Jump to content

పద్మారావు నగర్

అక్షాంశ రేఖాంశాలు: 17°25′24″N 78°30′38″E / 17.423333°N 78.510489°E / 17.423333; 78.510489
వికీపీడియా నుండి
పద్మారావు నగర్
సమీపప్రాంతం
దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ విగ్రహం
దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ విగ్రహం
పద్మారావు నగర్ is located in Telangana
పద్మారావు నగర్
పద్మారావు నగర్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°25′24″N 78°30′38″E / 17.423333°N 78.510489°E / 17.423333; 78.510489
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyవార్డు 6, హైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 025
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసనత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

పద్మారావు నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది సికింద్రాబాదుకు సమీపంలో ఉంది.[2] ఈ ప్రాంతానికి దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ పేరు పెట్టబడింది. అప్పట్లో సికింద్రాబాదులో పెద్దసంఖ్యలో బ్రిటిష్ సైన్యపు దళాల గుడారాలు మాత్రమే ఉండేవని మిస్టర్ లూథర్ లష్కర్ - 200 ఇయర్స్ ఆఫ్ సికింద్రాబాదు పుస్తకంలో రాశాడు. బ్రిటీష్ వారి శిబిర అనుచరులుగా పనిచేసిన ముదలియార్లు విద్య, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి, సికింద్రాబాద్ క్లబ్ అభివృద్ధికి కృషి చేశారు.[3] బ్రిటీష్ పాలన సమయంలో దీనిని గతంలో వాకర్ టౌన్ అని పిలిచేవారు.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ముషీరాబాద్, చిలకలగూడ, సీతాఫల్ మండి, భోయిగూడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్కందగిరి, పోల్బల్ హనుమాన్ దేవాలయం, సాయిబాబా దేవాలయం, సర్దార్ పటేల్ కళాశాల, దుండూ మాన్షన్, ఫిన్‌లైన్ రెసిడెన్సీ, కొంజీవరం హౌస్, గాంధీ వైద్య కళాశాల (అంతకుముందు ఈ ప్రాంతంలో ముషీరాబాద్ జైలు ఉండేది), స్వరాజ్య ప్రెస్ (ఇప్పుడు ఆడిటోరియంగా మారింది) ఉండేవి.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

నీలగిరి, హెరిటేజ్ ఫ్రెష్, ఉషోదయా షాపింగ్ కాంప్లెక్సులు, ఏటిఎంలు, రెస్టారెంట్లు, గాంధీ వైద్య కళాశాల, పల్స్ ఆస్పత్రి, సర్దార్ పటేల్ కళాశాల, ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్.డి.ఎఫ్.సి., ఐసిఐసిఐ బ్యాంకు మొదలైనవి ఉన్నాయి. గాంధీ వైద్య కళాశాల, తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తమ వైద్య కళాశాలగా, భారతదేశంలో మొదటి 20 స్థానాల్లో ఒకటిగా నిలిచింది.[4]

రవాణా

[మార్చు]

పద్మరావు నగర్ ప్రాంతం సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకు సమీపంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో పద్మరావు నగర్ మీదుగా 1 పి (రెతిఫైల్ నుండి అఫ్జల్‌గంజ్), 2 పి (రెతిఫైల్ నుండి జియాగూడ), 20 పి (రెతిఫైల్ నుండి నాంపల్లి), 44 (పార్సిగుట్ట), 40 (కోఠి నుండి సికింద్రాబాదు రైల్వే స్టేషను) బస్సులు నడుపబడుతున్నాయి.[5] ఇక్కడికి సమీపంలోని సీతాఫల్‌మండిలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను, గాంధీ వైద్య కళాశాల దగ్గర మెట్రో స్టేషను ఉంది.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  1. శేఖర్ కమ్ముల (సినీ దర్శకుడు)
  2. నర్సింహారావు (సినీ సహాయ నటుడు)
  3. దువ్వాసి మోహన్ (సినీ హాస్యనటుడు)
  4. చింతలపుడి సూర్యనారాయణరావు (న్యాయవాది)
  5. కవితా రావు (యాంకర్)

మూలాలు

[మార్చు]
  1. "Padmarao Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-02-05.
  2. CM interacts with Padmarao Nagar residents
  3. http://www.deccanchronicle.com/hyderabad/british-left-their-mark-secunderabad-luther-922 Archived 2011-01-15 at the Wayback Machine
  4. "Top 25 Medical Colleges In 2017 | Outlook India Magazine". www.magazine.outlookindia.com/. Archived from the original on 2021-01-23. Retrieved 2021-02-05.
  5. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-05.