Jump to content

సీతాఫల్‌మండి

అక్షాంశ రేఖాంశాలు: 17°25′32″N 78°31′09″E / 17.425556°N 78.519225°E / 17.425556; 78.519225
వికీపీడియా నుండి
సీతాఫల్‌మండి
సమీప ప్రాంతాలు
సీతాఫల్‌మండి is located in Telangana
సీతాఫల్‌మండి
సీతాఫల్‌మండి
Location in Telangana, India
సీతాఫల్‌మండి is located in India
సీతాఫల్‌మండి
సీతాఫల్‌మండి
సీతాఫల్‌మండి (India)
Coordinates: 17°25′32″N 78°31′09″E / 17.425556°N 78.519225°E / 17.425556; 78.519225
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500061
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

సీతాఫల్‌మండి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషనుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతాఫల్‌మండికి తూర్పున ఉస్మానియా విశ్వవిద్యాలయం, దక్షిణాన వారసిగూడ, పశ్చిమాన సికింద్రాబాద్, ఉత్తరాన తార్నాక వంటి ప్రాంతాలు ఉన్నాయి.

పేరు వెనక చరిత్ర

[మార్చు]

ఇక్కడ సీతాఫలాలు లభించే మండి (మార్కెట్) ఉండడం వల్ల దీనికి సీతాఫల్‌మండి అని పేరు వచ్చింది.

విద్య

[మార్చు]

ఇక్కడ అనేక పారశాలలు, కళాశాలలు ఉన్నాయి. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ఏర్పాటుచేసిన జాతీయ విశ్వవిద్యాలయమైన ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయము ప్రధాన కేంద్రం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది.

ఇఫ్లూ విశ్వవిద్యాలయం

సంస్కృతి

[మార్చు]

ఇక్కడ వివిధ మతాల సంస్కృతి, ఆచారాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ రామలింగేశ్వరస్వామి ఆలయం, పోచమ్మ ఆలయం, సాయిబాబా ఆలయం వంటి హిందూ దేవాలయాలు... రెండు మసీదులు, ఒక గురు ద్వారా ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని నామాలగుండు ప్రాంతంలో ఇటీవలే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడింది.

రవాణా వ్యవస్థ

[మార్చు]

హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈ సీతాఫల్‌మండి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ సీతాఫల్‌మండి రైల్వే స్టేషను కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా 86, 107, 57ఎస్, 2వి, 16ఎస్ నంబరు గల బస్సులు సికింద్రాబాద్, జామియా ఉస్మానియా, రాంనగర్ నుండి సీతాఫల్‌మండి మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు నడుపబడుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి చే 2009, ఆగస్టు 14న రైల్ ఓవర్ వంతెనకు శంకుస్థాపన చేయబడింది.[1]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  1. కార్తీక్‌ రత్నం (కేరాఫ్ కంచరపాలెం సినిమా నటుడు)[2]

మూలాలు

[మార్చు]
  1. "Sitaphalmandi ROB opens to traffic". The Times of India. 15 July 2009. Archived from the original on 15 July 2012. Retrieved 14 September 2010.
  2. సాక్షి (10 September 2018). "హీరో లేడు.. విలన్‌ లేడు." Archived from the original on 14 September 2018. Retrieved 14 September 2018.