తుర్కయాంజల్
తుర్కయాంజల్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°16′17″N 78°35′00″E / 17.271512°N 78.583399°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | అబ్దుల్లాపూర్ మెట్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,903 |
- పురుషుల సంఖ్య | 4,650 |
- స్త్రీల సంఖ్య | 4,253 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
తుర్కయాంజాల్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1] ఈ గ్రామం జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఈ మండలంలో పెద్ద గ్రామం. తుర్కయాంజల్ గ్రామ పరిధిలో మణిముత్యాలమ్మ కుంట, సంజీవరెడ్డి నగర్, శ్రీశ్రీ నగర్, కుర్మగూడ ఉప గ్రామాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న తుర్కయంజల్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[3]
గణాంకాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 8903 పురుషులు 4650, స్త్రీలు 4253. నివాస గృహాలు 1927, విస్తీర్ణం 2053 హెక్టార్లు. ప్రధాన భాష తెలుగు.
రవాణ సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామం హైదరాబాదు - నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది. హయత్ నగర్ ఇక్కడికి 9 కి.మీ దూరంలో ఉంది. రోడ్డు సౌకర్యం ఉంది.
పాఠశాలలు
[మార్చు]ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఒక అంగన్ వాడీ కేంద్రం ఉంది. సెయింట్ పాల్ స్కూలు, కె.బి.సైనిక హైస్కూలు ఉన్నాయి.
ఇతర గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలో ఒక బిస్కట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ వేంకటేశ్వరస్వామి దేవాలయం, బాలఏసు మందిరం అనే చర్చి ఉంది.
చిత్రమాలిక
[మార్చు]-
వీరమణి బిస్కేట్ ప్యాక్టరీ అవుట్ సైడ్
-
తుర్కయాంజల్ గ్రామం సైన్ బోర్డు
-
తుర్కయాంజల్ శ్లోక పాఠశాల సైన్ బోర్డు
-
సిమ్మెంట్ బ్రిక్స్ తయారీ ప్యాక్టరీ
-
బాలయేసు చర్చి ప్రాంగణం
-
మస్కటి డైరీ పార్లర్
-
తుర్కయాంజల్ మీదుగా నాగార్జున్ సాగర్ రోడ్డు
మూలాలు
[మార్చు]- ↑ https://www.census2011.co.in/data/town/574202-turkayamjal-andhra-pradesh.html
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.