 కుమారులు - అత్మ, ఆయు, దమన, దక్ష, సద, ప్రాణ, హవిష్మాన, గవిష్త, రితు, సత్య జన్మించారు. వీటి గోత్ర ప్రవరకలు ఏమనగా: అంగీర, బృహస్పతి, భరధ్వాజ, గౌతమ/మౌడ్గల్య, సంవర్త/షైశిర. ఇతర గోత్ర ప్రవరకలు ఏమనగా - ఉతథ, థౌలేయ, అభిజిత్, సర్ధనెమి, సలౌగాక్షి, క్షీర, కౌష్టికి, రాహుకర్ణి, సౌపురి, కైరాటి, సమలోమకి, పౌషాజితి, భార్గవత్, చైరిదవ, కారోటక, సజీవి, ఉపబిందు, సురైషిన, వాహిణిపతి, వైశాలి, క్రోష్ట, ఆరుణాయని, సోమ, అత్రాయని, కాసెరు, కౌశల్య, పార్తివ, రౌహిణ్యాయని, రెవాగ్ని, ములప, పండు, క్షయా, విశ్వాకర, అరి, పారికారారి, అంగిర, సువచోతథ్య, ఉరిజ ఋషుల సంబదితుల మధ్య స్వగోత్ర వివాహలు నిషిద్దం.

, అంగీర, బృహస్పతి, భరద్వాజ, గార్గ, సైత్య వారి మధ్య రక్త సంబంధం ఉండరాదు. మరి ముఖ్యంగా కపితర్, స్వస్తితర్, దాక్షి, పతంజలి, భుయసి, జలసంధి, విందు, మాది, కుసిదకి, ఉర్వి, రాజకేషి, వౌషంది, షంసపి, శాలి, కలషికంత, కారిరియ, కాత్య, సౌబుద్ధి, ధాన్యాయని, లద్వి, దేవమణి వంటి వారికి అంగీర, దమవాహ్య, ఉరుక్షయ ప్రవరలు ఉన్నాయి కనుక వారి మధ్య వివాహాలు నిషిద్దం. సంక్రుతి, త్రిమాష్థి, మను, సంబధి, నచకేతి, థల, దక్ష, నారాయణి, లోక్షి, గర్గ్య, హరి, గాలవ, అనేహ వంటి వారికి అంగీర, సంక్రుతి, గౌరవితి ప్రవరలు ఉన్నాయి కనుక వీరి మధ్య వివాహలు నిషిద్దం.

కాత్యాయన, హరితాక, కౌట్స, హందిదాస, వాత్సాయని, మాద్రి, మౌళి, కుబేరని, భీమవేగ, శాస్వదర్భి వారికి అంగీర, బృహదాస్వ, జీవనాస్వ అను ప్రవరులున్నాయి కనుక వీరి మధ్య కూడా పరస్పర వివాహాలు నిషిద్దం.

అంగీర, బృహదృక్త, వామదేవ; అంగీర, సదస్యు, పురుకుట్స; అంగీర, విరూప, వృషపర్వ (రథితర) ; అంగీర, మత్స్యదగ్ధ, మృదుల; అంగీర, టాండి, మౌడ్గల్య; అంగీర, అజమీధ, కత్య; అంగీర, తిత్తిరి, గార్గ్య (కపిభు) వారు కూడా పరస్పర వివాహం చేసుకోరాదు.

అత్రి మహర్షి[మార్చు]

అత్రి మహర్షికి ఇద్దరు గోత్ర కర్తలున్నారు - కర్దమయాన, షారన షాఖియ. ఈ ఋషుల వంశావళి ఏమనగా... ఉద్వాలిక, షౌనకర్ణిరథ, షౌక్రతవ, గౌరగ్రీవ, గౌరజిన, చత్రాయన, అర్థపన్య, వామరథ్య, గోపన, ఆస్తిక, బిందు, కర్ణజిహ్వ, హరప్రీతి, లైద్రాణి, శాకలాయని, తైలప, శవైలేయ, అత్రి, గొణిపతి, జలద, భగపాద, సౌపుష్పి, చందోగేయ.

వీరి ప్రవర - శ్యవాష్వ, ఆత్రి, అర్చనాంష. ఈ గోత్రాల మధ్య పరస్పర వివాహాలు నిషిద్దం. దాక్షి, బాలి, ప్రణవి, ఉర్నునాభి, షిలార్దని, బీజవాపి, శిరిష, మౌంజకేష, గవిష్తర, బలంధన - వీరిలో ఆత్రి, గవిష్తర, పుర్వతిథి ప్రవరలు సాధారణంగా ఉంటాయి. ఆత్రేయ మహర్షి కుమార్తె అయిన ఆత్రేయి కలేయ, వాలేయ, వామరత్య, ధాత్రేయ, మైత్రేయ లను కనెను. వీరి ఋషి ప్రవరలు ఏమనగా - ఆత్రి, వామరాత్య, పౌత్రి. వీరి మధ్య వివాహాలు నిషిద్దం.

