Jump to content

ఆగ్నేయ రైల్వే

వికీపీడియా నుండి
(సౌత్ ఈస్ట్రన్ రైల్వే నుండి దారిమార్పు చెందింది)
ఆగ్నేయ రైల్వే
दक्षिण पूर्व रेलवे
5-South Eastern Railway
Eastern and South Eastern Railway headquarters Kolkata
లొకేల్West Bengal, Jharkhand and Odisha
ఆపరేషన్ తేదీలు1955–present
మునుపటిదిEastern Railway
ప్రధానకార్యాలయంGarden Reach, Kolkata, West Bengal, India
జాలగూడు (వెబ్సైట్)SER official website

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఆగ్నేయ రైల్వే (South Eastern Railway) ఒకటి. ఈ రైల్వే జోన్ గార్డెన్ రీచ్, కోలకతా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ లో మొత్తం అద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ నాలుగు (డివిజన్స్) విభాగాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

బెంగాల్ నాగపూర్ రైల్వే

[మార్చు]

నాగపూర్-ఛత్తీస్‌ఘడ్ రైల్వే లైన్ మార్చేందుకు 1887 సంవత్సరములో బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) కంపెనీలో, బ్రాడ్ గేజ్ చేయడానికి విలీనం చేయబడింది. ఈ పని 1888 లో పూర్తయింది. నాగపూర్ నుంచి అస్సంసోల్ వరకు వున్న ప్రధాన రైలు మార్గము యొక్క పొడిగింపు 1891 లో పూర్తయింది. బిలాస్‌పూర్ నుండి 161 మైళ్ల పొడవైన శాఖ లైన్ (258 కిమీ) ఉమారియా బొగ్గు గని వరకు కలుపుతూ ఒక రైలు మార్గము నిర్మించారు. ఈ మార్గమును అప్పటికే ఉమారియా నుండి కట్నీ (1891) వరకు వున్నటువంటి రైలు మార్గమునకు అనుసంధానము చేశారు. ఇరవయ్యో శతాబ్దం నందు, మారుతున్న పని (మార్పులు చెందుతున్న పనులు) దృష్ట్యా కలకత్తా-బొంబాయి, కలకత్తా-మద్రాస్ రైలు మార్గము పనులు పూర్తి అయినవి. ఇరవయ్యో శతాబ్దపు మొదటి అర్ధ భాగములో బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) కంపెనీలో రైలు మార్గము పని క్రమంగా పురోగమించింది. నెర్‌గుండి నుండి మొదలు పెట్టి ఒక రైల్వే లైన్ ద్వారా 1921 సంవత్సరములో తాల్‌చర్ కోల్‌ఫీల్డ్స్ నకు రైలు మార్గము ఏర్పాటు చేసారు. 1931 లో రాయపూర్ నుండి విజయనగరం నకు అనగా భారతదేశము లోని సెంట్రల్ ప్రావిన్స్ తో, ఈస్ట్ కోస్ట్ ప్రదేశములకు ఒక రైలు మార్గము ఏర్పాటు అయ్యింది. 1930 చివరి నాటికి బి.ఎన్.ఆర్. (బిఎన్‌ఆర్) దేశంలోని అతిపెద్ద నారో గేజ్ నెట్వర్క్ వాటా కలిగి ఉంది. బి.ఎన్.ఆర్. (బిఎన్‌ఆర్) నిర్వహణ 1944 అక్టోబరు 1 న బ్రిటీష్ భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతేకాక ఆ పేరు ద్వారానే ఏప్రిల్ 1952 14 వరకు అది కొనసాగింది. ఇది ఈస్ట్ ఇండియన్ రైల్వేతో ఉమ్మడి ఉన్నప్పుడు, భారతీయ రైల్వేలు కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు (మండలాలు) జోన్లలలో ఒకటి అయిన తూర్పు రైల్వేగా రూపాంతరము చెందింది.

