Jump to content

హఫీజ్‌పేట

వికీపీడియా నుండి
హఫీజ్‌పేట
సమీపప్రాంతం
హఫీజ్‌పేట ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను
హఫీజ్‌పేట ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 049
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

హఫీజ్‌పేట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం. ఇది కూకట్‌పల్లి, మాదాపూర్‌, మియాపూర్‌ ప్రాంతాలకు సమీపంలో ఉంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 109 లో ఉంది.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

హఫీజ్‌పేట సమీపంలోని ప్రాంతాలు:[3]

  1. మదీనగూడ
  2. కొండపూర్
  3. శిల్పా లేఔట్
  4. కొత్తగూడ
  5. ఫార్చ్యూన్ ఫీల్డ్స్
  6. అల్విన్ కాలనీ
  7. సప్తగిరి కాలనీ
  8. అప్గోస్ కోప్ హెచ్‌ఎస్‌జి సొసైటీ
  9. ఉషోదయ ఎన్‌క్లేవ్

ప్రజా రవాణా

[మార్చు]

హఫీజ్‌పేట నుండి 5 కి.మీ.ల దూరంలో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట నుండి బస్సు నంబర్లు 222 (కోఠి-లింగంపల్లి-పటాన్‌చెరు), 10హెచ్ (ఆల్విన్ కాలనీ - సికింద్రాబాదు), 216కె/ఎల్ (లింగంపల్లి - మెహదీపట్నం) బస్సు సౌకర్యం ఉంది.[4]

ఇతర వివరాలు

[మార్చు]

స్వతంత్ర సమరయోధులు నివాసముండే సీ.ఆర్‌.ఫౌండేషన్‌, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు నిర్వహించే హైటెక్స్‌, హెచ్‌ఐసీసీ కేంద్రాలు, నోవాటెల్‌ హోటల్, హైటెక్స్‌ కమాన్‌ ముఖద్వారం, నిరుద్యోగులకు నిర్మాణరంగంలో శిక్షణ ఇచ్చే న్యాక్‌, కొండాపూర్‌ ఆర్టీయే కార్యాలయం ఈ ప్రాంతంలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 15 January 2020.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
  3. "Hafeezpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-15.
  4. "Genpact company has vacancy of Bpo Call Centre Executive in Mehboob Nagar, hyderabad". www.workindia.in. Retrieved 15 January 2020.