ఆత్రేయ మహర్షి[మార్చు]

ఆత్రేయ మహర్షి వంశానికి చెందిన సోమశాఖ (చంద్ర వంశం) లో ఋషి విశ్వామిత్రుడు జన్మించెను. ఇతడు తపస్సుచే బ్రహ్మ తత్వాన్ని పొంది బ్రహ్మర్షిగా మారెను. విశ్వామిత్రుడి వంశంలో వైశ్వామిత్రుడు (మధుచ్చందుడు), దేవరత, వైక్రుతుడు, గాలవ, వాతండ, శాలంక, అభయ, అయతాయన, షామాయన, యజ్ఞవాలక, జాబాల, సైంధవాయన, వాభ్రవ్య, కరీష, సంస్రుత్య, ఉలుప, ఆవోపహావ, పయోద, జనపాదప, ఖరబాచ, హలమయ, సాధిత, వాస్తుకౌశిక జన్మించెను. ఈ ఋషుల ప్రవరలు ఏమమనగా - విశ్వామిత్ర, దేవవ్రత, ఉద్దాల; సంబంధిత ప్రవరలు - దేవశ్రవ, దేవరత, విశ్వామిత్ర; విశ్వామిత్ర, మధుచంద, ధనుంజయ; విశ్వామిత్ర, మధుచంద, ఆఘమర్షణ; విశ్వామిత్ర, ఆరమరథ్య, వజ్జులి; విశ్వమిత్ర, లోహిత, ఆష్తక / ఫురణ; రునవాన్, ఘతిన, విశ్వామిత్ర; ఖిలిఖిలి, విద్య, విష్వమిత్ర: ఈ ప్రవరల్లో సగోత్రీకుల మధ్య వివాహాలు నిషిద్దం.

కశ్యప మహర్షి[మార్చు]

కశ్యప మహర్షి వంశంలో ప్రవర ఋషులు ఎవరనగా - అశ్రాయని, మేషకిరీటకాయన, ఉదగ్రజ, మాథర, భోజ, వినయలక్షన, షాలాహలేయ, కౌరిష్ట, కన్యక, అసురాయన, మ్రిగయ, షేతన, భొతపాయన, దేవయాన, గోమాయన, అధశ్చాయ, అభయ, కాత్యాయన, శాక్రాయన, బర్హియోగ, గదాయన, భావనంది, మహాచక్రి, దక్షాయన, బోధాయన, కార్తిక్య, హస్తిదన, వాత్స్యాయన, ప్రచేయ, జ్ఞాన సన్జేయ, ఆగ్న, ప్రాసెవ్య, వైవాశ్యప, ఉద్దలాయన, మారిచ, వైకర్నేయ, కాస్యపేయ, మాతంగి, బృగు మొదలైనవారు.

ఈ ఋషుల ప్రవర ఏమనగా - వత్సర, కాస్యప, నైధృవ/వశిష్ట. ఇక్కడ కూడా పరస్పర వివాహాములు నిషిద్దము. సమ్యతి, నభ, పిప్పల్య, జలంధర, భుజాతపుర, పుర్య, కర్దమ, గర్ధభిముక, కులహ, వృషకంద, మృగకేతు, శాండిల్య, దేవజాతి, పప్పలాది - వంటి ఋషుల సాధారణ ప్రవర అసిత, దేవల, కాస్యప.

వశిష్ట మహర్షి[మార్చు]

వశిష్ట మహర్షి వంశావళి ఏమనగా - వ్యాఘ్రపద, ఔపగవ, వైక్లవ, శ్రద్ధాలయన, కపిస్థల, ఔపలోమ, అలబ్ద, శత, కత, గౌపాయన, బోధప, దాకవ్య, బలిష్య, లోభయన, ఆపస్తున, స్వస్తికర, శాందిలి, సుమన, ఉపవృద్ది, బ్రహ్మబాల, యజ్ఞవాల్కవ్య. వీరిలో వషిట ప్రవర ఉన్నది, మరియూ వీరి మధ్య వివాహాలు నిషిద్దం.

ఇవి కూడా చూడండి[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

  • Sanskrit-English Dictionary by Monier-Williams, Munshiram Manoharlal Publishers Pvt Ltd, 55-Rani Jhansi Road, New Delhi-110055, Third Print 1988; (original publication Clarendon Press, Oxford, 1899).
  • Sanskrit-English Dictionary by Monier-Williams, ISBN 0-19-864308-X.
  • Vedārtha-Pārijāta by Swāmi Karpātri, introduction by Pattābhirām Śāstri, Śri Rādhā krishna Dhanuka Prakāśan Sansthān, Calcutta ; Sañchālaka : Vedaśāstra Research Centre, Kedārghat, Vārānasi,1979 (Sanskrit and Hindi, the introduction has an English translation as well).

మూలాలు[మార్చు]