Jump to content

ఉపవేదములు

వికీపీడియా నుండి
(ఉపవేదాలు నుండి దారిమార్పు చెందింది)

ఉపవేదములు మొత్తం నాలుగు. అవి: ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్యవేదం. ఇవి నాలుగు వేదాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం లకు అనుబంధంగా ఉన్నాయి. ఒక్కొక్క ఉపవేదం ఒక్కొక్క శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది: ఆయుర్వేదం (ఋగ్వేదం), అర్థశాస్త్రం (యజుర్వేదం), గాంధర్వవేదం (సామవేదం), మరియు ధనుర్వేదం (అధర్వణవేదం).[1]

వేదాలు

[మార్చు]

ఋగ్యజుస్సామాథర్వాఖ్యాన్ వేదాన్ పూర్వాదిభిర్ముఖైః |
శాస్త్రమిజ్యాంస్తుతిస్తోమం ప్రాయశ్చిత్తం వ్యధాత్క్రమాత్ || (37)

ఆయుర్వేదం ధనుర్వేదం గాన్ధర్వం వేదమాత్మనః |
స్థాపత్యం చాసృజద్వేదం క్రమాత్పూర్వాదిభిర్ముఖైః || (38)
 
(భాగవతం, స్కంధం-3, అధ్యాయం-12)

ఉప వేదాలు

[మార్చు]
  1. ఆయుర్వేదం: ఇందులో 1. చరక సంహిత, 2. సుంసృత సంహిత 3. భావ ప్రకాశ, 4. బేల సంహిత ముఖ్యమైనవి. ఇది ఋగ్వేదానికి అనుబంధమైనది. ఇది వైద్యానికి సంబంధించిన శాస్త్రం.
  2. ధనుర్వేదం: ఇందు అగ్ని పురాణం, మహాభారతం, ప్రస్థానభేద, మధుర సరస్వతి ముఖ్యమైనవి. అధర్వణవేదంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది యుద్ధ కళలు, ఆయుధాలు మరియు రక్షణ పద్ధతుల గురించి వివరిస్తుంది.
  3. గాంధర్వ వేదం: ఇందు విష్ణు ధర్మోత్తరం, భరతుని నాట్య శాస్త్రం, రసమంజరి, కామసూత్ర ముఖ్యమైనవి. ఇది సామవేదానికి అనుబంధంగా ఉంటుంది. ఇది సంగీతం, నృత్యం మరియు కళలకు సంబంధించిన శాస్త్రం
  4. స్థాపత్యవేదం: ఇందు విశ్వకర్మకృత వాస్తుశాస్త్రము, శిల్పశాస్త్రము, మానసారము, అపరాజితాపృచ్ఛ, ముఖ్యమైనవి. యజుర్వేదంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది రాజనీతి, ఆర్థికశాస్త్రం మరియు మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. MD(Ayu), Dr J. V. Hebbar (2019-08-23). "Veda and Upaveda - Introduction". Easy Ayurveda Hospital (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-09-27.