ఆగ్నేయ రైల్వే

[మార్చు]
1955 లో భారతీయ రైల్వేలు వ్యవస్థ యొక్క ప్రధాన మార్గాలు

ఆగస్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు, నార్త్ సెంట్రల్ ప్రాంతంలో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది.[1][2] జూలై 1967 లో, సౌత్ ఈస్ట్రన్ రైల్వే బంకురా దామోదర్ నదీ తీరాన్ని స్వాధీనం చేసుకుంది.

Stations of the South Eastern Railway when the South Eastern Railway was created

ఏప్రిల్ 2003 వరకు, దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్, ఆద్ర, సంబల్పూర్, ఖుర్దా రోడ్, విశాఖపట్నం, చక్రధర్‌పూర్, బిలాస్‌పూర్, నాగపూర్ ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. ఏప్రిల్ 2003 లో ఆగ్నేయ రైల్వే నుండి రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 2003 ఏప్రిల్ 1 న సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క ఖుర్దా రోడ్, సంబల్పూర్, విశాఖపట్నం విభాగాలు కలిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఇ.కో.ఆర్) దేశానికి అంకితం చేయబడింది; 2003 ఏప్రిల్ 5 న దక్షిణ తూర్పు రైల్వే యొక్క నాగపూర్, బిలాస్‌పూర్ డివిజన్లు, ఒక కొత్తగా ఏర్పడ్డ రాయపూరు డివిజను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఆగ్నేయ మధ్య రైల్వే ) దేశానికి అంకితం చేయబడింది.

2003 ఏప్రిల్ 13 న, సౌత్ ఈస్టర్న్ రైల్వే జోను కొత్తగా రాంచి డివిజనును ఏర్పరచటానికి ఆద్రా, చక్రదార్పూర్ విభాగాలను పునర్వ్యవస్థీకరించారు.[3] ఆగ్నేయ రైల్వేలో టికియాపారా, పాన్సుర లలో ఎలక్ట్రిక్ బహుళ యూనిట్ షెడ్స్ ఉన్నాయి. ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్డ్లు సంత్రాగాచి, టాటానగర్, బొకారో స్టీల్ సిటీ, బోండముండాలలో ఉన్నాయి. డీజిల్ లోకోమోటివ్ షెడ్డ్లు ఖరగ్‌పూర్, బొకారో స్టీల్ సిటీ, బోండముండాలలో ఉన్నాయి. కోచ్ నిర్వహణ యార్డ్ సంత్రాగచిలో ఉంది. దక్షిణ తూర్పు రైల్వేలో ఖరగ్‌పూర్‌లో ఒక ప్రధాన వర్క్ షాప్ ఉంది.

పరిపాలన

[మార్చు]

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే సేవలు అందిస్తుంది. ఇది కోల్‌కతా, హల్దియాలకు ప్రధాన సరుకు రవాణాను కూడా నిర్వహిస్తుంది. ఆగ్నేయ రైల్వే హౌరా నుండి ఖరగ్పూర్, ఆమ్తా, మెదినాపూర్, టాటానగర్, భాలసోర్, రూర్కెలా, సంత్రాగచి నుండి షాలిమార్, కోల్‌కతా ప్రక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా సాధారణ విద్యుత్ బహుళ యూనిట్లు (ఈఎంయు) సేవలు నడుస్తుంది.

దక్షిణ తూర్పు రైల్వేచే నిర్వహించబడుతున్న ముఖ్యమైన రైళ్లు

[మార్చు]

దక్షిణ తూర్పు రైల్వే ఈ క్రింది రైళ్లను నిర్వహిస్తుంది:

Howrah - Mumbai Mail
Coromandel Express
East Coast Express
Yesvantpur-Howrah Express
Howrah – Chennai Mail

సుదూర రాత్రిపూట రైళ్లు

[మార్చు]

