అక్షాంశ రేఖాంశాలు: 17°21′24″N 78°30′44″E / 17.35666°N 78.512199°E / 17.35666; 78.512199

సంతోష్‌నగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోష్‌నగర్
సమీపప్రాంతం
సంతోష్‌నగర్ is located in Telangana
సంతోష్‌నగర్
సంతోష్‌నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
సంతోష్‌నగర్ is located in India
సంతోష్‌నగర్
సంతోష్‌నగర్
సంతోష్‌నగర్ (India)
Coordinates: 17°21′24″N 78°30′44″E / 17.35666°N 78.512199°E / 17.35666; 78.512199
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
జోన్దక్షిణ జోన్
వార్డు21
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 059
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సంతోష్‌నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక నివాస, వాణిజ్య ప్రాంతం. ఇది హైదరాబాదు పాతబస్తీలోని సైదాబాద్ సమీపంలో ఉంది. దీనిని ఓల్డ్ సంతోష్‌నగర్ కాలనీ, న్యూ సంతోష్‌నగర్ కాలనీ అని రెండు ప్రాంతాలుగా విభజించారు.[1] ఈ ప్రాంతం, ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ శాసనసభ్యుడు సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రి ప్రాతినిధ్యం వహిస్తున్న యాకుత్ పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

సంతోష్‌నగర్‌లో ప్రధాన రహదారిపై మోర్, బిగ్ బజార్, ఫ్రెష్ మొదలైన సూపర్ మార్కెట్లు ఉన్నాయి. కూరగాయలు, కిరాణా సామాగ్రి కోసం ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైదాబాద్‌లో మదన్నపేట మార్కెట్ ఉంది. ఇక్కడ యాదగిరి సినిమా థియేటర్, వెంకటేశ్వర దేవాలయం, కనకదుర్గ దేవాలయం, మస్జిద్ ఇ బాగ్దాడియా, మసీదు ఇ సహబా, మసీదు ఇ నుస్రత్ ఉన్నాయి.

ప్రజా రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (102, 103, 104, 203, 253, 478 బస్సు నెంబర్లు) ఉంది. ఇక్కడికి సమీపంలోని యాకుత్‌పురా, మలక్‌పేటలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడినుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 14 కిలోమీటర్ల (8.7 మైళ్ళ) దూరం ఉంటుంది. 30 నిమిషాలలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు.[1]

సమీప ప్రాంతాలు

[మార్చు]
  • ఎడి బజార్
  • మారుతి నగర్,
  • దుర్గా భవానీ నగర్
  • యాదగిరి నగర్
  • చంపాపేట
  • సైదాబాద్ కాలనీ, ల్యాబ్ క్వార్టర్స్

సంతోష్‌నగర్‌లోని కాలనీలు:

  • ఖలాందర్ నగర్
  • మామా బక్తావర్ హాత్
  • బాను నగర్

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

ఈ ప్రాంతంలో అపోలో డిఆర్‌డిఓ, ఒవైసి హాస్పిటల్, శ్రీనివాస, నైటింగేల్, ఎంఎస్ పాలీ క్లినిక్ & డెంటల్ కేర్ మొదలైన ఆసుపత్రులు ఉన్నాయి.

విద్య

[మార్చు]

ఈ ప్రాంతంలో దక్కన్ వైద్య విజ్ఞాన సంస్థ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ పాయింట్ కోచింగ్ సెంటర్[2] వంటి విద్యా సంస్థలు, ఇతర కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. నారాయణ జూనియర్ కళాశాల[3], శ్రీనివాస జూనియర్ కళాశాల వంటి అనేక ఉన్నత విద్యా కళాశాలలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Santosh Nagar Road Locality". www.onefivenine.com. Retrieved 2021-01-14.
  2. SPCC - Official Website. "Coaching Center and Educational Academy". SPCC.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-27. Retrieved 2021-01-14.