శంషాబాద్ (పి)
శంషాబాద్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′58″N 78°24′20″E / 17.26619°N 78.40551°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | శంషాబాద్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 87,837 |
- పురుషుల సంఖ్య | 45,201 |
- స్త్రీల సంఖ్య | 42,636 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
శంషాబాద్ (పి), తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న శంషాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 87,837 - పురుషులు 45,201 - స్త్రీలు 42,636.సముద్రమట్టనికి 581 మీ.ఎత్తు[4]
ప్రముఖులు
[మార్చు]- బంగారు లక్ష్మణ్ - భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.ఇతను నర్సింహ, శివమ్మ దంపతులకు 1939 మార్చి 17న శంషాబాద్ పట్టణంలోని సిద్దంతి బస్తీలో అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించాడు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]శ్రీ విద్యా హైస్కూల్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, ఒయాసిస్ హైస్కూల్, శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజి, గవర్నమెంట్ జూనియర్ కాలేజి ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
[మార్చు]హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ శంషాబాద్ మండలంలో ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ సమీపంలో మెట్రో స్టేషన్‌ను ప్లాన్ చేసింది.[5][6][7] రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; ఉమ్రానగర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 18 కి.మీ దూరంలో ఉంది.
అంతర్జాతీయ విమానాశ్రయం
[మార్చు]నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.23 మార్చి 2008 న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీని మొత్తం విస్తీర్ణం 5400 ఎకరాలు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-14. Retrieved 2016-07-09.
- ↑ "HAML completes 21 km of pre-construction survey work".
- ↑ "Pre-construction works for Hyderabad Airport Metro works in full swing".
- ↑ "Airport metro progressing at a brisk pace".