ఇంటర్‌సిటీ రైళ్ళు

[మార్చు]
  • 12891/12892 బరిపాద ఎక్స్‌ప్రెస్ (బాంగ్రీపోసీ నుండి భువనేశ్వర్)
  • 12821/12822 ధౌలి ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి పూరి)
  • 12814/12813 స్టీల్ ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి టాటానగర్)
  • 12871/12872 ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి టిట్లఘర్)
  • 12021/12022 జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి బార్బిల్)
  • 18617/18618 హౌరా – రాంచి ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి రాంచి )
  • 12885/12886 అరణ్యక ఎక్స్‌ప్రెస్ (షాలిమార్ నుండి భోజుధి)
  • 12865/12866 లాల్‌మతి ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి పురూలియా)
  • 12883/12884 రూపసి బంగ్లా ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి పురూలియా)
  • 12827/12828 హౌరా – పురూలియా ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి పురూలియా)
  • 12857/12858 తామ్రలిప్త ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి డిఘా)
  • 18001/18002 కందారి ఎక్స్‌ప్రెస్ (హౌరా నుండి డిఘా)
  • 22861/22862 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (షాలిమార్ నుండి బంకూర)
  • 18007/18008 షాలిమార్ – బరిపాద ఎక్స్‌ప్రెస్ (షాలిమార్ నుండి బరిపాద)
  • 12575/12576 ఖరగ్‌పూర్ – పురూలియా ఎక్స్‌ప్రెస్ (ఖరగ్‌పూర్ నుండి పురూలియా)
  • 18003/18004 ఝార్‌గ్రాం - పురూలియా ఎక్స్‌ప్రెస్ (ఝార్‌గ్రాం నుండి పురూలియా)

నాన్ స్టాప్ రైళ్లు

[మార్చు]
  • 12261/12262 హౌరా – ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12245/12246 హౌరా – యశ్వంతపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12222/12223 హౌరా – పూణే దురంతో ఎక్స్‌ప్రెస్
  • 12847/12848 హౌరా – డిఘా దురంతో ఎక్స్‌ప్రెస్

సంస్థ పరిపాలన

[మార్చు]

ఆర్ధిక సలహాదారులు

[మార్చు]
పేరు సంవత్సరం చేరడం సంవత్సరం విరమణ
రంజన్ తివారీ, ఐఆర్‌ఎఎస్ 2014 2019
విజయ్ కుమార్, (ఐఆర్‌ఎఎస్)

చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ల జాబితా

[మార్చు]
పేరు సంవత్సరం చేరడం సంవత్సరం విరమణ
ఐ. శ్రీరామ, ఐఆర్‌ఎస్‌ఈఈ
అంబిక ప్రసాద్, ఐఆర్‌ఎస్‌ఈఈ
బిశ్వజిత్ పాన్

కమర్షియల్స్ ట్రాఫిక్ మేనేజర్లు

[మార్చు]
పేరు సంవత్సరం చేరడం సంవత్సరం విరమణ
సుధీంద్రనాథ్ గుప్తా, బిఎన్‌ఆర్ 1948 1950
బి.కె. డే, బిఎన్‌ఆర్ 1950 1952

చీఫ్ మెకానికల్ ఇంజనీర్లు

[మార్చు]
పేరు సంవత్సరం చేరడం సంవత్సరం విరమణ
ఒ.పి. కౌబే, ఐఆర్‌ఎస్‌ఎంఈ
పి.కె. చటర్జీ, ఐఆర్‌ఎస్‌ఎంఈ
ఆర్.విజయ మోహన్, ఐఆర్‌ఎస్‌ఎంఈ

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Rao, M.A. (1988). Indian Railways, New Delhi: National Book Trust, pp.42–3
  2. "The Eastern Railway-About us". The Eastern Railway. Archived from the original on 2008-09-14. Retrieved 2018-05-20.
  3. "Major events since trifurcation (1.4.2003)". South Eastern Railway website. Archived from the original on 2005-11-19. Retrieved 2015-10-17.

బయటి లింకులు

[మార్చు]

మూసలు , వర్గాలు

[మార్చు]