హస్మత్‌పేట్
హస్మత్‌పేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°28′20″N 78°29′10″E / 17.47222°N 78.48611°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
జోన్ | ఉత్తర జోన్ |
వార్డు | 121 |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500009 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
హస్మత్‌పేట్, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలాపూర్ మండలంలో ఉంది.[1] హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఇదీ ఒకటి. మధ్యతరగతి వారి నివాసప్రాంతంగా ఉన్న ఈ హస్మత్‌పేట్, చారిత్రాత్మకమైన హస్మత్‌పేట్ కైర్న్స్ను కలిగిఉంది.[2]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో బోయిన్ పల్లి, కృషి నగర్, ఎస్బి కాలనీ, మారుతి నగర్, భీమనపల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
చెరువులు
[మార్చు]ఇక్కడున్న హస్మత్ చెరువు (బాన్ చెరువు), హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని ముఖ్య చెరువుల్లో ఒకటి. ఈ చెరువు అల్వాల్ చెరువు నుండి హస్మత్‌పేట్ వరకు కలుపబడివుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ఈ చెరువులో నిమజ్జనం చేస్తారు.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హస్మత్‌పేట్ నుండి నగరంలోని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, అఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, నాంపల్లి, మేడ్చల్ వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలోని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఫతే నగర్ రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఉంది.
జనాభా
[మార్చు]ఈ ప్రాంతంలో అధికశాతంమంది హిందువులు, ముస్లింలు ఉండగా, క్రైస్తవులు, సిక్కులు, హిందూ కాతిక్ (సింకర్) వంటివారు కూడా ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Hasmathpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ "When culture comes to naught". hindu.com. The Hindu. 24 May 2009. Archived from the original on 11 జూన్ 2009. Retrieved 27 జనవరి 2021.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.