చతుర్యుగాలు
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.
యుగాలు, మహా యుగము
[మార్చు]దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి) . మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము) . ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
- త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
- ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
- కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ప్రస్తుతం సుమారుగా 5126 సంవత్సరం ముగిసినవి)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.
యుగాదులు
[మార్చు]- కృత యుగాది - కార్తీక శుద్ధ నవమి
- త్రేతా యుగాది - వైశాఖ శుద్ధ తదియ
- ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
- కలి యుగాది - బాధ్రపద బహుళ త్రయోదశి
00-9o0-=-
యుగాల మధ్య జరిగిన ఒక కథ
[మార్చు]భాగవతం ఏకాదశ స్కందము నుండి [1]: ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరు గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన సుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)
సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు. రాత్రి కాలం కూడా అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రహ్మకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రహ్మ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్తుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.